Bigg Boss 9 Telugu Nominations Promo: "నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం" - రీతూపై ఆయేషా పర్సనల్ ఎటాక్!
-ఫుల్ ఫైర్‌లో ఏడో వారం నామినేషన్స్ - రీతూపై మాటలతో రెచ్చిపోయిన ఆయేషా!

Published : October 20, 2025 at 1:58 PM IST
Bigg Boss 9 Telugu Nominations Promo: సోమవారం వచ్చిందంటే బిగ్‌బాస్ హౌజ్‌లో నామినేషన్స్ హడావుడి ఉంటుంది. తమకు నచ్చని కంటెస్టెంట్స్‌ను తగిన కారణాలు చెప్పి నామినేట్ చేస్తుంటారు హౌజ్‌మేట్స్. అయితే గత సీజన్స్‌తో పోలిస్తే తొమ్మిదో సీజన్లో నామినేషన్స్ ప్రక్రియను డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు బిగ్‌బాస్ టీమ్. గత వారం కొత్తగా వచ్చిన వైల్డ్కార్డ్స్కు బాల్ ఆఫ్ ఫైర్ టాస్క్ పేరుతో నామినేషన్లు జరపగా.. తాజాగా ఏడో వారంలో మరో కొత్త కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఈ వారం కూడా నామినేషన్స్ హీట్ ఎక్కించేలా జరిగాయి. మరి ఆ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
ప్రోమోలో ఏముందంటే: "ఈ బిగ్‌బాస్ రణరంగంలో నామినేషన్ హక్కును కూడా పోరాడి గెలవాల్సిందే అనే విషయం మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది. ఈ వారం నామినేషన్స్ శంఖారావాన్ని ఇమ్మాన్యుయేల్, ఆయేషా పూరిస్తారు. బిగ్‌బాస్ ఇల్లు వేలాది బెలూన్స్‌తో నిండి ఉంటుంది. అక్కడ ఉన్న బెలూన్స్ కొన్నింటిలో నామినేషన్స్ టికెట్స్ దాగి ఉంటాయి. ఆ టికెట్లు పొందిన వారికి నామినేట్ చేయడానికి కావాల్సిన వివిధ శక్తులు లభిస్తాయి" అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో టాస్క్ పూర్తయ్యే సమయానికి ఆయేషాకు నామినేట్ - 1 అని రెండు టికెట్లు, డైరెక్ట్ నామినేట్ అని ఒక టికెట్ లభించింది. ఇక ఇమ్మాన్యుయేల్‌కు నామినేట్ - 2 అనే టికెట్లు రెండు, నామినేట్ - 1 అనే టికెట్లు మూడు లభించాయి. ఆయేషాకు డైరెక్ట్ నామినేట్ కార్డ్ లభించడంతో తగిన కారణం చెప్పి.. వాళ్ల మొహంపై ఫోమ్ పూసి నామినేట్ చేయమని చెప్పారు బిగ్‌బాస్.
దాంతో తన పవర్‌ని ఉపయోగించి రీతూని డైరెక్ట్ నామినేట్ చేసి పర్సనల్ ఎటాక్‌కు దిగింది ఆయేషా. "నువ్వు నీ ఓవరాక్షన్ నాకు ఈ ఇంట్లో అస్సలు నచ్చలేదు. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం"అని కామెంట్లు చేసింది. దాంతో రీతూ.. "నీకు చెప్పానా?? నేను లవ్ చేస్తున్నానని. లవ్ చేస్తూ తిరుగుతున్నానని" అంటూ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే "నేను డైరెక్ట్‌గా రీతూ చౌదరిని నామినేట్ చేస్తున్నా" అంటూ యాటిట్యూడ్ చూపించింది ఆయేషా. ఇక "ఈ నామినేషన్ గురించి మీరు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా?" అని రీతూని బిగ్ బాస్ అడిగితే.. మధ్యలో ఆయేషా కల్పించుకుని "నాకు ఆ అమ్మాయి ఏం చెప్పినా వినాలని లేదు. నేను ఆల్రెడీ విన్నాను. కన్విన్స్ కాను. ‘నాకు అనిపించింది నేను చెప్తా. నాకు అనిపించింది నేను అనేస్తా" అని అడ్డదిడ్డంగా మాట్లాడింది ఆయేషా.
"నీకు అనిపిస్తే అనేస్తావ్. అన్నంతమాత్రానా అదే కరెక్ట్ కాదు" అని రీతూ అంటే.. "ఏయ్ ఎందుకే నీకు అంత యాటిట్యూడ్" అని నోరుపారేసుకుంది ఆయేషా. దీనికి "నీకు ఎంత యాటిట్యూడ్ ఉంటే.. నాకు అంతే ఉంటుంది" అంటూ కౌంటర్ ఇచ్చింది రీతూ. దీంతో "నువ్వు నాకు నచ్చలేదు. నీ గేమ్ స్ట్రాటజీ (లవ్ ట్రాక్) నాకు నచ్చలేదు" అంటూ ఆయేషా అనింది. దీంతో ప్రోమో ఎండ్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ప్రకారం కేవలం రీతూ - ఆయేషా మధ్య మాత్రమే కాకుండా తనూజ - రమ్య మధ్య కూడా గొడవ గట్టిగానే జరిగినట్లు తెలుస్తోంది.
Bharani Elimination: భరణి ఎలిమినేషన్‌ను శాసించిన 'పవరాస్త్ర' - ఆ ముగ్గురికి సలహాలు - అతనికి సారీ!

