ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu Nominations: హౌజ్​మేట్స్​కు కత్తి దింపిన ఎలిమినేటర్లు - కిక్​ ఇచ్చేలా నామినేషన్స్​ ప్రోమో!

-ఎక్స్ కంటెస్టెంట్స్ చేత నామినేషన్స్ - ఫుల్​ ఫైర్​లో ప్రోమోలు!

Bigg Boss 9 Telugu Nominations
Bigg Boss 9 Telugu Nominations (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 27, 2025 at 5:19 PM IST

5 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Nominations: నామినేషన్స్​ అంటే ఇలా ఉండాలి అనేలా ఉన్నాయి నేటి ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమోలు. ఇంటి నుంచి ఎలిమినేట్​ అయిన కంటెస్టెంట్స్​ను తీసుకొచ్చి నామినేషన్​ ప్రక్రియ షురూ చేశాడు బిగ్​బాస్​. ఈ క్రమంలో శ్రీజ, ప్రియా, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్​ హౌజ్​లోకి ఎంటర్​ అయ్యారు. తమకు నచ్చని కంటెస్టెంట్​ను స్ట్రాంగ్​ రీజన్​ చెప్పి కత్తి దించారు. అయితే ఇలా ఎలిమినేట్​ అయిన వారితో నామినేషన్స్​ చేపించడం కొత్తమే కాదు. గత సీజన్​లో కూడా ఇలానే చేశారు. మరి ఈ రోజు ఎవరు ఎవరిని నామినేట్​ చేశారు? చెప్పిన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

హోజ్​లోకి ప్రియా, శ్రీజ, మనీష్​, ఫ్లోరా: బిగ్​బాస్ ఇల్లు నామినేషన్స్ సమరానికి సిద్దం అయ్యింది. మీరు ఆడిన ఆటని ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసిన వాళ్లు.. మీ తలరాత రాయబోతున్నారు. అంతేకాదు వీరిలో కొద్ది మంది.. ఇంటి సభ్యులుగా మారి మీరు కోరుకునే బిగ్​బాస్ ట్రోఫీ కోసం పోరాడి.. మిమ్మల్నే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ని ఈవారం నామినేట్ చేయడానికి హౌస్‌లోకి తీసుకుని వచ్చారు బిగ్ బాస్. వాళ్లకి రెండు కత్తులు ఇచ్చి వాటికి రెండు పవర్స్ ఇచ్చారు. ఒక కత్తి నామినేట్ చేయడానికి, రెండోకత్తి నామినేషన్ పవర్‌ని వేరే వాళ్లకి ఇవ్వడం కోసం. అంటే ఆ కత్తి తమకి ఇష్టమైన వాళ్లకి ఇచ్చి వాళ్ల ద్వారా నామినేట్ చేయించవచ్చు.

మీ గురించి మీరు లక్ష అనుకోండి: ఇక ముందుగా ప్రియ.. రావడం రావడమే సంజనాకి పోటు పొడిచింది. పొడవడమే కాదు.. కంట్రోల్ తప్పిన ఆమె నోటికి తాళం వేసే ప్రయత్నంచేసింది. "మాట మాట్లాడితే చాలు బాడీ షేమింగ్ చేస్తున్నారు. రోడ్ రోలర్‌లాగా అని దివ్యని మాటలు అనేసి.. చాలా ఫన్నీగా తీసుకుంటున్నారు. అది ఫన్నీ కాదు. చాలా హర్టింగ్" అని చెప్పింది ప్రియ. దాంతో సంజనా.. "నేను కూడా బక్కగా ఏం లేను కదా" అని అన్నది. "మీ గురించి మీరు లక్ష అనుకోండి. కానీ ఎదుటి వాళ్లని అనకూడదు కదా. మాటిమాటికీ చిన్నా పెద్దా అంటూ క్లాస్‌ల గురించి మాట్లాడుతున్నారు? మీ దృష్టిలో క్లాస్ అంటే ఏంటి?" అని ప్రశ్నించింది ప్రియ. "మేం బయట ఆర్టిస్ట్‌లం కదా అదే చెప్పాను" అని సంజన అనడంతో.. "ఈ హౌజ్​లో క్లాస్ గురించి మాట్లాడటం తప్పు" అని ఖండించింది ప్రియ.

నమ్మించి వెన్నుపోటు పొడిచావ్​: ఆ తరువాత కల్యాణ్ పడాలకి ఇచ్చిపడేశాడు మర్యాద మనీష్. "నీకు వీడియోలు చూపించారు. వేరే వాళ్లకి వీడియోలు చూపించలేదని అనుకుంటున్నావా? ఆ వీడియోలలో నువ్వు తప్పని అంటున్నారు. ఇమ్మానుయేల్ నిన్ను నమ్మి నామినేట్ చేయడానికి టికెట్ ఇచ్చాడు. కానీ నువ్వు సంజనాని నామినేట్ చేశావ్. నమ్మించి వెన్నుపోటు పొడిచావ్" అని అన్నాడు. దానికి కల్యాణ్.. "నేను మాట్లాడినప్పుడు కెమెరాలు లేవా, ఇమ్మాన్యుయేల్​కు తెలియదా" అంటూ క్లారిటీ ఇవ్వబోయేలోపు.. "‘నువ్వు నామినేషన్ చేస్తాననే నా దగ్గర నుంచి పవర్ తీసుకున్నావ్. నామినేషన్​ రోజు మాత్రమే ఈ విషయం చెప్పావు" అని కుండబద్దలు కొట్టాడు ఇమ్మూ.

ఇక ఇమ్మానుయేల్.. తనూజని నామినేట్ చేశాడు. "బొమ్మల గేమ్‌లో తనూజ నా కోసమే ఆడింది. కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి రాముకి ఓటేసింది. నాకు మైండ్ పోయింది" అని ఇమ్మానుయేల్ తన నామినేషన్ పాయింట్‌ని చెప్పాడు. దాంతో తనూజ.. "అతను తల ఊపాడు. అందుకే నేను అతన్ని నామినేట్ చేశాను. కానీ ఇప్పుడు ఈ పర్సన్ రెండు నాలుకలతో మాట్లాడుతున్నాడు" అని డిఫెండ్​ చేసుకుంది. ఇలా ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. ఇక కల్యాణ్.. రాము రోథోడ్‌ని నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. చివర్లో మర్యాద మనీష్.. "ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడుతున్నారు"అంటూ తనూజపై సెటైర్​ వేశాడు. ఇలా ఫస్ట్​ ప్రోమో ఎండ్​ అయ్యింది.

తాజాగా దమ్ము శ్రీజ, ఫ్లోరా సైని చేసిన నామినేషన్స్ ప్రోమో వచ్చింది. ఫ్లోరా ముందుగా రీతూకి కత్తి దింపి నామినేట్ చేసింది. "ఒక ఫేక్ లవ్ స్టోరీ మీరు క్రియేట్ చేశారు. ఎందుకంటే స్టార్టింగ్ మీరు కల్యాణ్ దగ్గరికెళ్లారు. తర్వాత డీమాన్ వెంట వెళ్లారు. చాలా ఫేక్‌గా కనిపిస్తుంది" అని ముఖం మీదే చెప్పింది ఫ్లోరా. "మీరు అలా ఫీలయ్యారు" అని రీతూ అనగానే ఫ్లోరా మరో పాయింట్ లాగింది. "ఆయేషా హౌజ్​ నుంచి వెళ్తుంటే మీరు నవ్వుతూ కనిపించారు. తనూజ కోసం కల్యాణ్ ఏడుస్తుంటే మీరు అక్కడే ఉండి నవ్వుతున్నారు" అని ఫ్లోరా చెప్పింది. దీనికి "ఒక మనిషి ఫీలవుతున్నాడంటే నేను ఓహో హాహా అంటూ నవ్వే క్వాలిటీస్ నాలో లేవు" అంటూ రీతూ ఫైర్ అయింది.

నెక్స్ట్ తన దగ్గరున్న రెండో కత్తిని సుమన్ శెట్టికి ఇచ్చింది ఫ్లోరా. దీంతో సుమన్.. సంజనని నామినేట్ చేశాడు. "సారీ చెప్పా కదన్నా" అని సంజన గారాలు పోయింది. దీంతో "లాగిపెట్టి లెంపకాయ కొట్టి సారీ సిస్టర్ అంటే మీరు ఊరుకుంటారా. ఎవడు తొక్కలో కెప్టెన్ సిస్టర్ ఇక్కడ. మీరు కెప్టెన్ అయ్యారు. మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం మేమందరం. కెప్టెన్ సంజన గారు అంటూ సెల్యూట్ కొట్టాం" అంటూ సుమన్ ఓ రేంజ్​లో ఫైర్ అయ్యాడు.

కల్యాణ్​కు కత్తి దింపిన శ్రీజ: ఇక శ్రీజ డైరెక్ట్‌గా కల్యాణ్​ని నామినేట్ చేస్తూ "నువ్వు అమ్మాయిల పిచ్చోడివా" అంటూ సూటిగా. దీంతో "కాదు" అంటూ కల్యాణ్ అన్నాడు. "మరి ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయావ్. లైట్ ఎందుకు తీసుకున్నావ్ కల్యాణ్​" అని శ్రీజ అడిగింది. దీనికి "సారీ నేను ఆ మాట అనడం తప్పే. నేను ఇంకెప్పుడు అలా అనను అని చెప్పింది" అంటూ కల్యాణ్ అన్నాడు. "నీ క్యారెక్టర్‌పైన దాడి చేసినా కూడా తను నాకు సారీ చెప్పేసింది కదా అని ఊరుకుంటావా. సరే తనూజని నువ్వెందుకు నామినేట్ చేయలేదు" అని క్వశ్చన్ చేసింది శ్రీజ. "సేమ్ రీజన్స్‌తో కాపీ క్యాట్‌లాగ నాకు నామినేషన్ వేసే ఉద్దేశం లేదు" అని కల్యాణ్​ అన్నాడు. "ఏదో నెగెటివ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఆరోజు నువ్వు తనూజని నామినేట్ చేయలేదు" అంటూ శ్రీజ ఫైర్ అయింది. ఇలా ప్రస్తుతానికి రిలీజ్​ చేసిన రెండు ప్రోమోలు అయితే హాట్​హాట్​గానే ఉన్నాయి.

Bigg Boss 9 Telugu: ఏడో వారంలో రమ్య ఎలిమినేట్​ - ఆ ఐదుగురి ఫొటోలు చెత్తబుట్టలో! - రీతూపై బిగ్​బాంబ్​!

Bigg Boss 9 Telugu : బాసూ.. జాగ్రత్త పడుతున్నావా ?