Telangana Panchayat Elections Results2025

ETV Bharat / entertainment

Bigg Boss Nominations: తనూజ చేతిలో నామినేషన్స్​ - రీతూకు హార్ట్​బ్రేక్​ - ఫుల్​ ఫైర్​లో ప్రోమోలు!

-డీమాన్​ పవన్​ - రీతూ మధ్య నామినేషన్స్​ మంట - రీతూపై దివ్య కోపం - జడుసుకున్న భరణి!

Bigg Boss Today Nominations Promo
Bigg Boss Today Nominations Promo (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 17, 2025 at 5:21 PM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss Today Nominations Promo: బిగ్​బాస్​ తొమ్మిదో సీజన్​లో 11 వారం నామినేషన్స్​ షురూ అయ్యాయి. దీనికి సంబంధించి ప్రోమోలు కూడా రిలీజ్​ చేశారు బిగ్​బాస్​ టీమ్​. అయితే నిన్న, మొన్న ఎపిసోడ్​లో నిఖిల్​ ,గౌరవ్​ ఎలిమినేట్​ కావడంతో ప్రస్తుతం హౌజ్​లో వైల్డ్​కార్డ్స్​ ఎవరూ లేరు. ఉన్నదల్లా పాత కంటెస్టెంట్సే. దీంతో కుండ బద్ధలు కొట్టి మరీ నామినేట్​ చేయాలనే కాన్సెప్ట్​ తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే హౌజ్​మేట్స్​ మధ్య గొడవలు గట్టిగానే జరిగాయి. మరీ ముఖ్యంగా రీతూను గుండెల్లో కత్తి కాకుండా గునపం దించాడు డీమాన్​. అలాగే కెప్టెన్​గా ఉన్న తనూజకు పవర్​ ఇచ్చాడు బిగ్​బాస్​. ఇంతకీ ఆ ప్రోమోలలో హైలెట్​ అయిన విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

కెప్టెన్​ తనూజకు స్పెషల్​ పవర్​: "ఎవరు ఎంతమందిని నామినేట్​ చేయాలి? అని నిర్ణయించే హక్కు ఇంటి కెప్టెన్​ చేతిలో ఉంటుంది. తనూజ నామినేషన్స్​ చేసే పవర్​ను ఇచ్చే టోకెన్స్​ ఉన్నాయి. అందులో కొన్ని ఒక నామినేషన్​ పవర్​తో, మరికొన్ని ఇద్దరిని నామినేట్​ చేసే పవర్​తో ఉన్నాయి. ఏ టోకెన్​ ఎవరికి ఇవ్వాలన్నది పూర్తిగా మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది" అంటూ నామినేషన్​ ప్రక్రియ గురించి వివరించాడు బిగ్​బాస్​. దీంతో ఇమ్మాన్యుయేల్‌కి రెండు టోకెన్స్ ఇవ్వడంతో.. మొదటిగా రీతూ కుండను పగలగొట్టాడు."రీతూ గేమ్‌లో కన్ఫ్యూజ్ అవుతుంది" అని ఇమ్మూ అనడంతో.. "నువ్వు కన్ఫ్యూజ్ కాలేదా?" అంటూ గొడవకి దిగింది రీతూ. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పెరిగాయి. ఆ తరువాత రెండోదిగా భరణిని నామినేట్ చేశాడు ఇమ్మాన్యుయేల్.

రీతూకి హార్ట్​బ్రేక్​: "భరణి ఇంతకు ముందులా ఆడలేకపోతున్నాడు. గేమ్​లో ఎఫర్ట్స్​ పెట్టడం లేదు" అని ఇమ్మాన్యుయేల్ అనడంతో.. "నాకు తగిలిన దెబ్బలే నీకు తగిలితే.. నువ్వూ ఇంతకు ముందులాగే ఆడేవాడివా?" అని క్వశ్చన్​ చేశాడు భరణి. దీనికి "అదే అన్నా.. నేను చెప్పేదీ" అని ఇమ్మూ అనడంతో.. "నేను అడిగిన దానికి సూటిగా చెప్పు ఇమ్మాన్యుయేల్​. పెర్ఫామెన్స్ అంటే 360 డిగ్రీస్ మొత్తం వస్తుంది. ఒక్క టాస్క్‌లు మాత్రమే కాదు" అంటూ ఫైర్ అయ్యారు భరణి. ఈ నామినేషన్స్​లో బిగ్​ ట్విస్ట్​ అంటే డీమాన్ పవన్ రీతూ చౌదరిని నామినేట్ చేయడం. అయితే రీతూ పేరు చెప్పడంతో హౌజ్​మేట్స్​ అందరూ షాక్​ అయ్యారు. "నువ్వు అరవడం వల్ల నాది తప్పు లేకపోయినా నాదే తప్పు అవుతుందని బయటకు వెళ్తుంది. తనది తప్పు లేదని తనతో మాట్లాడటానికే ట్రై చేశాను. కానీ నువ్వు ట్రస్ట్ లేదని చాలా హర్ట్ చేశావ్. ప్రతి క్షణం నేను నీ మంచే కోరుకున్నా. నేనైతే చాలా బాధపడుతున్నాను" అంటూ చెప్పాడు పవన్. దీంతో రీతూ ఏ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది. ఇక చివర్లో మరొకసారి ఇద్దరూ అరుచుకున్నారు. దీంతో ఫస్ట్​ ప్రోమో ఎండ్​ అయ్యింది.

ఇమ్మూకి ఇచ్చిపడేసిన భరణి: ఇక రెండో ప్రోమోలో ఇమ్మానుయేల్‌ను నామినేట్ చేస్తూ.. "నేను టాస్క్‌లు ఆడట్లేదు అన్నావ్ కదా. టెడ్డీ బేర్ టాస్క్ అప్పుడు నువ్వు నాకంటే వెనకే ఉన్నావ్. నా బాడీకి దెబ్బలు తగిలాయి కానీ, నా మైండ్‌కి కాదు" అంటూ కుండబద్దలుకొట్టాడు భరణి. ఆ తరువాత కల్యాణ్​ డీమాన్ పవన్‌ని నామినేట్ చేశాడు. ఇక చివరిగా రీతూ - దివ్య గట్టిగానే అరుచుకున్నారు. దివ్యను నామినేట్​ చేస్తూ "ఈమె ఏ గేమ్​లో గెలిచింది. నేను ఈ గేమ్​లో గెలిచాను. నేను దీంట్లో సూపర్​ అంటూ నువ్వు చెప్పుకుంటూ నన్ను లో చేస్తున్నావు" అంటూ రీతూ అనింది. దీనికి "ఎవరి గేమ్​ బెటరో నేను చెప్పుకోవద్దా. నేను చెప్తాను అక్కడ నేను ఎందుకు బెటరో" అని దివ్య వాయిస్​ రెయిజ్​ చేసింది. దీంతో ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది.

దివ్య కోపానికి జడుసుకున్న భరణి: ఇక దివ్య టర్న్​ వచ్చేసరికి రీతూని నామినేట్​ చేసింది. ఇక పాయింట్స్​ చెబుతున్న సమయంలో రీతూ మాట్లాడటంతో "నేను అయ్యేకే నువ్వు మాట్లాడు" అని దివ్య అంటే.. "ఏ అలాగని ఇక్కడేమైనా రూల్ ఉందా?" అని అన్నది రీతూ. "హా.. ఇది నా రూల్" అని యాటిట్యూడ్ చూపించింది దివ్య. దాంతో రీతూ చౌదరి .. "నువ్వు నన్ను తొక్కి తొక్కి తొక్కి ఎంతసేపు తొక్కుతావ్ నన్ను. కొట్టుకో వచ్చి" అని సీరియస్​ అయ్యింది. దాంతో దివ్య నిఖిత.. కోపంగా వచ్చి రీతూ చౌదరి కుండని గట్టిగా కొట్టి ముక్కలు ముక్కలు చేసింది. అది చూసి హౌజ్​లో వాళ్లంతా షాక్ అయిపోయారు. ముఖ్యంగా భరణి అయితే.. ఆ దెబ్బ ఎవరి నెత్తినైనా పడితే ఏంటి పరిస్థితి? అనే ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. దీంతో రెండో ప్రోమో కూడా ఎండ్​ అయ్యింది.

Bigg Boss 9 Telugu: పదో వారం గౌరవ్​ గుప్తా ఎలిమినేటెడ్​ - హౌజ్​లో ఇక నో వైల్డ్​కార్డ్స్​!

Bigg Boss Trophy బిగ్​బాస్​ ట్రోఫీ కోసం రూ.16 లక్షలు ఇచ్చిన కంటెస్టెంట్​!