ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu: ఆ ఒక్కరే పర్మనెంట్​ హౌజ్​మేట్!​ - హీరో హీరోయిన్​గా 'డీమాన్​ - రీతూ'!

- కంటెస్టెంట్స్​ అయ్యేందుకు ఆ ఇద్దరి అవస్థలు - భరణికి బదులు టాస్క్​ ఆడిన దివ్య

Bigg Boss 9 Telugu Today Promo
Bigg Boss 9 Telugu Today Promo (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 30, 2025 at 5:27 PM IST

2 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Today Promo: బిగ్​బాస్​ హౌజ్​లో తిరిగి కంటెస్టెంట్స్​​ అయ్యేందుకు భరణి, శ్రీజ బాగానే కష్టపడుతున్నారు. అయితే నిన్నటి టాస్క్​లో భరణి గాయపడి హౌజ్​ నుంచి బయటకు వెళ్లడంతో ఓటింగ్​తో సంబంధం లేకుండా శ్రీజ పర్మినెంట్​ హౌజ్​మేట్​ అవుతుందని అందరూ భావించారు. కానీ గోడకు కొట్టిన బంతిలా డాక్టర్​ ట్రీట్​మెంట్​ తీసుకుని భరణి హౌజ్​లోకి వచ్చాడు. దీంతో మరోసారి పోటీ పడక తప్పదు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరికి టాస్క్​ పెట్టాడు బిగ్​బాస్​. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్​ చేశారు. అయితే ఈ టాస్క్​లో భరణి బదులు దివ్య గేమ్​ ఆడింది. మరి ఈ టాస్క్​లో ఎవరు గెలిచారు? అసలు నేటి ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

భరణి ప్లేస్​లో గేమ్​ ఆడిన దివ్య: "భరణి - శ్రీజ మీకు ఇప్పుడు ఫ్లాగ్​ను పొందేందుకు మరో అవకాశాన్ని ఇస్తున్నాను. అందులో భాగంగా మీకు ఇస్తున్న టాస్క్​ రేస్​ ఆఫ్​ మేస్​. డాక్టర్​ సూచన మేరకు భరణి మీరు మీ బదులు ఒక సబ్​స్టిట్యూట్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది" అంటూ బిగ్​బాస్​ చెప్పాడు. దీంతో నిఖిల్, దివ్యలో ఎవరు చేస్తారంటూ భరణి అడగ్గా.. "నేను చేస్తా" అంటూ కాన్ఫిడెంట్​గా చెప్పింది. దీంతో దివ్య, శ్రీజ టాస్క్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ టాస్క్​కు కూడా మాధురి సంచాలకురాలిగా ఉంది. టాస్క్​ కోసం ఇద్దరు యాక్టివిటీ ఏరియాకు వెళ్లారు. స్టార్ట్ పాయింట్​నుంచి ప్రారంభించి.. ఆ బ్లాక్స్​ను కిందపడకుండా కర్ర మీద బ్యాలెన్స్ చేస్తూ.. మేస్​కు వివిధ వైపులా ఉన్న 5 చోట్ల పెట్టాలి" అని గేమ్​ గురించి ఎక్స్​ప్లెయిన్​ చేశాడు బిగ్​బాస్. ఇక టాస్క్​ మొదలుకాగానే దివ్య, శ్రీజ హోరాహోరీగా పోరాడారు. ప్రోమోలో ఉన్న దాని ప్రకారం దివ్య రెండు బ్లాక్స్​లను ఆయా ప్లేస్​లలో పెట్టినట్లు కనిపిస్తోంది.

హీరో హీరోయిన్​గా రీతూ - డీమాన్​: ఇక నేటి ఎపిసోడ్​కు సంబంధించిన రెండో ప్రోమో కూడా వచ్చేసింది. అయితే ఇది పూర్తిగా కామెడీ మూడ్​లో తీసుకెళ్లాడు బిగ్​బాస్​. వర్షం కారణంగా టాస్క్​లకు బ్రేక్​ పడడంతో .. ఇంట్లోవారిని ఎంటర్​టైన్ చేయడం ప్రారంభించాడు ఇమ్మాన్యుయేల్​. పవన్​, రీతూ హీరోహీరోయిన్​గా ఇమ్మూ డైరెక్టర్​గా ఈ స్కిట్​ ఉంటుంది. దీంట్లో పవన్​ ఓ సైడ్ గొడుగు పట్టుకుని ఉండగా.. మరోవైపు రీతూని గొడుగు పట్టుకుని ఉంటుంది. ఇమ్మూ అడిగిన క్వశ్చన్స్​కి ఆన్సర్స్ ఇచ్చుకుంటూ దగ్గరగా రావాలని చెప్తాడు. అయితే ఈ సమయంలో కాస్త ఫన్ జెనరేట్ చేశాడు ఇమ్మూ. ఇక సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోన్న ప్రకారం భరణి పర్మినెంట్​ హౌజ్​మేట్​ అయినట్లు తెలుస్తోంది. అంటే భరణి హౌజ్​లో కొనసాగితే, శ్రీజ మరోసారి ఎలిమినేట్​ కానున్నట్లు సమాచారం. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu: ఓటింగ్​తో సంబంధం లేకుండా మాధురి ఎలిమినేషన్​! - కారణం అదేనా? - సోషల్​ మీడియాలో వైరల్​!

Bigg Boss 9 Day 52 Promo : రీ-ఎంట్రీ టాస్క్​లో శ్రీజ, భరణి మధ్య గట్టి వార్ - సుమన్ రచ్చ రచ్చ!