ETV Bharat / entertainment

Bigg Boss 9 Day 67 : బీబీ రాజ్యంపై ప్రజల తిరుగుబాటు - కొత్త రాణిగా 'తనూజ'!

- కెప్టెన్సీ కోసం కింగ్​ అండ్ క్వీన్ థీమ్​తో టాస్క్​లు - 'రేస్ ఆఫ్ ఫ్లోర్'లో గెలిచి​న "మహారాణి"

Bigg Boss 9 Day 67 Review
Bigg Boss 9 Day 67 Review (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 14, 2025 at 11:03 AM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Day 67 Review : బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం 10 వారానికి సంబంధించి కెప్టెన్సీ, ఇమ్యూనిటీ కోసం టాస్కులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే హౌస్​లో కింగ్​ అండ్ క్వీన్ థీమ్​ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, డే 67 గురువారం ఎపిసోడ్​లో వారికి లగ్జరీ లైఫ్ ఇచ్చేందుకు చెఫ్స్​ని లోపలికి పంపాడు బిగ్​బాస్. చెఫ్స్​ రకరకాల రెసిపీలు చేసి వడ్డించారు. అలాగే, ఇవాళ్టి ఎపిసోడ్​లో జరిగిన ఓ టాస్క్​లో తనూజ విన్ అయి హౌస్​కి రాణిగా మారింది. ఇలా డే 67లో జరిగిన పూర్తి విశేషాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

ఇవాళ్టి ఎపిసోడ్​లో బీబీ రాజ్యంలో కింగ్స్ అండ్ క్వీన్​కు వివిధ రకాల వంటకాలు వడ్డించేందుకు చెఫ్స్ వచ్చారు. కోడికూర చిల్లిగారి అనే సాంగ్ వేయగా.. డ్యాన్స్ వేసుకుంటూ మాస్టర్ చెఫ్ సంజయ్ తుమ్మ లోపలికి ఎంట్రీ ఇచ్చారు. దాంతో హౌస్​మేట్స్ అందరూ ఆయనతో కలిసి డ్యాన్స్ వేశారు. రాజ్యంలో రాజు, రాణిలకు ఎలాగైతే వడ్డిస్తారో.. మీకూ అలాగే వడ్డించబోతున్నాను అని సంజయ్ అనగానే.. హమ్మయ్య అని రీతూ, నిఖిల్, కల్యాణ్ చేతులెత్తి దండం పెట్టేశారు . ఆ తర్వాత కాసేపు ఇంట్లో ఉన్న వాళ్లందరి గురించీ మాట్లాడారు చెఫ్ సంజయ్.

అనంతరం హౌస్​లోకి తన అసిస్టెంట్ ప్రణవ్​ని రప్పించి వివిధ రకాల వంటల్ని చేయించారు. కిచెన్​లో రాజు రాణి కోసం ప్రణవ్ నాన్​వెజ్ రెసిపీలు ప్రిపేర్ చేస్తుంటే.. ప్రజలలో ఒకరైన ఇమ్మూ అక్కడికి వెళ్లి "అన్నా అన్నా.. కొన్ని పీసెస్ టిష్యూ పేపర్​లో కిందపెట్టు అన్నా.. తర్వాత తింటానని జాలిగా అడిగాడు". అప్పుడు దానికి ప్రణవ్ "నో" అనేశాడు. కనీసం టేస్ట్ అయినా చేస్తానని ఇమ్మూ అంటే.. నేను బాగానే చేస్తానని చెప్పి అతడిని అక్కడి నుంచి పంపేశాడు ప్రణవ్. దాంతో ఇమ్మాన్యుయేల్.. ఏంటి సార్.. ఇతను బిగ్ బాస్ కంటే ఎక్కువగా ఉన్నాడూ.. కనీసం స్మెల్ కూడా చూడనివ్వట్లేదని పంచ్​లు వేశాడు ఇమ్మూ. నెక్ట్స్ ప్రణవ్ చేసి రెసిపీలను రాజు, రాణిలకు వడ్డించారు. వాటిని కల్యాణ్, రీతూ, నిఖిల్​ కమ్మగా తిన్నారు.

చేప ముక్కలను దొంగిలించిన ఇమ్మూ :

ఇంతలో తనూజ డైరెక్షన్‌లో సీక్రెట్‌‌గా కొన్ని ఫిష్ ముక్కల్ని దాచేశాడు ఇమ్మాన్యుయేల్. నెక్ట్స్ రాణి అయిన రీతూ.. ఎవరూ చూడకుండా ఇమ్మూకి ఒక పీస్ ఇస్తుంది. అప్పుడు ఇమ్మాన్యుయేల్ దాన్ని బాత్​రూంలోకి పట్టుకుని వెళ్లి తిన్నాడు. తర్వాత దివ్య అక్కడకు వచ్చి.. "హౌస్​లో దర్జాగా కూర్చుని తినాల్సిన దాన్ని.. బాత్ రూంలో సీక్రెట్​గా తినాల్సి వస్తుంది" అంటూ ఏడ్చింది. అనంతరం లోపలికి వెళ్లిన సంజనా.. తనకి అలవాటైన పద్దతిలో ఏదిపడితే అది నొక్కేసింది. అది గమనించిన తనూజ.. తనేదో సుద్ద పూస అన్నట్టుగా చెఫ్​కి సంజన మీద దొంగతనం చేస్తుందని కంప్లైంట్ చేసింది.

తనూజకు సంజయ్ హగ్ :

నెక్ట్స్ మీరు పర్మిషన్ ఇస్తే.. కమాండర్స్​ కు కూడా ఫుడ్ వడిస్తాం అని సంజన్ అడగ్గా దానికి రాజు, రాణిలు ఓకే అంటారు. దాంతో కమాండర్స్ కూడా విందు భోజనం ఆరగించారు. ఆ తర్వాత ప్రజలుగా ఉన్న ఇమ్మూ, సుమన్, గౌరవ్, భరణికి స్విమ్మింగ్ పూల్ దగ్గర కింద కూర్చోబెట్టి శాఖాహార భోజనం వడ్డించారు. ఇక చివర్లో చెఫ్ సంజయ్ తనూజకి ఓ హగ్ ఇచ్చి.. బిగ్ బాస్ వేసిన సాంగ్‌కి డాన్స్ వేసి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు.

Bigg Boss Trophy బిగ్​బాస్​ ట్రోఫీ కోసం రూ.16 లక్షలు ఇచ్చిన కంటెస్టెంట్​!

తిరుగుబాటు :

రాజ్యంలో రాజులు, రాణి, కమాండర్స్.. ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారని ఇమ్మాన్యుయేల్​తో భరణి అన్నాడు. దాంతో ఇమ్మూ.. ఈరోజు మనం వారు చెప్పిన ఏ పనీ చేయొద్దు, తిరుగుబాటు చేద్దాం అని సలహా ఇచ్చాడు. దాంతో ప్రజలుగా భరణి, సుమన్, ఇమ్మూ, గౌరవ్‌ మేం పని చేయం అంటూ తిరుగుబావుటా ఎగురవేశారు. అప్పుడు తనూజ.. క్వీన్, కింగ్స్ దగ్గరకు వెళ్లి.. "వాళ్లకి ఎవరో చెప్పి ఇలా చేయిస్తున్నారు.. వాళ్లకి తిండి పెట్టడం ఆపేద్దాం.. ఫుడ్‌తో పాటు వాటర్ కూడా ఆపేస్తే.. మన దారిలోకి వస్తారు" అని చెప్పింది. అయితే, ఆమె మాటల్ని పట్టించుకోకుండా.. ప్రజలకు న్యాయం చేద్దాం వాళ్లకీ మనతో పాటు తిండి, నీళ్లు ఇద్దాం అని డిసైడ్ అయ్యి.. నీళ్లు పట్టుకుని వచ్చారు. మీరు హ్యాపీగా ఉంటే మేం సంతోషంగా ఉంటాం అంటూ రాజీకి వచ్చారు రాజులు, రాణి. అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం తగ్గకుండా నినాదాలతో హౌస్​ను హోరెత్తించారు. ముందు మాపై కమాండర్స్ పెత్తనాన్ని తొలగించాలని ప్రజలు డిమాండ్ చేయగా.. దానికి సమ్మతించారు.

బిగ్​ బాస్ ట్విస్ట్ :

ఇంతలో బిగ్ బాస్ కల్పించుకుని.. "రాజు, రాణి.. మీరు ఈవారం ఎన్నో ప్రత్యేక సదుపాయాలను అనుభవించడంతోపాటు ఇమ్యునిటీ దక్కించుకునే ఛాన్స్ కోసం పోరాడారు. ఇప్పుడు మీ స్థానాన్ని కాపాడుకునే సమయం వచ్చింది. చివరికి వరకూ మీ స్థానాన్ని కాపాడుకుంటే కెప్టెన్సీ కంటెడర్స్ అవుతారు. తమలో తాము చర్చించుకుని రాజులు, రాణి ఒక నిర్ణయానికి రమ్మని చెప్పాడు". అప్పుడు కల్యాణ్, నిఖిల్, రీతూ చర్చించుకుని చివరికి కల్యాణ్ పేరు చెప్పారు. ఆ తర్వాత బిగ్ బాస్.. ప్రజలందరూ మాట్లాడుకుని కమాండర్స్‌‌లో ఏ ఇద్దరు రాజు లేదా రాణిగా మారి ఇమ్యూనిటీ అందుకోవడానికి చేరువ కావాలని మీరు అనుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేయాలని చెప్పాడు. అప్పుడు ప్రజలంతా చర్చించి.. ఫస్ట్ తనూజ, సెకండ్ దివ్య అని చెప్పారు.

రాణిగా తనూజ :

అనంతరం బిగ్ బాస్ "రేస్ ఆఫ్ ఫ్లోర్"అనే ఒక టాస్క్ పెట్టాడు. ఇందులో రాజ్యం నుంచి తన రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి కల్యాణ్.. కమాండర్ నుంచి రాణిగా ఛాన్స్ పొందడానికి తనూజ పోటీ పడ్డారు. ఈ గేమ్​కి సంచాలక్​గా దివ్య ఉంది. చివరకు ఈ టాస్క్​లో తనూజ విన్ అయినట్లు ప్రకటించింది దివ్య. రాజుగా ఉన్న కల్యాణ్​ను ఓడించి.. హౌస్​కు కొత్త రాణిగా నిలిచినందుకు తనూజను బిగ్ బాస్ అభినందించారు.

Bigg Boss 9 Telugu Day 64 : కంటెస్టెంట్స్​కు బిగ్​బాస్​ షాక్​ - అతడు మినహా 10 మంది నామినేషన్స్​లో! - దివ్యపై భరణి సీరియస్​!

Bigg Boss 9 Telugu Winner : విన్నర్ ఆ ఇద్దరిలోనే​​! - ఓటు వేసి మరీ తేల్చేశారుగా!