ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu : బిగ్​బాస్​లో "దీపావళి" సందడి - ఫ్యామిలీ నుంచి వీడియో మెసేజ్‌లు - ప్రోమోలు అదుర్స్​!

-బిగ్‌బాస్ దీపావళి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్​ - పంచ్​లతో అలరించిన హైపర్​ ఆది - హౌజ్​మేట్స్​కు నాగ్​ సర్​ప్రైజ్​!

Bigg Boss 9 Telugu Sunday Promo
Bigg Boss 9 Telugu Sunday Promo (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 19, 2025 at 4:08 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Sunday Promo: బిగ్​బాస్​ హౌజ్​లో దీపావళి ధమాకా మొదలైంది. ఈ మేరకు స్పెషల్​ ఎపిసోడ్​ ప్లాన్​ చేశారు బిగ్​బాస్​ టీమ్​. దీంతో ఈరోజు సాయంత్రం 7 గంటలకే ఎపిసోడ్ స్టార్ట్​ కానుంది. ఇక స్పెషల్​ ఎపిసోడ్​ అంటే సెలబ్రెటీల డ్యాన్స్‌లు, ఫన్నీ గేమ్స్‌ ఉంటాయి. అంతేకాకుండా ఈసారి దీపావళికి ఫ్యామిలీ నుంచి వచ్చిన వీడియో మెసేజ్‌లు కూడా నాగార్జున చూపించబోతున్నారు. అంతేకాకుండా హౌజ్​మేట్స్​కు కింగ్​ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రోమోలు రిలీజ్​ చేశారు. మరి వాటిల్లో ఏముంది? ఎవరెవరికి వీడియో మెసేజ్​లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.

మటన్​ బిర్యానీతో పోల్చిన అమ్మాయి: ఫెస్టివ్​ లుక్​లో ఎంట్రీ ఇచ్చారు కింగ్​ నాగ్​. ఇక రావడమే అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. "దీపావళి మీ ఇంట్లో.. ఎంటర్‌టైన్‌మెంట్ బ్లాస్ట్ మా బిగ్‌బాస్ ఇంట్లో" అంటూ ఆడియన్స్​కు హుషారు తెప్పించారు. ఇక కంటెస్టెంట్స్​ను ఉద్దేశిస్తూ.. "దీపావళికి రకరకాల టపాసులుంటాయి. మీరే మా క్రాకర్స్" అంటూ చెప్పారు నాగార్జున. ఇక టాలీవుడ్​ మన్మథుడిని చూసి ఆడియన్స్‌లో ఒక అమ్మాయి "మటన్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో.. మీరంటే నాకు అంత పిచ్చి" అని చెప్పగానే.. "అమ్మో మటన్ బిర్యానీతో కంపేర్ చేశావా" అంటూ నాగార్జున నవ్వులు పూయించారు.

హౌజ్​మేట్స్​కు నాగ్​ సర్​ప్రైజ్​: ఇక నాగార్జునని చూడగనే "పెళ్లిచూపుల్లా కనిపిస్తున్నారు సార్" అంటూ సంజన చెప్పింది. దీనికి "అవును నీకూ నాకా" అంటూ నాగ్ పంచ్ వేశారు. "ఇక ఇది అసలైన దీపావళి ఫ్యామిలీ ఫెస్టివల్​. ఆటతో పాటు గెలిస్తే ఫ్యామిలీ నుంచి వీడియో మెసేజ్ వస్తుంది. నేను మూడు పదాలు చెప్తాను. ఆ మూడు పదాలు విని సినిమా గెస్ చేయాలి" అని నాగార్జున ఒక గేమ్ పెట్టారు. ఇక మధ్యమధ్యలో పలువురు హౌజ్​మేట్స్ డ్యాన్స్ చేశారు. అయితే వారిలో సుమన్ శెట్టి దాయిదాయిదామ్మా పాటకి డ్యాన్స్ వేశాడు. ఇక సుమన్ డ్యాన్స్ చూసి "అధ్యక్షా అదిరిపోయింది" అంటూ నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చారు. "ఈ పండగ రోజున నా కుటుంబ సభ్యులతో పండగ జరుపుకుందామని నేను మీ అందరికీ చిన్న గిఫ్ట్స్ తెచ్చాను" అంటూ నాగ్ సర్‌ప్రైజ్ చేశారు. ఈ క్రమంలోనే హౌజ్​మేట్స్​ అందరికీ బట్టలు ఇచ్చారు. ఇంతలో "నాకు ఎందుకు సార్ ఇమ్మానుయేల్ ఫేవరెట్ కలర్ ఇచ్చారు" అని తనూజ అడిగింది. "ఆ కలర్‌లో నిన్ను చూస్తే ఇమ్మాన్యుయేల్ రెడ్ ఫ్లవర్ అవుతాడు కాబట్టి" అంటూ నాగ్ డైలాగ్ వేశారు. దీంతో హౌజ్​మేట్స్​ అందరూ నవ్వుకున్నారు.

ఫ్యామిలీ నుంచి వీడియో మెసేజ్​లు: ఇక ప్రోమో చివరిలో హౌజ్​మేట్స్ నుంచి కొంతమందిని సెలక్ట్ చేసి వీడియో మెసేజ్‌లు ప్లే చేశారు. ముందుగా డీమాన్ పవన్ తల్లి మాట్లాడారు. తన తల్లిని చూడగానే పవన్ ఎమోషనల్ అయ్యారు. తర్వాత సుమన్ శెట్టి భార్య మాట్లాడారు. ఇక చివరిగా సంజన భర్త తన పిల్లలు ఇద్దరినీ కూర్చోబెట్టుకొని వీడియోలో కనిపించారు. "నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్ సంజన. అలానే ఆడు. నీ కోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం. హ్యాపీ దీపావళి నీకు" అంటూ సంజన భర్త చెప్పారు. తన పిల్లల్ని, భర్తని చూడగానే సంజన ఎమోషనల్ అయి ఏడ్చేసింది. దీంతో ఫస్ట్​ ప్రోమో ఎండ్​ అయ్యింది.

పంచ్​లతో నవ్వించిన హైపర్​ ఆది: దీపావళి ఎపిసోడ్​కు సంబంధించిన రెండో ప్రోమో కూడా రిలీజ్​ చేశారు. ఈ స్పెషల్​ ఎపిసోడ్​కు ప్రమోషన్స్​లో భాగంగా 'జటాధర' మూవీ టీమ్​ వచ్చింది. హీరో సుధీర్​ బాబు, బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా హాజరయ్యారు. ఇక టాప్​ లేచిపోద్ది సాంగ్​కు మరోసారి డ్యాన్స్​ అదరగొట్టాడు సుమన్​ శెట్టి. ఇక ఆ తర్వాత సింగర్​ సాకేత్​ వచ్చి కంటెస్టెంట్స్​ మీద కొన్ని సాంగ్స్​ పాడాడు. లిటిల్​ హార్ట్స్​ సినిమాలో కాత్యాయనీగా నటించిన హీరోయిన్​ శివానీ నాగారం డ్యాన్స్​ పర్ఫార్మెన్స్​తో అద్దరగొట్టారు. ఇక ఎప్పటిలాగానే హైపర్​ ఆది కూడా స్టేజ్​ మీదకు వచ్చిన కంటెస్టెంట్స్​పై పంచ్​లు వేశారు. దీంతో రెండో ప్రోమో కూడా ఎండ్​ అయ్యింది.

Bigg Boss 9 Telugu: వీడియో ప్లే చేసి తనూజ కళ్లు తెరిపించిన నాగ్​ - 'రీతూ - డీమాన్'​ బంధానికి బ్రేక్​!

Bigg Boss 9 Telugu Weekend Episode: "పవన్​ నా బుజ్జి తమ్ముడు" ప్లేట్​ తిప్పేసిన రమ్య - షాక్​ ఇచ్చేలా ఆడియన్స్​ ఓటింగ్​!​