స్పిరిట్: పోస్టర్లో ప్రకాశ్ రాజ్ ఐడీ ఎక్కడ? అసలు సినిమాలో ఉన్నట్లా? లేనట్లా?
పోస్టర్స్‌లో ప్రకాశ్ రాజ్ పేరు ట్యాగ్ చేయని స్పిరిట్ టీమ్- ఇంతకు ముందే క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్ రాజ్- ఏం జరుగుతుందోనని చర్చ!

Published : February 28, 2026 at 2:08 PM IST
Prakash Raj Spirit Movie : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమాలో సీనియర్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు గతేడాది విడుదల చేసిన ఆడియో గ్లింప్స్ ద్వారా చిత్ర బృందం అనౌన్స్ చేసింది. అందులో ప్రధానంగా ప్రకాశ్ రాజ్ వాయిస్ ఫుల్ హైప్ పెంచడంతో ఆయన క్యారెక్టర్‌కు ఫుల్ స్కోప్ ఉండనుందని సమాచారం. కానీ తాజాగా విడుదల చేసిన స్పిరిట్ పోస్టర్లో ప్రకాశ్ రాజ్ ఐడీని ట్యాగ్ చేయలేదు. దీంతో చిత్రంలో అసలు ప్రకాశ్ రాజ్ యాక్ట్ చేస్తున్నారా లేదా అనే అనుమానాలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.
పేరు ట్యాగ్ చేయని టీమ్
తాజాగా స్పిరిట్ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా శుక్రవారం సోషల్ మీడియాలో అధికారికంగా షేర్ చేశారు. ఇందులో ఒబరాయ్ విలన్‌గా నటిస్తున్నట్లు పోస్ట్ ఆధారంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మూవీకి సంబంధించిన వారి ఐడీలను చిత్ర బృందం ట్యాగ్ చేసింది. కానీ ఆ పేర్లలో ప్రకాశ్ రాజ్ ఐడీ కనిపించకపోవడంతో ప్రేక్షకులు అయోమయంలో ఉన్నారు.
ఆరుకు పైగా పోస్టర్లు
తాజాగా విడుదలైన పోస్టర్లోనే కాకుండా ఇంతకు ముందు డిసెంబర్లో విడుదల చేసిన పోస్టులలో కూడా ప్రకాశ్ రాజ్ పేరు కనిపించడంలేదు. కానీ నవంబరులో విడుదల చేసిన ముహూర్తం ఫోటోల్లో ఆయన పేరు ఉంది. స్పిరిట్ సినిమా పూజా కార్యక్రమాలు మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ దాదాపు ఆరుకు పైగా బయటికి వచ్చాయి. కానీ ఎందులోనూ ప్రకాశ్‌రాజ్ పేరు ట్యాగ్ చేసి లేదు. అయితే ఆయన పేరును పొరపాటున పెట్టలేదని అనుకోడానికి కూడా లేదు. చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతున్నాయి. ఒక వేళ ఇది పొరపాటున జరిగితే ఇప్పటి వరకు చిత్ర బృందం మార్చకుండా ఎందుకు ఉంటుందనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి.
Introducing Vivek Oberoi as Antagonist in #Spirit
— Viral Vibe (@Viral_Vibe_) February 27, 2026
Prakash Raj pakkana oka Manchi innocent role anukuntey Villian ni chesesaav ga Vangaaaa pic.twitter.com/4dhifW0Xmb
ఇంతకు ముందే క్లారిటీ
ఈ చర్చలు మొదట్లో వచ్చినప్పుడే ప్రకాశ్ రాజ్ ఇలాంటిదేమి లేదని వార్తలన్నింటినీ తోసిపుచ్చారు. అలానే తను ఇంకా స్పిరిట్కు సంబంధించిన షూటింగ్‌ను కూడా ప్రారంభించలేదని తెలిపారు. దీంతో అందరు ఆయన సినిమా నుంచి తప్పుకున్నాడన్న వార్తలు కేవలం ప్రచారాలు మాత్రమే అని అనుకున్నారు. అయితే అప్పుడు కేవలం అయన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదన్న విషయంపైనే క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్న విషయంపై స్పందించలేదని స్పష్టమవుతుంది.
ఇదే వివాదమా?
దీంతో ఆయన పేరును రిలీజ్ అయిన సినిమా పోస్టర్లపై చిత్ర బృందం ట్యాగ్ చేయనందుకు, సినీ ఇండస్ట్రీలో దీనిపై వార్తలు మరింత జోరందుకున్నాయి. ప్రకాశ్ రాజ్ రాజకీయ అభిప్రాయాలు ఈ చిత్రాన్ని ప్రభావితం చేయగలవు కాబట్టి, స్పిరిట్ విడుదల వరకు వివాదాస్పద వ్యాఖ్యలు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండమని సందీప్ వంగా కోరినట్లు సమాచారం. అయితే, అలాంటి హామీ ఇవ్వడానికి ప్రకాశ్ రాజ్ నిరాకరించినట్లు సోషల్ మీడియాలో టాక్ వైరల్‌గా మారింది. తన వ్యక్తిగత అభిప్రాయాలకు తన వృత్తిపరమైన జీవితంతో సంబంధం లేదని ఆయన స్పందించినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. చర్చ సమయంలో వంగ పక్షపాతంతో వ్యవహరించాడని కొంత మంది నెటిజన్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కారణంగానే ప్రకాశ్ రాజ్ సినిమా నుంచి తప్పుకున్నట్లు వినికిడి. కానీ ఆ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.
స్పిరిట్ నుంచి మరో అనౌన్స్మెంట్కు సందీప్ రెడ్డి ప్లాన్స్- విలన్‌గా ఆ గ్లోబల్ స్టారేనా?
'స్పిరిట్' నుంచి తప్పుకున్నట్లు ప్రచారం- క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్ రాజ్ - ఏమన్నారంటే?

