బోయపాటి నెక్స్ట్ హీరో ఆ 'విలనే' - దాదాపు కన్ఫర్మ్ అయినట్టే!
బాలయ్య డైరెక్టర్ కొత్త అప్డేట్ - ఆ పాన్ఇండియా సినిమా విలన్‌తో అసక్తికరమైన ప్రాజెక్ట్ - హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా రూపొందే అవకాశాలు!

Published : March 3, 2026 at 6:29 PM IST
Boyapati Srinu Next Film : గతేడాది విడుదలైన 'అఖండ 2' మంచి విజయాన్ని అందుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ– మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్, ఎమోషన్, భక్తి అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి, ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను మరోసారి రుజువు చేసింది.
సౌత్ ఇండియాలోనే కాకుండా హిందీ బెల్ట్‌లో కూడా ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. ప్రత్యేకంగా ముంబయిలో నిర్వహించిన ప్రమోషన్స్ నార్త్ మార్కెట్‌ను పెంచాయి. బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ట్రైలర్ కట్‌లు, యాక్షన్ ఎపిసోడ్‌లను హైలైట్ చేయడంతో 'అఖండ 2' పాన్ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. బాలకృష్ణ మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ నార్త్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకున్నాయి.
అందరి చూపు నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే
ఈ విజయంతో ఇప్పుడు అందరి చూపు బోయపాటి చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌పై పడింది. మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బోయపాటి, ప్రతి సినిమాలో హీరోను పవర్‌ఫుల్ పాత్రలో చూపించడం ఆయన స్పెషాలిటి. ఆయన సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్‌లు, ఎలివేషన్ సీన్లు, భావోద్వేగాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఏంటి? ఎవరితో? అన్న చర్చలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
దగ్గుబాటి హీరోతో
ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'బాహుబలి'లో విలన్‌గా నటించిన స్టార్ హీరో దగ్గుబాటి రానాను తాజాగా బోయపాటిని కలిశారన్న ప్రచారం సాగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, బోయపాటి రానా కాంబినేషన్‌లో ఓ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా రూపొందే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. రానా ఇప్పటికే తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
హీరోగా, విలన్‌గా, గెస్ట్ రోల్స్‌లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ తన ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా బాహుబలి చిత్రాల్లో భల్లాలదేవ పాత్రలో ఆయన చూపిన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. శక్తిమంతమైన శరీరంతో, గంభీరమైన వాయిస్‌లో ఇంటెన్స్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ రానాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
కటౌట్‌కు బాగా సూట్ అవుతుంది
అలాంటి రానా దగ్గుబాటిని బోయపాటి తన యాక్షన్ స్టైల్‌లో చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. బోయపాటి సినిమాల్లో హీరో పాత్ర సాధారణంగా పవర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుంది. రానా వంటి కటౌట్ ఉన్న నటుడికి ఈ తరహా కథలు బాగా సూటవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కథా చర్చలు ప్రారంభమయ్యాయా? లేక కేవలం ఐడియా పరంగానే ఉందా? అన్న విషయంపైనా స్పష్టత రావాల్సి ఉంది. అయితే రానా హీరోగా సినిమా రాక చాలా రోజులైంది. ఈ నేపథ్యంలో బోయపాటితో మూవీ ఫిక్స్ అయితే మాత్రం దగ్గుబాటి ఫ్యాన్స్‌కు పండగే!
హాట్ టాపిక్‌గా మారిన వార్త
ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ కాంబినేషన్ ఓకే అయితే ఇది పాన్ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందే అవకాశం ఉంది. రానాకు ఇప్పటికే నార్త్‌లో మంచి గుర్తింపు ఉంది. బోయపాటి యాక్షన్ ఎలిమెంట్స్‌కు బాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ ఆదరణ పెరుగుతోంది. ఈ ఇద్దరూ కలిస్తే సినిమా భారీ స్థాయిలో రూపొందే అవకాశం ఉంది. అలాగే, కథ పరంగా కూడా కొత్తదనాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. 'అఖండ 2' విజయం తర్వాత బోయపాటిపై అంచనాలు మరింత పెరిగాయి. ఆయన తదుపరి చిత్రం ఆ అంచనాలను అందుకునేలా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. రానా వంటి నటుడితో పని చేస్తే కథలో కొత్త మలుపులు ఉండే అవకాశముందని భావిస్తున్నారు.
బోయపాటి - రానా కాంబినేషన్ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన రాకపోయినా అభిమానుల్లో మాత్రం భారీ ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజమైతే, ఇది ఇండస్ట్రీలోనే అత్యంత ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఒకటిగా నిలిచే అవకాశముంది. మరి బోయపాటి తదుపరి హీరో రానానేనా? లేక మరో స్టార్ హీరోతో ముందుకు సాగుతారా? అన్నది త్వరలో తేలనుంది!
'దేశం, ధర్మం, దైవ భావాన్ని తెలిపే సినిమా ఇది'- అఖండ 2పై RSS చీఫ్ భాగవత్ ప్రశంసలు
'అఖండ 2' : బోయపాటికి సిసలైన పరీక్ష- ఆ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్ అయ్యేనా?

