ETV Bharat / entertainment

Bigg Boss 9 Day 44 Review : 'గోలిసోడా పోరు'లో మాధురి టీమ్ విన్ - ఇమ్మూ స్వీట్ పాయిజన్ అంటూ!

- కెప్టెన్సీ కోసం టాస్క్​లు మొదలు పెట్టిన బిగ్​ బాస్ - దొంగలుగా మారిన హౌస్​మేట్స్!

Bigg Boss 9 Telugu Day 44 Episode
Bigg Boss 9 Telugu Day 44 Episode (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 22, 2025 at 11:37 AM IST

5 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Day 44 Episode Review : బిగ్ బాస్ 9 సీజన్ ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అవ్వడంతో మంగళవారం కెప్టెన్సీకి సంబంధించిన టాస్క్​లు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే హౌస్​ను వాంటెడ్ పేటగా మార్చి ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టి టాస్క్​లు పెట్టాడు బిగ్​బాస్. ఈ రెండు టీంలకు మాధురి-సంజన ఇద్దరినీ గ్యాంగ్ లీడర్లుగా పెట్టి మిగిలిన హౌస్‌మేట్స్ అందర్నీ దొంగలుగా మార్చి ఆట షురూ చేశాడు. అందులో భాగంగా పెట్టిన ఓ టాస్క్​లో మాస్ మాధురి టీం విన్ అయ్యింది. అంతకంటే ముందు నామినేషన్స్​ ప్రక్రియకు సంబంధించి తనూజ - ఇమ్మాన్యుయేల్, సంజన - తనూజలకు మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్యాణ్ కూడా తనూజ గురించి కొన్ని విషయాలు మాధురితో షేర్ చేసుకున్నాడు. ఇలా డే 44 ఎపిసోడ్​లో జరిగిన పూర్తి విషయాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

బిగ్ బాస్ సీజన్ 9 డే 44 ఎపిసోడ్​లో ముందుగా నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన అనంతరం కెప్టెన్ గౌరవ్‌ని "అయేషాను ఎందుకు సేవ్ చేశావ్" అని అడిగారు మాధురి, దివ్య. అప్పుడు గౌరవ్.. ఇమ్మూ-అయేషా నన్ను నామినేషన్ నుంచి సేవ్ చేశారు.. అందుకే.. చేశా అని అన్నాడు. ఇంతలో తనూజ అక్కడికి రావడంతో చూశావా అయేషాని సేవ్ చేయమని ఇమ్మూ చెప్పాడంట.. అంటూ చెప్పింది మాధురి. అప్పుడు తనూజ.. ఇక్కడ సెల్ఫ్ గేమ్ ఆడుతుంది ఎవరు అంటూ.. ఇమ్మాన్యుయేల్​తో వాదనకు దిగింది.

నువ్వు స్వీట్ పాయిజన్..

ఇదే విషయాన్ని దివ్యతో వాష్ రూమ్ ఏరియా దగ్గర తనూజ మాట్లాడింది. "వాడు (కల్యాణ్) నన్ను నామినేట్ చేయకపోతే లేచి వాయిస్ రైజ్ చేయడం ఏంటి? నువ్వే సేఫ్ గేమ్ ఆడుతున్నావు" అంటూ ఇమ్మూపై మండిపడింది తనూజ. అప్పుడు ఇమ్మూ కూడా ఏమాత్రం తగ్గకుండా.. "నాకిప్పుడు చిన్న పాయింట్ ఉంది. ఒకవేళ ఈ వీక్ అంతా గమనించాక ఇంకా పాయింట్ ఉంటే యాడ్ చేసి చెప్తా" అన్నాడు ఇమ్మూ. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాటలు పెరిగి.. "నువ్వు స్వీట్ పాయిజన్" అని ఫైర్ అయ్యింది తనూజ. అప్పుడు ఇమ్మూ.. "నాగ్ సార్ అడిగినప్పుడు ఇతను నా గురించి స్టాండ్ తీసుకోడు అంటే బాధేసింది. అన్ని గేమ్స్​లో నీకు సపోర్ట్ చేసి సేఫ్ గేమర్ అయ్యాను" అంటూ తాను ఎలాంటి స్టాండ్ తీసుకున్నానో క్లారిటీ ఇచ్చాడు ఇమ్మూ.

తనూజ విషయంలో క్లారిటీ ఇచ్చిన కల్యాణ్..

తర్వాత బయటికెళ్లి కూర్చున్న తనూజ దగ్గరికి వెళ్లింది మాధురి. ఇమ్మూ మాట్లాడిన పాయింట్స్‌లో ఒకటి కరెక్టే కదా.. అని చెప్పింది. దాంతో ఏంటి కరెక్ట్ నీకు తెలుసా నువ్వు చూశావా.. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు రాజు.. నువ్వు ప్రతి ఒక్కరికీ ఇదే అను.. ఊరికే నన్ను అరిపించకు.. అంటూ తనూజ ఫైర్ అయింది. కాసేపటికి మాధురి.. కల్యాణ్ దగ్గరికెళ్లి తనూజని నువ్వు ఎందుకు నామినేట్ చేయాలనుకున్నావ్.. అని అడిగింది. అప్పుడు కల్యాణ్.. "సుమన్ ను నామినేట్ చేసి సేఫ్ గేమ్ ఆడింది. ఈ వారం అంతా తాను మారిపోయింది. ఎవరో చెప్పిన విషయం నమ్మి నేను మారాను అనుకోవడం తప్పు. ఎప్పటికైనా ఎన్ని జరిగినా ఈరోజు కాదు నెక్స్ట్ వీక్ అయినా నేను నామినేట్ చేయొచ్చు కదా ఈ వారం కూడా తను అలా ఉంటే".. అంటూ క్లారిటీగా చెప్పాడు కల్యాణ్. తర్వాత పడుకునే ముందు "రమ్య తనూజానే టార్గెట్ చేసింది ఎందుకో" అంటూ గౌరవ్, అయేషా మధ్య కాసేపు డిస్కషన్ జరిగింది.

సంజన Vs కల్యాణ్..

నెక్స్ట్ డే ఉదయాన్నే "తనూజాను ఇంప్రెస్ చేయడానికి నన్ను నామినేట్ చేశాడు. నిఖిల్ నాయర్ వచ్చాక తనూజా కల్యాణ్​ను పట్టించుకోవట్లేదు" అని సంజన అన్నది. అది విన్న దివ్వెల మాధురి "అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాటలు వెనక్కి తీసుకో" అంటూ ఇచ్చిపడేసింది. ఇదే క్రమంలో సంజన - కల్యాణ్ ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది.

Bigg Boss 9 Nominations Episode : సేవింగ్ పవర్​తో బతికిపోయిన అయేషా - ఈ వారం నామినేషన్స్​ లిస్ట్ ఇదే!

'వాంటెడ్ పేట'లో క్రిమినల్స్ మధ్య పోరు..

అనంతరం బిగ్​బాస్​ హౌజ్​లో సైరన్ రావడంతో అందరూ అలెర్ట్ అయి హాల్​లోకి వచ్చారు. బిగ్​బాస్ ఇంటి పరిసరాల్లో చాలాకాలంగా రెండు గ్యాంగ్స్ మధ్య జరుగుతున్న భీకరమైన పోరుని మా సెక్యూరిటీ ఫోర్సెస్ ధైర్య సాహసాలతో రూపుమాపారు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ఆ రెండు గ్రూపుల లీడర్స్ తప్పించుకున్నారు. వాళ్లు దివ్వెల మాధురి, సంజన అంటూ బోర్డ్​పై ఫొటోలు చూపించగా అందరూ నవ్వారు. ఏంటి బిగ్​బాస్ ఇది అంటూ మాధురి అనగా.. ఇప్పుడు మీరంతా వాంటెడ్ పేటలో కరుడుగట్టిన నేరస్థులు అని చెప్పాడు బిగ్​బాస్.

అలాగే, ఒక్కొక్కరికి ఒక్కో క్యారెక్టర్​ ఇచ్చి అందుకు సంబంధించిన కాస్ట్యూమ్స్​ ఇచ్చాడు. "మీ అందరికీ ఈ వారం కంటెండర్ అయ్యే ఛాన్స్ లభిస్తుంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. అది గ్యాంగ్ లీడర్స్ చేతుల్లో ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే.. వాళ్ల కంటెండర్ మీ చేతుల్లో ఉంటుంది. ఎవరి గ్యాంగ్​లో ఎక్కువ మంది ఉంటే వాళ్లే కంటెండర్ అవుతారు" అని బిగ్​బాస్ చెప్పాడు.

కంటెస్ట్ంట్స్​కి కొత్త పేర్లు..

వాటెండ్ పేటలో గ్యాంగ్ లీడర్స్​గా మాస్ మాధురి, సంజన సైలెన్సర్ ఉన్నారు. ఇక టాస్క్​లో భాగంగా అందరూ దొంగలుగా ముస్తాబయ్యారు. తనూజా - టిల్లు బావ, డెమోన్ - సైకో సాంబ, ఇమ్మాన్యుయేల్ - నల్ల బాలు, రిచ్ రామ లక్ష్మీ - దివ్య, పుప్పాడ స్మగ్లింగ్ శ్రీను - సాయి, షుగర్ శంకర్ - నిఖిల్, రమ్య - రామ్ పిల్లి, కత్తి కాంతారావు - సుమన్ అంటూ అంటూ పాత్రలు ఇచ్చాడు బిగ్ బాస్.

మాస్ మాధురి టీమ్ విన్..

తర్వాత గార్డెన్ ఏరియాలో రెండు టీంలకు "గోలిసోడా-బాటిల్ వాలా" అనే ఒక టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. డబ్బు సంపాదించడానికి మీకు ఇస్తున్న మొదటి అవకాశం. ఈ టాస్క్​లో 50 సోడాలు కొట్టి, 30 సోడాలి తాగాలి అనే కండీషన్ పెట్టాడు. గెలిచిన వాళ్లకు 2000 ప్రైజ్ మనీ ఉంటుంది. అప్పుడు మాస్ మాధురి టీమ్ నుంచి ఇమ్మాన్యుయేల్, కల్యాణ్.. సంజన టీమ్ నుంచి రమ్య, డిమోన్ పవన్ పోటీపడ్డారు. ఇందులో మాధురి టీమ్ గెలిచింది. విన్ అయిన అనంతరం "ఇటుక కూడా ఇటుక పెడితే ఇల్లైతాది.. మాధురి అక్కతో పెట్టుకుంటే లొల్లయితాది" అనే క్యాచీ నినాదాలతో హౌస్​ను హోరెత్తించారు ఆ టీం సభ్యులు. ఇలా కంటెండర్ కోసం పెట్టిన మొదటి టాస్క్​లో మాస్ మాధురి టీమ్ విన్ అయ్యింది. మరి, రాబోయో టాస్క్​ల్లో ఎవరు గెలుస్తారు? ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Bigg Boss 9 Telugu: వీడియో ప్లే చేసి తనూజ కళ్లు తెరిపించిన నాగ్​ - 'రీతూ - డీమాన్'​ బంధానికి బ్రేక్​!

Divvela Madhuri Rules: బిగ్​బాస్​ హౌజ్​లో మాధురి రూల్స్​ - మాకేంటీ కర్మ అంటున్న ఆడియన్స్​!