ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu: డేంజర్​ జోన్​లో ఆ ముగ్గురు! - ఎనిమిదో వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందా?

-ఉత్కంఠగా సాగిన 8వ వారం నామినేషన్లు - డేంజర్​ జోన్​లో ఆ కంటెస్టెంట్స్​ - డబుల్​ ఎలిమినేషన్​ అంటూ సోషల్​ మీడియాలో వైరల్​!

Bigg Boss 9 Telugu Voting Results
Bigg Boss 9 Telugu Voting Results (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 31, 2025 at 5:26 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Voting Results: బిగ్‌బాస్ సీజన్ 9 రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ చూడని ట్విస్టులు, టర్న్స్ ఈ సీజన్​లో చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో? బిగ్​బాస్ ఎవరిని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారో ? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంటోంది. ఇదిలా ఉంటే ఎనిమిదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్​కు టైమ్​ దగ్గరపడింది. రసవత్తరంగా సాగిన 8వ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరెవరు నామినేట్ అయ్యారు? ఓటింగ్​లో ఎవరెవరు ఏఏ స్థానాల్లో ఉన్నారు? సహా ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం.

తొమ్మిది మంది ఎలిమినేట్​: బిగ్​బాస్​ సీజన్​ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు హౌజ్​ నుంచి శ్రష్ఠి, మర్యాద మనీష్​, ప్రియా శెట్టి, మాస్క్​మ్యాన్​ హరీష్​, ఫ్లోరా సైనీ, దమ్ము శ్రీజ, భరణి, రమ్య మోక్ష ఎలిమినేట్​ అయ్యారు. ఇక ఆరోగ్యం బాగా లేని కారణంగా అయేషా హౌజ్​ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో ఇప్పటివరకు హౌజ్​ నుంచి 9 మంది ఎలిమినేట్​ అయ్యారు. ఈ వారం కూడా మరొొకరు ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయం వచ్చేసింది.

హౌజ్​లోకి మాజీలు: ఇక ఎనిమిదో వారం నామినేషన్స్​ను వినూత్నంగా ప్లాన్​ చేశారు బిగ్​బాస్​ టీమ్​. సాధారణంగా హౌజ్​లో సభ్యులు ఒకరినొకరు నామినేట్‌ చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఆటను మలుపుతిప్పే విధంగా మాజీ కంటెస్టెంట్లను తిరిగి హౌజ్​లోకి రప్పించారు. ఏడో వారం మినహా ఫస్ట్​ వీక్​ నుంచి ఆరో వీక్​ వరకు ఎలిమినేట్​ అయిన కంటెస్టెంట్స్​ను హౌజ్​లోకి తీసుకొచ్చి నామినేషన్స్​ చేయించారు. ఈ క్రమంలో హౌజ్​ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వచ్చిన మాజీలు తగిన కారణాలతో హౌజ్​మేట్స్​కు కత్తి దింపారు. ఇక ఉత్కంఠ భరితంగా సాగిన నామినేషన్ ప్రక్రియలో మాధురి, రీతూ చౌదరి, కల్యాణ్ పడాల, సంజనా గల్రానీ, తనూజ, డీమాన్ పవన్, గౌరవ్ గుప్తా, రామూ రాథోడ్​ ఇలా మొత్తం 8 మంది ఎలిమినేషన్ రేస్‌లో నిలిచారు.

టాప్​లో ఆ బ్యూటీ: ఇక ఓటింగ్ విషయానికొస్తే.. ఎనిమిదో వారం బిగ్‌బాస్ ఓటింగ్​లోనూ అసాధారణ పరిణామాలు, అన్యూహ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మద్దతుగా పోస్టులు చేస్తూ.. ఓటింగ్​లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియా, అనధికారిక సర్వేల ప్రకారం.. ఈ వారం ఓటింగ్‌లో మరోసారి తనూజ మొదటి స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఆ తరువాత స్థానంలో కళ్యాణ్ పడాల నిలిచారు. ఇక మూడో స్థానం నుంచి చూసుకుంటే సంజన గల్రానీ, రీతూ చౌదరి, డీమాన్​ పవన్​, మాధురి, గౌరవ్ గుప్తా, రాము రాథోడ్ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అనధికార ఓటింగ్​ ప్రకారం తనూజ, కల్యాణ్​, సంజనా, రీతూ, డీమాన్​ సేఫ్​ జోన్​లో ఉన్నట్టే. మిగిలిన ముగ్గురు మాధురి, గౌరవ్​ గుప్తా, రామూ రాథోడ్​లు డేంజర్​ జోన్​లో ఉన్నట్లు సమాచారం. వీళ్ల ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్​ కానున్నారు.

డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందా?: అయితే మెడికల్​ ఎమర్జెన్సీ కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయేషా మళ్లీ హౌజ్​లోకి తిరిగి వస్తుందని సోషల్​ మీడియాలో టాక్​. ఒకవేళ ఇదే నిజమైతే ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​కు ఛాన్స్​ ఉండనుందని సమాచారం. ఎందుకంటే ఇప్పటికే హౌజ్​లో 13 మంది ఉన్నారు. శ్రీజ, భరణిలలో ఒకరు పర్మినెంట్​ అయితే సంఖ్య 14కు చేరుకుంటుంది. ఇక ఆయేషా వస్తే 15 మంది అవుతారు. ఇక ఈ వారం నామినేషన్స్​లో ఉన్న వారిలో ఒకరు వెళ్లిన 14 మంది ఉంటారు. అయితే ఈ షో పూర్తి కావడానికి ఇంకా 7 వారాలే టైమ్​ ఉంటుంది. 14 మందిలో టాప్​ 5 తీసేస్తే మిగిలిదే 9 మంది. ఉండేది 7 వారాలు, కంటెస్టెంట్స్​ 9 మంది. ఈ లెక్కన చూసుకుంటే ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందని బిగ్​బాస్​ లవర్స్​ భావిస్తున్నారు. నిజంగానే డబుల్​ ఎలిమినేషన్​ ఉంటే గౌరవ్​ గుప్తా, మాధురి, రామూలలో ఇద్దరు ఎలిమినేట్​ అవుతారని టాక్​. అయితే గౌరవ్​ దగ్గర ఉన్న పవర్​ యూజ్​ చేసుకుంటే ఒక ఎలిమినేషనే ఉంటుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్​ చేయాల్సిందే.

Bigg Boss 9 Telugu Day 53 Episode: టాస్కుల్లో ఇరగదీసిన భరణి టీమ్​ - 'గూబ పగిలిపోద్ది' అంటూ శ్రీజ వార్నింగ్​ - మాధురి అలక!

Bigg Boss 9 Telugu: ఓటింగ్​తో సంబంధం లేకుండా మాధురి ఎలిమినేషన్​! - కారణం అదేనా? - సోషల్​ మీడియాలో వైరల్​!