'ఈసారి మల్టీస్టారర్'- ఊహించని కాంబోతో అనిల్ నెక్ట్స్ సినిమా
Anil Ravipudi Next Movie- తదుపరి సినిమా ప్రకటించేసిన అనిల్ రావిపూడి- ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్స్టాప్!

Published : February 26, 2026 at 7:32 PM IST
Anil Ravipudi Next Movie : టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కీలక ప్రకటన చేశారు. తన తదుపరి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. తాను నెక్ట్స్ తెరకెక్కించనున్న సినిమా వివరాలను ఆయనే స్వయంగా వెల్లడించారు. నందమూరి కల్యాణ్‌రామ్ - దగ్గుబాటి వెంకటేశ్‌తో మల్టీస్టారర్ సినిమా తీస్తున్నట్లు ఆనౌన్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేశారు.
"మొదటి వందకోట్ల బొమ్మ కొట్టిన హీరో విక్టరీ వెంకటేశ్, మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కల్యాణ్‌రామ్ గారితో కలిసి 2027 మొదటి పండగకు మీ ముందుకు వస్తున్నాం" అని అనిల్ రావిపూడి ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అప్పుడే ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయి.
మొదటి " వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరో.. victory @VenkyMama గారితో🔥
— Anil Ravipudi (@AnilRavipudi) February 26, 2026
"మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో @NANDAMURIKALYAN గారితో కలిసి 💥
2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం 😍😍😍#VenkyAnil5 #NKRxAR pic.twitter.com/WRVWdbQpbz
కాగా, అనిల్ రావిపూడి 2015లో పటాస్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక వెంకటేశ్- వరుణ్ తేజ్‌తో తెరకెక్కించిన ఎఫ్ 3 సినిమా 2019లో రిలీజై రూ.100 కోట్లు వసూల్ చేసింది.

