సమ్మర్లో 'ధురంధర్' సీక్వెల్- 'పెద్ది', 'ప్యారడైజ్' సినిమాలకు పోటీ తప్పదా?
ధరంధర్ పార్ట్ 2పై మరింత ఆసక్తి- పాన్ఇండియా సినిమాలకు పోటీ తప్పేలా లేదు- మన సినిమాలకు హిందీ వసూళ్లపై ఎఫెక్ట్ పడే ఛాన్స్!

Published : December 25, 2025 at 12:54 PM IST
Dhurandhar Part- 2 Update : బాలీవుడ్ లేటెస్ట్ మూవీ 'ధురంధర్' బాక్స్ఫీస్ను షేక్ చేస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా ముగింపు ఉత్కంఠభరితంగా ఉండడంతో సీక్వెల్‌పైనా అంచనాలు నెలకొన్నాయి. సెకండ్ పార్ట్ కూడా తొలి భాగంలాగానే స్రై యాక్షన్ థ్రిలర్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని మూవీ మేకర్స్ హింట్ ఇవ్వడంతో సీక్వెల్ గురించి ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ రిలీజ్, టాలీవుడ్లో పలు భారీ బడ్జెట్ సినిమాలపై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది!
పార్ట్- 2 రిలీజ్ ఎప్పుడు?
'ధురంధర్' బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ఇతర సినిమాల సీక్వెల్స్ లాగా లాంగ్ గ్యాప్ తీసుకోకుండా సెకండ్ పార్ట్‌ను అతి త్వరలోనే విడుదల చేయలని మేకర్స్ అనుకుంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో 2026 మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ టైంలో రంజాన్ ఫెస్టివల్ ఉన్నందున ఆ వీకెండ్ మరింత కలిసొస్తుందని ఈ డేట్‌ను ఫిక్స్ చేసినట్టు తెెలుస్తోంది.
ఈసారి 5 భాషల్లో
అంతేకాకుండా 'ధురంధర్- 2' ని ఫస్ట్ పార్ట్‌లా కేవలం హిందీలోనే కాకుండా సౌత్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పాన్ఇండియా భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సౌత్‌లో తమిళనాడు, కర్ణాటక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ధురంధర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. అందుకే సీక్వెల్‌ను పాన్ఇండియా భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తునట్టు సమాచారం.
A phenomenon at full force! 💥🔥
— Jio Studios (@jiostudios) December 25, 2025
Book your tickets.
🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Making Merry Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande @LokeshDharB62 @jiostudios… pic.twitter.com/vTQnGn9cxL
ఆ సినిమాలకు గట్టి పోటీ !
పార్ట్-1కు ఫుల్హైప్ రావడంతో ధురంధర్-2పైనా అంచనాలు నెలకొన్నాయి. అయితే పాన్ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న సినిమాలు కొన్ని వచ్చే ఏడాది మార్చిలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. సమ్మర్ అడ్వాంటేజ్తోనే పలు సినిమాల మేకర్స్ మార్చ్ రిలీజ్‌పై కన్నేశారు! రామ్‌చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్', అడవి శేష్ 'డకాయిట్', పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్‌సింగ్'తోపాటు కన్నడ హీరో యశ్ మూవీ 'టాక్సిక్' 2026 మార్చిలోనే వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇవన్నీ పాన్ఇండియా సినిమాలే. సౌత్‌తోపాటు హిందీలోనూ భారీ వసూళ్లే టార్గెట్‌గా రానున్నాయి.
ఈ క్రమంలో ధురంధర్ సీక్వెల్ సమ్మర్లో రానుండడంతో పాన్ఇండియా సినిమాలకు టఫ్ కాంపిటిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. తెలుగు సినిమాలకు నార్త్‌లో పెద్ద నగరాలలో స్క్రీన్స్ అడ్డెస్ట్మెంట్ కూడా కష్టంగా ఉండే అవకాశం ఉంది. దీంతో మార్చిలో ధురంధర్ సీక్వెల్ వస్తే, మన తెలుగు సినిమాలకు హిందీ బెల్ట్‌లో తీవ్ర పోటీ ఎదురవ్వడం ఖాయం. ఇది హిందీ కలెక్షన్లపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. మరి సమ్మర్ బాక్సాఫీస్ పోటీ ఎలా ఉండనుందో చూడాలి.
It’s a CENTURY for #ChikiriChikiri! 🏏💯
— PEDDI (@PeddiMovieOffl) December 16, 2025
We are overwhelmed by the massive love!
✨ 100M+ Views (Telugu)
✨ 150M+ Views (Across 5 languages)
Thank you for making this the anthem of the season. Keep the reels coming! ❤️
Listen now: https://t.co/ZXrtgHooyi
#PEDDI WORLDWIDE… pic.twitter.com/4UGTf5Fohr
ఏదేమైనప్పటికి ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న 'ధురంధర్' సీక్వెల్, ముందుగా అనుకున్నట్లే 2026 మార్చి 19న థియేటర్లోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే సమ్మర్ బరిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నందున పోటీ నుంచి ఎవరైనా తప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ధురంధర్ పార్ట్-1 సినిమా విషయానికొస్తే, ఈ నెలలో బాక్సాఫీ వద్ద పోటీ ఎక్కువగా లేకపోవడం దీనికి ప్లస్ పాయింట్‌గా మారింది. ఇప్పటిదాకా వరల్డ్‌వైడ్‌గా రూ.925 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. దీంతో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా ధురంధర్ రికార్డ్ కొట్టింది. ఈ చిత్రంలో కీ రోల్లో రణ్వీర్ సింగ్ నటించారు. అక్షయ్ ఖన్నా, టాలెంటెడ్ యాక్టర్ ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ, మానవ్ గోహిల్ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించారు.
'ధురంధర్' OTT అప్డేట్ - తెలుగు వెర్షన్ కూడా!- రిలీజ్ ఎప్పుడంటే?
'ధురంధర్' దూకుడు- వసూళ్లలో హిందీ ఇండస్ట్రీ రికార్డు బ్రేక్- ఆ రికార్డు మాత్రం బన్నీదే!

