ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu Today Promo:"బాయ్‌ఫ్రెండో, నాన్నో ఉంటే చాలు అన్నట్టు ఉంది" - నామినేషన్స్​లో వైల్డ్​కార్డ్​ వర్సెస్​ హౌజ్​మేట్స్​!

-బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో - ఆరోవారం ఫుల్​ ఫైర్​లో నామినేషన్స్​!

Bigg Boss 9 Telugu Today Promo
Bigg Boss 9 Telugu Today Promo (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 14, 2025 at 7:36 PM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Today Promo: బిగ్​బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్​ కంటెస్టెంట్స్ ఎంట్రీతో హౌజ్​ హీటెక్కింది. వచ్చిన మొదటి రోజే బిగ్​బాస్ ఇంట్లో ఫైర్​ స్టార్మ్​ ఎఫెక్ట్ మొదలైంది. ఎందుకంటే ఈ వారం ఎలిమినేషన్ జోన్​కి ఎవరు వెళ్లాలి? అనేది వైల్డ్ కార్డ్స్ చేతుల్లోనే ఉంటుందని బాంబ్ పేల్చారు బిగ్​బాస్. ఈ క్రమంలోనే ఆరో వారం నామినేషన్స్ ఫుల్ ఫైర్​లో ఉన్నాయి. ఇప్పటికే సోమవారం నాటి ఎపిసోడ్​లో సుమన్​ శెట్టి, డీమాన్​ పవన్​ నామినేట్​ అయ్యారు. తాజాగా నేటి ఎపిసోడ్​కు సంబంధించి ప్రోమోలు రిలీజ్​ చేశారు బిగ్​బాస్​ టీమ్​. ఇవి కూడా ఆడియన్స్​కు కిక్​ ఇచ్చేలా ఉన్నాయి. మరి వాటిల్లో ఏముందో ఇప్పుడు చూద్దాం.

మొదటి ప్రోమోలో రీతూ - రాము మధ్య గత వారం జరిగిన బెలూన్​ టాస్క్​ విషయంలో హీటెడ్​ ఆర్గ్యూమెంట్​ జరిగింది. మరోవైపు భరణితో డిస్కషన్​ పెట్టింది మాధురి. "హౌజ్​లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. మీకు దివ్య తప్ప ఇంకో ప్రపంచం కనిపించడం లేదు" అంటూ మాధురి చెప్పింది. ఈ క్రమంలో బజర్​ మోగింది. ఇక బాల్​ను అందుకుని రీతూకు ఇచ్చింది మాధురి. దీంతో మొదటి నామినేషన్​గా భరణిని ఎంచుకుంది రీతూ. "ఈ మనిషి మాట ఇచ్చాడంటే అది జరుగుతుంది అనే నమ్మకం మీ దగ్గరి నుంచి నేను కోల్పోయాను" అంటూ తన రీజన్​ చెప్పింది. దీంతో "నేను మాట ఇచ్చిన తర్వాత ఎన్ని టాస్క్​లు ఆడావు"అని భరణి క్వశ్చన్​ రెయిజ్​ చేయగా.. "కెప్టెన్​ టాస్క్​లో మీ సపోర్ట్​ నాకు కంపల్సరీ కావాల్సిన టైమ్​లో వెనకడుగు వేశారు" అంటూ చెప్పింది రీతూ. ఇలా ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్​ జరిగింది. అదే విధంగా రాము - సంజనా మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భరణిని సేవ్​ చేసి దివ్యను నామినేట్​ చేసింది మాధురి. దీంతో ప్రోమో ఎండ్​ అయ్యింది.

రెండో ప్రోమోలో తనూజపై ఓ రేంజ్​లో ఫైర్​ అయ్యింది ఆయేషా. ఈ రౌండ్​లో బాల్ అందుకొని సుమన్ శెట్టి చేతికి ఇచ్చింది అయేషా. సుమన్ ముందుగా సంజనని నామినేట్ చేశాడు. "సంజన గారు.. ఎక్కడైనా గొడవ స్టార్ట్ అయిందంటే అసలు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు కదా. అది తప్పు. గొడవడానికి ఆపడానికి మీరు ట్రై చేయాలి. కానీ మీరు ఎందుకు అంత హ్యాపీ ఫీలవుతున్నారు" అంటూ సుమన్ యాక్ట్ చేసి చూపించాడు. దీంతో సంజన సహా అందరూ తెగ నవ్వుకున్నారు.

ఆ తర్వాత తన రెండో నామినేషన్‌కి తనూజని సెలక్ట్ చేశాడు సుమన్ శెట్టి. "కొంచెం డ్రామాలా అనిపిస్తుంది. అందువల్ల సెంటిమెంటు ఎక్కువ అనిపిస్తుంది" అని తనూజతో అన్నాడు. దీనికి "ప్రతి శుక్రవారం బట్టలు వస్తే చాలు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏడ్చేది మీరు" అంటూ తనూజ సెటైర్ వేసింది. "నేను ఏడ్చినదాని కంటే నువ్వు ఎక్కువ ఏడుస్తున్నావ్" అని సుమన్ శెట్టి చెప్పాడు. "అవునా మీకు అలా అనిపిస్తుందా" అంటూ తనూజ వెటకారం ఆడితే "నాకే కాదు అందరికీ అలానే అనిపిస్తుంది" అని సుమన్ శెట్టి గట్టిగానే వాదించాడు. ఇక ఈ రెండింటిలో సంజనని సేవ్ చేసి తనూజని నామినేట్ చేసింది ఆయేషా.

తనూజపై ఆయేషా కామెంట్లు: ఈ క్రమంలోనే "మీ ఇన్‌ఫ్లుయెన్స్, మీ ఫేవరిజం వల్ల ఇక్కడ మిగతా అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది అనేది నా పాయింట్. ఓపెన్‌గా చెప్పాలంటే ఎలా అనిపిస్తుందంటే మీ వల్ల భరణి గారి గేమ్ కూడా పాడైపోతుందని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా మంచి సీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ(బిగ్​బాస్​ హౌజ్​లో​) అది అవసరం లేదు" అంటూ ఆయేషా ఫైర్ అయింది. "ప్రతి దానికి భరణి సార్ వచ్చే నన్ను సపోర్ట్ చేశారా" అని తనూజ ప్రశ్నించింది. "నీకు ఏ ప్రాబ్లమ్ అయినా నాన్న ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదని ఏడవలేదా నువ్వు ఇక్కడ" అని ప్రశ్నించింది ఆయేషా. "అఫ్‌కోర్స్ ఎవరికి వాళ్లు ఇక్కడ ఫేవరెట్ ఉన్నారు. ఎవరికి వాళ్లు సపోర్ట్ చేసుకోవడానికి ఉన్నారు" అని తనూజ అంది. "అంటే నీకు అసలు ఇక్కడ ఫేవరిజం లేదంటున్నావా" అని మళ్లీ క్వశ్చన్ చేసింది ఆయేషా.

"మేము డే 1 నుంచి క్లోజ్ ఉన్నాం కాబట్టి" అని తనూజ అనగానే.. "ఆ అదే చెప్తున్నా మీరు చాలా క్లోజ్‌గా ఉన్నారని చెప్తున్నా. ఇక్కడ ఒక బాయ్‌ఫ్రెండో, నాన్నో ఉంటే ఓకే ఫైనల్ వరకూ వచ్చేద్దాం అన్నట్లు ఉంది ఫ్రాంక్‌గా చెప్పాలంటే" అంటూ సీరియస్​ అయ్యింది. దీంతో చాలా వరకు హౌజ్​మేట్స్​ ముఖాలు మాడిపోయాయి.

కెప్టెన్​ కల్యాణ్​కు పవర్​: ఇక మూడో ప్రోమోలో కెప్టెన్​ అయిన కల్యాణ్​కు పవర్​ ఇచ్చారు బిగ్​బాస్​. వైల్డ్​కార్డ్స్​ కంటెస్టెంట్స్​, నామినేట్​ అయిన వాళ్లు కాకుండా మిగిలిన హౌజ్​మేట్స్​ నుంచి ఒకరిని నేరుగా నామినేట్​ చేయమని చెప్పారు. దీంతో రాము రాథోడ్​ను నామినేట్​ చేశాడు కల్యాణ్​. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇక తనూజ గురించి ఆయేషా చెప్పిన పాయింట్స్​పై సంజనా, మాధురి డిస్కస్​ చేసుకున్నారు.

Bigg Boss 9 Day 36 Review : కల్యాణ్​, మాధురి మధ్య మంట పెట్టిన 'వంట' - ఆరో వారం నామినేషన్స్​లో ఉన్నది వీళ్లే!

Bigg Boss 9 Kalyan Vs Madhuri: "ఏంటి వాయిస్​ రెయిజ్​ అవుతోంది?" ఫస్ట్​ రోజే మాధురి హైడ్రామా!