ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu: హౌజ్​లోకి దమ్ము శ్రీజ, భరణి రీ ఎంట్రీ - "సారీ చెప్తే సరిపోతుందా" అంటూ సంజనాపై భరణి ఫైర్​!

-ఇమ్మాన్యుయేల్​కు అద్దిరిపోయే కౌంటర్​ ఇచ్చిన భరణి - మరోసారి మాధురి- శ్రీజ మధ్య గొడవ!

Bigg Boss 9 Telugu Today Promo
Bigg Boss 9 Telugu Today Promo (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 28, 2025 at 5:26 PM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Today Promo: బిగ్​బాస్​ సీజన్ 9లో 8వ వారం నామినేషన్స్ ప్రక్రియ​ సాగుతోంది. ఇప్పటికే హౌజ్​ నుంచి ఎలిమినేట్​ అయిన శ్రీజ, ఫ్లోరా, మర్యాద మనీష్​, ప్రియా శెట్టి నిన్నటి ఎపిసోడ్​లో నామినేషన్స్​ వేశారు. ఇక నేటి ఎపిసోడ్​లో భరణి, శ్రష్టి వర్మ హౌజ్​లోకి ఎంటర్​ అయ్యారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్​ అయ్యింది. అంతేకాకుండా నిన్న నామినేషన్స్​ టైమ్​లో బిగ్​బాస్​ చెప్పినట్టుగా భరణి, శ్రీజ రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఇందులో ఓ మెలిక పెట్టారు బిగ్​బాస్​. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇక ఈరోజు బిగ్​బాస్ హౌజ్​లోకి భరణి వచ్చాడు. ఆరో వారంలో షాకింగ్ ఎలిమినేషన్‌తో ఇంటి నుంచి బయటకు వెళ్లిన భరణి.. మళ్లీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ నామినేషన్స్‌ ప్రోమోలో భరణి.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేశాడు. ఇక భరణిని చూడగానే.. దివ్య నిఖిత పరుగున వెళ్లి హగ్​ చేసుకుని ఎమోషనల్​ అయ్యింది. అయితే తనూజ ఎమోషనల్​ అయినా.. దగ్గరికి వెళ్లకుండా ఉండిపోయింది. హౌజ్​లోకి వచ్చి రావడంతోనే ఇమ్మానుయేల్‌కి పంచ్ వేశాడు భరణి. "కట్టప్పా.. చంపేశావ్ కదా.. అమరేంద్ర బాహుబలిని. కానీ మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్పా" అంటూ ఇమ్మానుయేల్‌ని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత తన తొలి పోటుని సంజనాకి పొడిచాడు భరణి.

సారీ చెబితే సరిపోతుందా: "లయన్ అన్నా.. భరణి అన్నా.. అని నన్ను మీరు పిలిచినప్పుడల్లా, నేను సిస్టర్‌గానే భావించాను. నేను ఎవరి దగ్గరా కూడా ఫేక్ రిలేషన్స్ మెయిన్‌టైన్ చేయలేదు. మీ వరకూ వచ్చేసరికి రూల్స్. మిగతావాళ్లకి రూల్స్ ఉండవు. వాళ్లకి ఫీలింగ్స్ ఉండవు. ఎమోషన్స్‌లో, కోపంలో మాట అనేస్తారు. ఆ తర్వాత సారీ చెప్తుంటారు" అంటూ గట్టిగానే నిలదీశాడు భరణి. "సారీ చెప్పాను కదా" అని సంజన అనడంతో.. "సారీ చెప్తే సరిపోతుందా?" అని గట్టిగా అరిచాడు భరణి. దీంతో సంజనా సహా హౌజ్​ మొత్తం సైలెంట్​ అయ్యింది. అయితే "మీరు బయటకు వెళ్లింది. బాండ్స్ పెట్టుకోవడం వల్లే" అని సంజనా అనింది.

నాకు కనిపించడం లేదే: ఇక తన రెండో కత్తిని నిఖిల్​కు ఇచ్చారు భరణి. దీంతో తనూజను నామినేట్​ చేశాడు నిఖిల్​. "కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మానుయేల్ దగ్గరకు వెళ్లి అడుక్కుంటున్నావ్. నేను అమ్మాయిని నాకు ఛాన్స్ ఇవ్వు అని. అలా అడగడం నాకు నచ్చలేదు" అంటూ చెప్పాడు నిఖిల్. "మీరు ఏం గేమ్ ఆడారు. నాకేం కనిపించలేదు" అని తనూజ అనడంతో.. "మీరు చూడకపోతే నా తప్పు కాదు కదా" అని పంచ్ ఇచ్చాడు నిఖిల్. "నన్ను నామినేట్ చేసే ముందు. మీరు ఏం గేమ్ ఆడారో మైండ్‌లో పెట్టుకుని నామినేట్ చేయండి" అని తనూజ ఫైర్​ అయ్యింది. దాంతో "అసలు మీరేం టాస్క్‌లు ఆడారో చెప్పండి" అని గట్టిగానే అడిగాడు నిఖిల్​. "ఆడాను కాబట్టే.. ఈరోజు ఇక్కడ ఉన్నాను" అని తనూజ అనడంతో.. "ఎక్కడా.. నాకు కనిపించడం లేదే మీ ఫొటో కెప్టెన్సీ బోర్డ్‌లో" అంటూ ఇచ్చిపడేశాడు నిఖిల్. ఇలా ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్​ నడిచింది.

ఇక చివరగా డీమాన్​ను నామినేట్​ చేసింది శ్రష్టి వర్మ. "నీకు కండబలం ఉంది కానీ. బుద్ది బలం లేదు. నీతో ఉంటున్న రీతూకి చాలా క్లారిటీ ఉంది కానీ.. నీకు అస్సలు క్లారిటీ లేదు" అని పవన్ గాలి తీసేసింది. దీనికి మనోడు ఏదో క్లారిటీ ఇవ్వబోయాడు. ఇంతటితో నామినేషన్స్​కు సంబంధించిన ప్రోమో ఎండ్​ అయ్యింది.

భరణి - శ్రీజ రీ ఎంట్రీ: ఎలిమినేట్​ అయిన కంటెస్టెంట్స్​తో నామినేషన్స్ చేయించడమే కాకుండా.. తిరిగి వాళ్లలో కొంతమందికి కంటెస్టెంట్స్‌గా రీ ఎంట్రీకి అవకాశం కల్పించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్​ చేశారు. "నిన్న మీరు మీ ఎక్స్​ హౌజ్​మేట్స్​లో కొందరిని ఎదుర్కొన్నారు. వారిలో ఎవరు మళ్లీ ఇంట్లోకి ప్రవేశించి పర్మినెంట్​ హౌజ్​మేట్స్​గా మారే అవకాశం పొందుతారు అనేది చూసే సమయం ఆసన్నమైంది" అంటూ బిగ్​బాస్​ అనౌన్స్​ చేశారు. ఈక్రమంలో శ్రీజ దమ్ము, భరణి ఎంట్రీ ఇచ్చారు.

"భరణి, శ్రీజ.. ఈ రణరంగంలో నిలబడాలంటే మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించడం, వాటిని సరి చేసుకోవడం చాలా ముఖ్యం. అక్కడ ఉన్న మిర్రర్​పై పాయింట్లు రాసి వారికి రియాలిటీ చెక్​ ఇవ్వండి" అంటూ హౌజ్​మేట్స్​ సూచించారు బిగ్​బాస్​. ఈ క్రమంలో శ్రీజకు సజేషన్​ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్​. ఏదైనా గొడవ ఉన్నప్పుడు ఆర్గ్యూ చేయడం మన హక్కు. అయితే దానికి ఎక్కువ ప్రొలాంగ్​ చేయవద్దు" ఇమ్మాన్యుయేల్​ చెప్పాడు.

ఇక భరణిని ఎంచుకున్నాడు డీమాన్. నేను ఈ అద్దాన్ని భరణి గారికి ఇవ్వాలనుకుంటున్నాను. మీ విషయంలో మూడు సార్లు డిసప్పాయింట్​ అయ్యాను. మిమ్మల్ని నమ్మాలి అన్నా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది" అంటూ తన పాయింట్లు చెప్పాడు డీమాన్​. దీంతో నా మీద ట్రస్ట్​ ఉంచుకుంటావా? తీసేసుకుంటావా అనేది నీ పర్సనల్​ ఓపీనియన్​" అంటూ భరణి అన్నాడు. ఆ తర్వాత శ్రీజకు మైండ్​ యువర్​ వర్డ్స్​ అనే అద్దాన్ని ఇచ్చింది మాధురి. దీంతో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్​ నడిచింది. దీంతో ప్రోమో ఎండ్​ అయ్యింది.

Bigg Boss 9 Telugu Day 50 Episode: "మీది అన్ హెల్దీ బాండ్" రీతూపై మాధురి పర్సనల్​ ఎటాక్​ - హాట్​హాట్​గా నామినేషన్లు!

Bigg Boss 9 Telugu Nominations: హౌజ్​మేట్స్​కు కత్తి దింపిన ఎలిమినేటర్లు - కిక్​ ఇచ్చేలా నామినేషన్స్​ ప్రోమో!