'టాక్సిక్' ఫస్ట్ డే వసూళ్లు- 'యశ్' గ్యాంగ్‌స్టర్ డ్రామాకు తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
టాక్‌తో సంబంధం లేకుండా టాక్సిక్‌కు మంచి ఓపెనింగ్స్ - ప్రీ సేల్స్‌లో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన చిత్రం

Published : August 27, 2026 at 11:38 AM IST
Yash Toxic Openings : విపరీతమైన హైప్‌తో కన్నడ స్టార్ హీరో యశ్ లేటెస్ట్ మూవీ 'టాక్సిక్' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తొలి రోజు ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్లపై ఆ ప్రభావం పడలేదు. బుక్ మై షోలో ఫస్ట్ డేనే దాదాపు 9,05,000 పైగా టికెట్లు అమ్ముడు కావడం ఆ సినిమా స్టామినాను ఏంటో నిరూపించింది.
రూ. 120 కోట్ల గ్రాస్
'టాక్సిక్' చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లను వసూళ్లను సాధించింది. దేశీయంగా చూసుకుంటే రూ.101.10 కోట్ల వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండోరోజు కూడా అన్ని ప్రధాన నగరాల్లోనూ థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. బుక్ మై షో సహా ఇతర మార్గాల ద్వారా కేవలం ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం విశేషం. అయితే, వసూళ్లపై నిర్మాణ సంస్థ అధికారికంగా అనౌన్స్ చేయలేదు.
టాక్సిక్ సౌత్ సినిమా అయినప్పటికీ నార్త్ ఇండియాలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోంది. హిందీ బెల్ట్‌లో రూ. 57 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓ కన్నడ సినిమా నార్త్ బెల్ట్‌లో ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి. తద్వారా యశ్ కెరీర్‌లో గతంలో వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' సాధించిన రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టింది. తొలి రోజు వసూళ్లలో నార్త్ బెల్ట్ లో అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ 'పుష్ప 2' తర్వాత స్థానంలో టాక్సిక్ నిలిచింది. అదే విధంగా సొంత స్టేట్ అయిన కన్నడలో హిందీ కంటే తక్కువగా రూ. 23.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక తెలుగు విషయానికి వస్తే కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి. తెలుగులో ఈ చిత్రం తొలిరోజు రూ. 16 కోట్లను రాబట్టింది. ఇక తమిళనాడులో రూ. 5.50 కోట్లు, మలయాళంలో రూ. 1.30 కోట్ల నెట్ వసూళ్లను సాధించడం విశేషం.
#Yash becomes only the 2nd actor ever after #ShahRukhKhan to have 2 Films which opened with 50 Cr+ Net at Hindi Box Office🤯☠️🔥
— Movie Reviews Blog (@MovieReviewsBlg) August 27, 2026
SRK - Pathaan, Jawan
Yash - KGF 2, Toxic
Yash is not a Bollywood Superstar yet ruling Hindi heartland! PROPER PAN INDIA STAR🔥 pic.twitter.com/MVirSXVYqy
రాష్ట్రాలవారీగా థియేటర్ ఆక్యుపెన్సీ
సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రాబోయే శని, ఆదివారాల్లో కలెక్షన్లు మరింత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని కొత్త మైలురాళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. టాక్సిక్ సినిమాకు ఫస్ట్ డే మంచి థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. సాక్నిల్క్ నివేదిక ప్రకారం భారత్ వ్యాప్తంగా టాక్సిక్ 24,579 స్క్రీన్స్‌పై గ్రాండ్‌గా రిలీజ్ కాగా 56.1 శాతం మేర థియేటర్ ఆక్యుపెన్సీని నమోదైంది. ఇందులో రాష్ట్రాల వారీగా హిందీలో 16,670 షోలును ప్రదర్శించారు. వీటిల్లో 53 శాతం మేర థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. కన్నడలో 2,031 షోలకు గానూ 89 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగులో 3,258 షోలకు 60 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. తమిళంలో 2,140 షోలకు 42 శాతం, మలయాళంలో 480 షోలకు 61 శాతం మేర థియేటర్ ఆక్యుపెన్సీని నమోదు చేయడం గమనార్హం.
యశ్ వన్‌మ్యాన్ షో
ఇక టాక్సిక్ సినిమా విషయానికొస్తే యశ్ ఇందులో రాయ అనే పవర్ఫుల్ రోల్లో నటించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. స్టైలిష్ లుక్, డబుల్ యాక్షన్ క్యారెక్టర్లతో యశ్ వన్‌మ్యాన్ షోగా ఈ సినిమా సాగిందని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మూవీలో గంగ క్యారెక్టర్లో నటించిన నయనతార, నదియ పాత్రలో యాక్ట్ చేసిన కియారా అడ్వాణీలు సినిమాకు ప్లస్ పాయింట్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఫస్ట్ డే వసూళ్లు భారీగానే దక్కాయి. కానీ ఆ వసూళ్ల జోరును టాక్సిక్ ఆ తర్వాత కూడా కొనసాగిస్తుందా? లేదా? అనేది చూడాలి.
YASH BIGGER THAN PRABHAS🔥
— ferrari (@therevanthtweet) August 26, 2026
- 100cr+ opening WW
- 60-70k tickets bookings per hour
- all this despite disaster ratings
- no dupe used
- better face card and aura
- top 2 : Allu Arjun & Yash
YASH THE MAN🔥 #Toxic pic.twitter.com/oMUiE4GUFf
'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్- ఏపీ, తెలంగాణలో ఉదయం 6.30కే షో- టికెట్ ధరల పెంపు!
టాక్సిక్‌లో కియారా పాత్రపై సిద్ధార్థ్ మల్హోత్ర స్పందన- ఇన్‌స్టాలో పోస్టు పెట్టిన హీరోయిన్ భర్త

