ETV Bharat / entertainment

ఐటమ్ సాంగ్స్ నమ్ముకునే మేకర్స్​కు 'ధురంధర్' హర్రర్ సినిమాలాంటింది!: ఆర్జీవీ సంచలన పోస్ట్

'ధురంధర్'పై మరోసారి ప్రశంసలు కురిపించిన దర్శకుడు రామ్​గోపాల్ వర్మ- 50ఏళ్లలో ఇంతలా ఏ సినిమా గురించి మాట్లాడుకోలేదని ట్వీట్- ఈసారి సెన్సేషనల్ పోస్ట్​తో హాట్​టాపిక్​గా నిలిచిన ఆర్జీవీ

Ram Gopal Varma
Ram Gopal Varma (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : December 25, 2025 at 4:04 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ram Gopal Varma On Movie Makers : రణ్​వీర్ సింగ్ - ఆధిత్య ధర్ కాంబోలో వచ్చిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుంది. డిసెంబర్ 05న రిలీజైన ఈ సినిమాకు ఆల్​ఓవర్​ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటిదాకా ఈ సినిమా రూ. 925 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్ వర్మ మరోసారి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కానీ, ఈసారి ఓ ఉదాహరణతో ఫిల్మ్​మేకర్స్​ను ఉద్దేశించి సంచలన పోస్టు షేర్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

'ధురంధర్​లాంటి సూపర్ హిట్​ సినిమా వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు దాన్ని పట్టించుకోనట్లుగా నటిస్తారు. అలాంటి సినిమా స్థాయిని తాము అందుకోలేమన్న భయంతోనే వాళ్లు అలా చేస్తారు' అని వర్మ పోస్ట్ చేశారు. అలాగే ఈ పరిస్థితిని ఓ ఉదాహరణతో వివరించారు. 'మనం ఇతరుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ వాళ్ల కుక్క మనకు కనిపిస్తుంది. అది కరవదని, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దని ఆ ఇంటి ఓనర్ మనకు చెప్పి ధైర్యం ఇచ్చినా, మన ధ్యాసంతా ఆ కుక్కపైనే ఉంటుంది. భయంతో మనం మాత్రం దాన్ని చూస్తూనే ఉంటాం'

'ధురంధర్ సినిమా కూడా అలాంటి కుక్కలాంటిదే. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్​లు నిర్మిస్తున్న ఫిల్మ్​మేకర్స్ ఆఫీసుల్లో ధురంధర్ సినిమా భయపెట్టే కుక్కలాగా తిరుగుతుంది. ఆ పేరు తీసుకోవడానికి కూడా వాళ్లు భయపడుతున్నారు. కానీ వాళ్లను ధురంధర్ సినిమా వెంటాడుతూనే ఉంటుంది. వీఎఫ్​ఎక్స్, భారీ సెట్లు, ఐటెమ్ సాంగ్, హీరో ఇమేజ్​నే నమ్ముకొని భారీ బడ్జెట్​ సినిమాలు నిర్మించే వాళ్లకు ధురంధర్ హర్రర్ సినిమాలాంటిది. హీరోను కాకుండా కథను పూజించే సినిమా ఇది. ఆధిత్య ధర్ తెరకెక్కించిన ఈ ధురంధర్ సినిమా ఒక హిట్​ చిత్రమే కాదు, గత 50ఏళ్లలో అత్యధిక మంది మాట్లాడుకున్న సినిమాగా నిలిచింది' అని వర్మ ఎక్స్​లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్​ ఇండస్ట్రీలో టాక్​ ఆఫ్ ది టౌన్​గా మారింది.

ధురంధర్​పై వర్మ రివ్యూ
కాగా, ఈ సినిమాపై వర్మ ఇప్పటికే తన రివ్యూ ఇచ్చారు. ఇది భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేసిందని అన్నారు. ప్రారంభం నుంచి చివరి దాకా ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా తెరకెక్కించారని దర్శకుడు ఆధిత్య ధర్​ను ప్రశంసించారు. సినిమా మొత్తం చూసిన తర్వాత మన మనసుల్లో ఏదో తెలియని ఎమోషన్​ నిండిపోతుందని ఇదంతా దర్శకుడి గొప్పతనం అని ఆర్జీవీ ధురంధర్ సినిమాపై తన రివ్యూను షేర్ చేసుకున్నారు.

డిసెంబర్ 05న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. మూడో వారంలోనూ తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.925 కోట్లు గ్రాస్ సాధించింది. దీంతో ఇప్పటికే 2025లో హైయ్యెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు కొట్టింది. ఇక మరో ఒకట్రెండు రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్​లో చేరడం పక్కా అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్ అందుకుంటే, రణ్​వీర్ సింగ్ కెరీర్​లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది నిలుస్తుంది.

'తిరుమల గుడిలోకి చెప్పులతో వెళ్లే సీన్​పై సెన్సార్ బోర్డుతో యుద్ధమే చేశా'- ఆర్జీవీ

'ఇలాంటి స్టోరీతో ఇప్పటిదాకా ఏ సినిమా రాలేదు'- 'ధురంధర్​'పై ఆర్జీవీ రివ్యూ