ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu: డీమాన్​కు రెడ్​ కార్డ్​ - డోర్స్​ ఓపెన్​ చేసిన బిగ్​బాస్​ - ఫుల్​ ఫైర్​లో​ నాగార్జున!

-అదుర్స్​ అనిపించేలా బిగ్​బాస్​ ప్రోమోలు - నవ్వులు పూయిస్తోన్న రాము రాథోడ్​ వీడియో!

Bigg Boss 9 Telugu Weekend Promo
Bigg Boss 9 Telugu Weekend Promo (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 1, 2025 at 8:05 PM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Weekend Promo: బిగ్​బాస్​ శనివారం ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమోలు వచ్చేశాయి. ఇక ప్రోమోల్లో ఒక్కో కంటెస్టెంట్స్​పై ఫైర్​ అయ్యారు నాగార్జున. అయితే ఈ వారం ఫుడ్​ విషయంలో ఎన్నో గొడవలు జరిగాయి. తాజాగా రిలీజ్​ చేసిన ఓ ప్రోమోలో కూడా ఫుడ్​ గురించే ఓ రేంజ్​లో గొడవ జరిగింది. ఇక మరో ప్రోమోలో కల్యాణ్​, సంజనాపై సీరియస్​ అయిన నాగ్​... డీమాన్​ పవన్​కు రెడ్​ కార్డ్​ ఇచ్చారు. ఈ క్రమంలోనే అసలు ప్రోమోలలో ఏమేమి జరిగాయో ఇప్పుడు చూద్దాం.

శనివారం స్టార్టింగ్​ ఎపిసోడ్​లో ముందుగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్​లో మెయిన్​ పాయింట్స్​ను ఆడియన్స్​కు ప్లే చేసి చూపిస్తుంటారు నాగ్​. తాజాగా మొదటి ప్రోమో దానికి సంబంధించినదే. ఇక ఆ ప్రోమోలో జరిగిన ఓ టాస్క్​లో భరణి చేసిన పనికి మాధురి హర్ట్​ అయ్యింది. ప్రోమోలో ఏముందంటే.. "ప్లేట్ల దగ్గర, బిర్యానీల దగ్గర.. అక్కడే మొదలవుతున్నాయి గొడవలన్నీ. నథింగ్​ టూ వర్రీ. లోపలికి వెళ్లిన తర్వాత సెట్​ చేద్దాం" అంటూ నాగార్జున చెప్పి వీడియో ప్లే చేశారు.

బిర్యానీ గురించి మాధురి - భరణి మధ్య గొడవ: అందులో హౌజ్​లోని కంటెస్టెంట్స్​ను రెండు టీమ్స్​గా విడగొట్టి ప్రమోషన్​కు సంబంధించిన టాస్క్​ పెట్టారు. ఇందులో గెలిచిన వారికి బిర్యానీ ఉంటుంది. ఇక ఈ టాస్క్​కు భరణి సంచాలకులుగా ఉన్నారు. అయితే ఈ టాస్క్​లో డీమాన్​ టీమ్​ గెలిచింది. ఇంతలో బిర్యానీ కోసమని మాధురి ప్లేట్​ పట్టుకుని వెళ్లింది. అయితే సంచాలక్​గా ఉన్న భరణి.. "మాధురి గారు ఒక్క నిమిషం ఉండండి. వేస్తాను" అంటూ చెప్పాడు. ఇక మాధురి వెయిట్​ చేస్తుండగా భరణి వచ్చి" టీమ్​ ఏ వాళ్లకు అసలు పీస్​లు వేయలేదు. వాళ్లకు ఓసారి వేసిన తర్వాత మీకు వేస్తా" అంటూ చెప్పాడు. దీంతో హర్ట్​ అయిన మాధురి పక్కకు వెళ్లి వాటర్​ తాగి కూర్చుంది. ఇక టీమ్​ వాళ్లకి పీస్​లు వేసిన తర్వాత మాధురిని భరణి పిలవగా.. నాకు వద్దు అంటూ మాధురి చెప్పింది. "చిన్న చిన్న వాటికి కూడా మీరు ఏంటి? ఇక్కడ ప్రాబ్లమ్​ ఏంటి తెలుసా?" అంటూ భరణి వివరణ ఇచ్చేలోపు.. "ఒక్కనిమిషం నేను చెబుతా" అంటూ దివ్య అనింది. దీంతో మాధురి, దివ్య మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఈ విషయం గురించి భరణికి సలహాలు ఇచ్చింది తనూజ. ఇంతటితో ప్రోమో ఎండ్​ అయ్యింది.

సంజనాపై ఫైర్​: మొదటి ప్రోమోలో పెద్దగా పస లేనప్పటికీ రెండో ప్రోమోలో మాత్రం కంటెస్టెంట్స్​కు ఇచ్చిపడేశారు నాగ్​. ముందుగా సంజనాతో క్లాస్ స్టార్ చేశారు. "నామినేషన్స్ వచ్చేసరికి ఎందుకు అలా బిహేవ్ చేస్తావ్? కోపం, చిరాకు ఎందుకు? తొక్కలో కెప్టెన్ అనేసి.. నాకు తెలుగు రాదని అంటావ్" అంటూ నాగ్​ సీరియస్​ అయ్యారు. సంజనా క్లారిటీ ఇచ్చేలోపు "నామినేషన్స్​లో మీ ఇద్దరి మధ్య డిస్కషన్ అయిపోయిన తరువాత.. లోపలికి వచ్చి పదే పదే సుమన్‌ని గిల్లావు" అంటూ కింగ్​ ఫైర్​ అయ్యారు. ఇక "నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. బ్రెయిన్ లెస్.. సెన్స్ లెస్.. షెటప్ అంటూ ఇవన్నీ ఎందుకు" అంటూ క్లాస్ పీకారు. అయితే ఈ వర్డ్స్​ ఎవరిని చూసి అన్నారో తెలియదు కానీ.. స్క్రీన్​ మీద మాత్రం మాధురి, సంజనాలవప కలిపి చూపించారు.

ఆ తరువాత కల్యాణ్​ని నిలబెట్టి.. "రేషన్ మేనేజర్ అయిన తనూజ గురించి నీ అభిప్రాయం చెప్పు" అని నాగ్​ అడిగారు. దీనికి మనోడు "టైమింగ్​లో కానీ, అబ్జర్వింగ్​లో కానీ వీక్​" అంటూ చెప్పాడు. దీంతో "హౌజ్​మేట్స్ అందరికీ ఆర్డర్స్ చేసే అధికారం ఉంటుందా?" అని కెప్టెన్ దివ్యని అడిగారు. ఆమె నో చెప్పడంతో.. వీడియో ప్లే చేసి చూపించారు. ఆ తర్వాత "ఆర్డర్లు జారీ చేయొచ్చా?" అని నాగార్జున అడిగితే.. "ఆ విషయంలో కళ్యాణ్‌దే తప్పు. వారం మొత్తం తనూజని విసిగించాడు" దివ్య చెప్పింది.

డీమాన్​కు రెడ్​ కార్డ్​: ఆ తరువాత రీతూ చౌదరిని బెడ్ మీదికి తోసేసి మ్యాన్ హ్యాడ్లింగ్ చేసిన డీమాన్ వీడియోను ప్లే చేసి చూపించారు నాగ్​. ఆ తర్వాత "ఇలాంటి బిహేవియర్ మీ ఇంట్లో ఆడపిల్లలపై చేస్తే మీరు బెల్ట్ పెట్టి కొట్టేవారా కాదా ఆడియన్స్" అని ఆడియన్స్‌ని అడిగారు నాగార్జున. "అలా తోయడం కరెక్ట్ కాదు సార్" అని ఆడియన్స్ అనడంతో.. "సారీ సార్" అని డీమాన్​ చెప్పాడు. దీంతో "సారీ చెప్తే.. బిగ్​బాస్ క్షమించడు. నీకు రెడ్ ఫ్లాగ్ తప్పదు. నీ బ్యాక్ ప్యాక్ చేసుకో. బిగ్ బాస్ ఓపెన్ ది డోర్" అని నాగ్​ అన్నారు.

రాము ఫన్నీ వీడియో: ఇక మూడో ప్రోమోలో రాము రాథోడ్​కు సంబంధించిన వీడియోలను ఫన్నీ వేలో చూపించారు. అందులో ఆయా సందర్భాల్లో రాము ఎలా మధ్యలో దూరాడో ఉంది. ఈ వీడియో చూస్తున్నంతసేపు అటు హోజ్​మేట్స్, హోస్ట్​, ఆడియన్స్​ ఫుల్​ ఎంజాయ్​ చేశారు.

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా దివ్య - భరణిపై ట్రోలింగ్!

Bigg Boss 9 Telugu: డేంజర్​ జోన్​లో ఆ ముగ్గురు! - ఎనిమిదో వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందా?