ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu: నామినేషన్స్​లో "ఏడుగురు" - డేంజర్​ జోన్​లో 'సాయి - రాము'! - బయటికి వెళ్లేదెవరు!

- ఓటింగ్​లో దూసుకుపోతున్న తనూజ - ఎలిమినేషన్​ అయ్యేది ఎవరో తెలుసా?

Bigg Boss 9 Telugu Elimination Updates
Bigg Boss 9 Telugu Elimination Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 7, 2025 at 4:03 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Elimination Updates: తెలుగులో బిగ్​బాస్​ సీజన్​ 9 మొదలై రెండు నెలలు పూర్తి అయ్యింది. సెప్టెంబర్​ 7న గ్రాండ్ లాంచ్​ కాగా.. ట్విస్ట్​లు, టర్న్​లతో రసవత్తరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా నామినేషన్స్​ వార్​ వేరే లెవల్​. ఫ్రెండ్స్​గా ఉన్నవారే నామినేషన్స్​ వచ్చేసరికి ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. అన్ని వారాలు ఒక లెక్క.. ఈ వారం మరో లెక్క అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే షో మొదలైనప్పటి నుంచి నాన్న - కూతురు అంటూ రిలేషన్​లో ఉన్న భరణి - తనూజ నామినేషన్స్​లో వాదులాడుకున్నారు. ఇక ఇమ్మాన్యుయేల్​ - తనూజ మధ్య కూడా సీరియస్​ డిస్కషన్​ నడిచింది. ఈ క్రమంలోనే నామినేషన్స్​లో ఏడుగురు ఉన్నారు. మరి ఓటింగ్ ఎలా ఉంది? సేఫ్​లో ఉన్నది ఎవరు? ఎలిమినేట్​ అయ్యేది ఎవరో ఇప్పుడు చూద్దాం.

తొమ్మిదో వారం ఎలిమినేషన్​కు సమయం దగ్గరపడింది. షో మొదలైనప్పటి నుంచి ఇప్పటికే శ్రష్ఠి వర్మ, మర్యాద మనీష్​, ప్రియా శెట్టి, మాస్క్​ మ్యాన్​ హరీష్​, ఫ్లోరా సైనీ, దమ్ము శ్రీజ, రమ్య మోక్ష, మాధురి ఇలా మొత్తం 8 మంది ఎలిమినేట్​ అయ్యారు. ఆరో వారంలో ఎలిమినేట్​ అయిన భరణి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరొకరు హౌజ్​ నుంచి బయటికి వెళ్లనున్నారు. నామినేషన్స్​లో ఉన్న తనూజ, భరణి, సుమన్​ శెట్టి, రామూ, సంజనా, సాయి, కల్యాణ్​లలో ఒకరు ఇంటి ముఖం పట్టనున్నారు. మరి వీరి ఓటింగ్​ ఎలా ఉందంటే..

టాప్​లో మరోసారి ఆమె: తనూజ ఎప్పుడు నామినేషన్స్​లోకి వచ్చినా అనధికారిక లెక్కల ప్రకారం టాప్​లో ఉంటూనే ఉంది. తాజాగా ఈ వారం కూడా ఈ అమ్మడు మొదటి స్థానంలో ఉన్నట్టు సమాచారం. ఇక రెండో స్థానంలో కల్యాణ్​ ఉన్నాడు. సోమవారం నుంచి నిన్నటి వరకు సోషల్​ మీడియా ప్రకారం మొదటి రెండు స్థానాల్లో ఓటింగ్​లో ఎటువంటి మార్పు లేదు. కేవలం లాస్ట్​ 5 ప్లేస్​లలో మాత్రమే ఓటింగ్​ తగ్గడం, పెరగడం జరిగింది. దీంతో నిన్నటి వరకు చూసుకుంటే తనూజ, కల్యాణ్​ తర్వాత స్థానాల్లో సుమన్​ శెట్టి, సంజనా, భరణి, రాము, సాయి శ్రీనివాస్​ ఉన్నారు.

డేంజర్​ జోన్​లో రాము, సాయి: అనధికారిక లెక్కల ప్రకారం ఓటింగ్​లో రాము, సాయి లీస్ట్​లో ఉన్నారు. వీరిలో సాయి ఎలిమినేషన్​కే అవకాశం ఎక్కువ ఉంది. అయితే సాయితో పోల్చుకుంటే ఈ వారం గేమ్​ల పరంగా రాము పెద్దగా ఎఫెక్ట్​ చూపించింది లేదు. పైపెచ్చు హోమ్​సిక్​తో బాధపడుతున్నట్లు చెబుతున్నాడు. అయితే ఓటింగ్​తో సంబంధం లేకుండా దీన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం రాము ఎలిమినేట్​ అయ్యి, సాయి సేవ్​ అయ్యే అవకాశం ఉంటుంది.

తనూజ చేతిలో అస్త్రం: ఇక వీళ్లిద్దరిలో ఒకరి ఎలిమినేషన్​ను డిసైడ్​ చేసే అధికారం తనూజకు ఉంది. ఎందుకంటే ఆమె గోల్డెన్​ బజర్​ను గెలుచుకుంది. దానికి ఓ సేవింగ్​ పవర్​ ఉంది. కాబట్టి వీళ్లిద్దరిలో ఎవరినైనా సేవ్​ చేయాలనుకుంటే అది వాడే అవకాశం ఉంటుంది. లేదంటే గత వారం మాదిరి ఓటింగ్​ ప్రకారమే ఎలిమినేట్​ కావాలని కోరుకుంటే ఆ పవర్​ అలాగే ఉంటుంది. లేదు ఈ వారం తనూజ పవర్​ను ఉపయోగించేలా చేయాలని బిగ్​బాస్​ ప్లాన్​ వేస్తే మాత్రం లీస్ట్​లో భరణి - రామును ఉంచే అవకాశం ఉంటుంది. వీళ్లిద్దరూ తనూజకు క్లోజే. భరణిని సేవ్​ చేసేందుకు తనూజ పవర్​ ఉపయోగిస్తే రాము ఎలిమినేషన్​ ఉంటుంది. ఇదేమి లేకుండా ఓటింగ్​ ప్రకారం లీస్ట్​లో సాయి - రాము ఉంటే తనూజ పవర్​ను ఉపయోగించకపోవచ్చు. ఎందుకంటే సాయితో పోల్చుకుంటే రాము కాస్త క్లోజ్​. కానీ ​అప్పటికే లీస్ట్​లో సాయి ఉంటే ఆమె దానికి వాడకపోవచ్చు. మరి ఎవరు ఎలిమినేట్​ అవుతారో తెలియాలంటే కాస్త వెయిట్​ చేయాల్సిందే.

Bigg Boss 9 Telugu Day 60 Episode: కెప్టెన్సీ రేసులో "ఆరుగురు" - సీక్రెట్​ టాస్క్​లో ఫెయిల్​ అయిన రీతూ!

Bigg Boss 9 Telugu Day 59 Episode: భయపడి గెలిచిన తనూజ - ఘోస్ట్​ రూమ్​లో రీతూ గడబిడ!