Bigg Boss Nominations: "ఆమె బయటికి పోవాల్సిందే" - నామినేషన్స్‌లో 'నాన్న - కూతురి' గొడవ!
- బిగ్‌బాస్ 9వ వారం నామినేషన్స్ ప్రోమో - భరణి-తనూజ మధ్య హీట్ డిస్కషన్!

Published : November 3, 2025 at 5:24 PM IST
Bigg Boss 9 Nominations Promo: సోమవారం వచ్చిందంటే బిగ్‌బాస్ హౌజ్‌లో మంటలు మొదలవుతాయి. ఎందుకంటే నామినేషన్స్‌లో కొట్టుకునేదాక వెళ్లిపోతారు కంటెస్టెంట్స్. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన నామినేషన్స్ ఒక ఎత్తైతే.. నేటి ఎపిసోడ్లో జరిగేవి మరో ఎత్తు అనేలా ఉన్నాయి. ఎప్పటినుంచో ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చిందన్నట్టు ఉంది పరిస్థితి. ఎందుకంటే గత ఎనిమిది వారాల నుంచి నాన్న - కూతురు బాండ్లో ఉన్న భరణి - తనూజ.. నేటి ఎపిసోడ్లో సై అంటే సై అంటున్నారు. మరీ ముఖ్యంగా తనూజను ఇంటి నుంచి పంపించడమే తన లక్ష్యం అన్నట్టు చేసిన భరణి కామెంట్స్ హైలెట్. ప్రోమోలో ఇంకేం విశేషాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఈ తొమ్మిదో వారం నామినేషన్స్‌లో హీట్ మామూలుగా లేదు. ఇంటి సభ్యుల మధ్య బొమ్మలాట పెట్టేశాడు బిగ్‌బాస్. బొమ్మలపై హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఫొటోలు పెట్టి గార్డెన్ ఏరియాలో ఉంచారు. "బజర్ మోగగానే వేరే వాళ్ల ఫొటో ఉన్న బొమ్మల్ని తీసుకుని సేఫ్ జోన్‌లోకి పరిగెత్తాల్సి ఉంటుంది. చివరగా చేరుకున్న సభ్యులు, బొమ్మపై ఎవరి ఫొటో అయితే ఉంటుందో వాళ్లిద్దరూ నామినేషన్ జోన్‌లోకి వస్తారు" అని బిగ్‌బాస్ చెప్పారు.
అయితే మొదటిగా రీతూ, సంజనలు నామినేషన్ జోన్‌లోకి రావడంతో.. వాళ్లిద్దరి మధ్య హీట్ డిస్కషన్ జరిగింది. ఫస్ట్‌డే నుంచి నేను ఏదైనా గేమ్ ఆడితే అది నేను ఒంటరిగా, సోలో ప్లేయర్‌గానే ఆడాను. ఎక్కడో రీతూ ఆటలో డీమాన్ కచ్చితంగా ఉంటున్నాడు. అది అందరికీ కనిపిస్తుంది" అని సంజనా తన పాయింట్స్ చెప్పింది. "ఈ హౌస్‌లో ఉన్న మీ అందరికీ బాండ్స్ ఎలా ఉన్నాయో. నాకూ ఒక బాండ్ ఉంది. అది మీకు రాంగ్ అనిపిస్తే నేనేం చేయలేను" అని కౌంటర్ ఇచ్చింది రీతూ. దీంతో "నీ వల్ల.. డీమాన్ పవన్ బయటకు పోయే పరిస్థితి వచ్చింది" అని సంజన అన్నది. అయితే "నేను నోటికొచ్చినట్టు మాట్లాడను. ఒక్క మనిషిని కూడా నేను పర్సనల్‌గా ఎటాక్ చేయలేదు" అని రీతూ డిఫెండ్ చేసుకుంది.
ఎమోషనల్ అయిన సుమన్: "భరణి గారిని నామినేట్ చేసే పాయింట్ నా దగ్గరలేదు" అని తనూజ చెప్పడంతో.. "ట్రోఫీ ఆయనకి ఇచ్చేస్తారా?" అని కౌంటర్ ఇచ్చింది సంజన. ఇక సుమన్, తనూజ మధ్య నామినేషన్స్ రౌండ్ జరగ్గా.. "తనూజ ఇంట్లో జరిగే ఫైట్స్‌లో బాగా ఇన్వాల్వ్ అవుతుంది.. సుమన్ గారితో పోల్చుకుంటే. అదొక్కటే తనలో ఉన్న నెగిటివిటీ" అని దివ్య అన్నది. ఆ టైమ్‌లో తనూజ.. "నేను ఇక్కడ ఫేక్‌గా లేను. మాస్క్ వేసుకుని సేఫ్ గేమ్ ఆడటం లేదు. పాయింట్స్ వచ్చినప్పుడు నా వాయిస్ రైజ్ చేస్తున్నా. ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడే అవుతున్నా" అని అన్నది. ఇక సుమన్.. "నా వల్ల ప్రాబ్లమ్ అంటున్నారు. నేను పరుగుపెట్టలేకపోయాను కాబట్టి.. నేనే నామినేట్ అవుతాను" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సుమన్ శెట్టి. దీంతో ఫస్ట్ ప్రోమో ఎండ్ అయ్యింది.
ఇక రెండో ప్రోమోలో భరణి - తనూజ మధ్య జరిగిన డిస్కషన్ వేరే లెవల్. "నా నామినేషన్ ఇమ్మాన్యుయేల్. తను సేఫ్‌గా గేమ్ ఆడుతున్నాడని చాలా క్లియర్‌గా తెలుస్తుంది" అంటూ తనూజ చెప్పింది. దీనికి ఇమ్మూ డిఫెండ్ చేసుకున్నాడు. "నాకు అయినంత వరకూ సపోర్టర్‌ని మోయగలుగుతా. నాకు భుజాలు నొప్పెడుతున్నాయి అంటే దింపుతా" అని ఇమ్మూ చెప్పాడు. "భుజాలకి నొప్పొచ్చేస్తుంది అన్నప్పుడు ఎక్కించుకోకు. నీలాగ సిల్లీ పాయింట్ చెప్పేసి నామినేషన్ వేయడం నా వల్ల కాదు. ఈరోజు నాకు స్ట్రాంగ్ రీజన్ ఉంది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా" అంటూ తనూజ ఫైర్ అయింది.
నెక్స్ట్ భరణిని డీమాన్, తనూజని సాయి నామినేట్ చేశారు. దీంతో భరణి-తనూజ మధ్య వాదన జరిగింది. "తనూజ నన్ను ఏ టాస్కులోనూ సేవ్ చేయలేదు. తనని రెండు టాస్కుల్లో నేను సేవ్ చేశాను. తనకంటే నేను టాస్కులు బాగా ఆడాను" అని భరణి అన్నాడు. ఇక దీనికి "టాస్క్ విషయంలో సపోర్ట్ చేశారు. ఎందుకంటే అది సపోర్టింగ్ గేమ్ కాబట్టి. ఆయనకి నేను ఆడలేననో, నేను వీక్ అనో, గెలవలేననో ఆయనకి ఏముందో నాకు తెలీదు" అంటూ తనూజ చెప్పుకొచ్చింది. "ఇది నీకు ఇప్పుడు అనిపించిందా.. అప్పుడు అనిపించిందా" అని భరణి అడిగితే.. "ఆరోజే అనిపించింది" అంటూ తనూజ అంది.
నువ్వు బయటికి వెళ్లాల్సిందే: "ఆరోజు అనిపించినప్పుడు చెప్పాలి కదా" అని భరణి రైజ్ అయ్యాడు. "ఆ ఛాన్స్ ఎక్కడుంది. మాట మాటకి ఇమ్మాన్యుయేల్, మాటమాటకి దివ్య వస్తే తనూజ గొంతుకైనా, తనూజ మాటకైనా ఎక్కడుంది అక్కడ స్పేస్. నేను ఎప్పుడైనా పాయింట్ మాట్లాడితే పర్సనల్ అంటున్నారు. పర్సనల్ అయితే బయట పెట్టుకోండి హౌజ్‌లో పెట్టుకోకండి" అంటూ తనూజ సీరియస్ అయ్యింది. ఇక దానికి "ఏదైతే బాండింగ్స్ పేరు మీద నేను బయటికెళ్లానో.. తను కూడా ఒకసారి ఆ బాధ్యత తీసుకొని బయటికెళ్లి వస్తే తనకీ పరిస్థితి అర్థమవుతుంది. ఆమె బయటికి పోవాలని నేను అనుకుంటున్నా" అంటూ భరణి అన్నాడు. దీంతో ప్రోమో ఎండ్ అయ్యింది.
Bigg Boss Srija: అంతా నాటకమే! - బిగ్‌బాస్ పై దమ్ము శ్రీజ ఫైర్!
Bigg Boss 8th Week Elimination : దివ్వెల మాధురి ఔట్ - 3 వారాలకు భారీగా రెమ్యునరేషన్!

