Telangana Panchayat Elections Results2025

ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu Day 61 Episode: ఇమ్మాన్యుయేల్​ "మూడోసారి" కెప్టెన్​ - దివ్యపై భరణి ఫైర్​ - వేరే లెవల్​గా కెప్టెన్సీ టాస్క్​!

- రసవత్తరంగా కెప్టెన్సీ టాస్క్​ - తనూజకు దివ్య వెన్నుపోటు!

Bigg Boss 9 Telugu Day 61 Episode
Bigg Boss 9 Telugu Day 61 Episode (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 8, 2025 at 10:27 AM IST

7 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Day 61 Episode: బిగ్​బాస్​ సీజన్​ 9లో హిస్టరీ క్రియేట్​ అయ్యింది. ఈ సీజన్​లో ఏకంగా మూడు సార్లు ఇమ్మాన్యుయేల్​ కెప్టెన్​ అయ్యాడు. మొదటి సారి కెప్టెన్​ అయినా.. సంజనా కోసం త్యాగం చేయడంతో ఆ వీక్​ డీమాన్​ కెప్టెన్​ అయ్యాడు. ఆ తర్వాత ఏడో వారంలో, ఇప్పుడు తొమ్మిదో వారంలో మరోసారి కెప్టెన్​ అయ్యాడు. అయితే ఇమ్మాన్యుయేల్​ కెప్టెన్​ కావడానికి వెనుక పెద్ద తతంగమే నడిచింది. "నీకు సపోర్ట్​ చేస్తా" అంటూ తనూజకు చెప్పిన దివ్య.. చివరి నిమిషంలో ప్లేట్​ తిప్పేసింది. ఇక మరోవైపు తనలోని విలన్​ను బయటికి తీశాడు భరణి. మరి, నిన్నటి ఎపిసోడ్​లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ఉదయాన్నే "వాళ్ల ముగ్గురూ కెప్టెన్ అవ్వలేదు. కాబట్టి మనల్ని పీకాలని ట్రై చేస్తారు. మనం కలిసి ఆడాలి" అంటూ ఇమ్మాన్యుయేల్, దివ్య, సుమన్ శెట్టి స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నారు. అంతలోనే తిండి విషయంలో నిఖిల్, గౌరవ్​కి గొడవ మొదలైంది. "ఎప్పుడూ ఏదో ఒక చోట టైంపాస్ చేస్తావ్" అని మండిపడ్డాడు నిఖిల్. కిచెన్​లో సుమన్ శెట్టి ఫన్నీగా తనూజాతో పెళ్లికి సిద్ధం అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్సీ రేసులో ఉన్న వారికి "వే టు కెప్టెన్సీ" అనే టాస్క్​ నిర్వహించారు. "గార్డెన్ ఏరియాలో రెండు ట్రైన్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ లైన్, రెండు రెడ్ లైన్. ట్రైన్స్ ముందు ఉన్న లైన్ స్టేషన్ బౌండరీని సూచిస్తుంది. నాన్ కంటెండర్స్ అందరూ ఆ బౌండరీ వెనుక నిలబడి, బజర్ రాగానే ట్రైన్ డ్రైవర్ సీట్లో కూర్చోవాలి. కంటెండర్స్ మాత్రం తమకు కెప్టెన్ అవ్వడానికి సపోర్ట్ చేసే వ్యక్తులను సపోర్ట్ చేయాలి. మరో బజర్ రాగానే కంటెండర్స్ తనకు నచ్చిన ట్రైన్​లో ఎక్కాలి. అయితే కదిలే ట్రైన్ డ్రైవర్ కెప్టెన్సీ రేసు నుంచి కంటెండర్​ను తొలగించాలి" అని బిగ్​బాస్​ అనౌన్స్​ చేశాడు.

ఫస్ట్​గా భరణి, దివ్య, సుమన్​ ఎలిమినేట్​: మొదటి రౌండ్​లో రాము, నిఖిల్ కూర్చోగా.. రాము ట్రైన్ కదిలింది. భరణిని టాస్క్ నుంచి తీసేశాడు రాము. సెకండ్ రౌండ్​లో సాయి ట్రైన్ కదిలింది. అతను ముందుగా దివ్య పేరు చెప్పి, తరువాత డెసిషన్ మార్చుకుని రీతూ పేరు చెప్పాడు. "నువ్వు నన్ను రెబల్​గా తీసేశావు. నిన్ను తీస్తున్నా" అని సాయి అన్నాడు. "నువ్వు తీయను అని చెప్పి వెన్నుపోటు పొడుస్తున్నావా? నువ్వు చెప్పినందుకే దివ్యను నమ్మించి ట్రైన్ ఎక్కించాను. ప్రతి వారం దివ్యకు సపోర్ట్ చేయడానికే వచ్చావా?" అని ఫైర్ అయ్యింది రీతూ. దీంతో చివరగా దివ్యను సాయి ఈ టాస్క్ నుంచి తీసేసాడు. ఆ తర్వాత "వాళ్లకు సజెషన్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు. నాకెందుకు చేయట్లేదు" అంటూ భరణిపై ఫైర్ అయ్యింది దివ్య. ఆ తర్వాతి రౌండ్​లో సుమన్ శెట్టిని తీసేశాడు నిఖిల్​. ఇక్కడి వరకు కాస్త మంచిగానే ఉన్న టాస్క్​తో రూల్స్​ మార్చి గేమ్​ మార్చేశాడు బిగ్​బాస్​.

తనూజకు వెన్నుపోటు: "సాయి, రాము, నిఖిల్ డ్రైవర్స్ అయ్యారు. వాళ్లు మినహా రెడ్ ట్రైన్​లో ఎక్కడానికి మిగతా వాళ్లు ట్రై చేయొచ్చు" అని బిగ్​బాస్​ చెప్పాడు. అయితే ఈ టాస్క్​లో తనూజాకు దెబ్బ తగిలింది. దీంతో గేమ్​ను పాజ్ చేసి మళ్లీ స్టార్ట్ చేశారు. రీతూ, కల్యాణ్ చైర్ కోసం కొట్టుకోగా, మధ్యలో వచ్చి దివ్య కూర్చుంది. ఇక "మీ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అయినా నాకు ఫర్లేదు. కానీ ఇమ్మానుయేల్‌కి నా సపోర్ట్ అని నేను క్లియర్‌గా చెప్పాను. నన్ను కెప్టెన్ చేయడానికి లాస్ట్ వీక్ ఇమ్మాన్యుయేల్ కష్టపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఇమ్మూని లాస్ట్ వరకూ తీసుకురావడానికి తనూజని తీసేస్తున్నాను" అని దివ్య షాకిచ్చింది.

పర్సనల్​ రీజన్​ వల్లే!: "తనని కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావా" అని తనూజ అడిగింది. "అవును అప్పుడే తనకి ఫైటింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అందరూ హౌజ్​లో నీకే ఓటేస్తారు. ఇప్పుడు కనీసం తనకి మూడు నాలుగు ఓట్లు అయినా వస్తాయి" అని దివ్య చెప్పింది. ఈ మాటకి తనూజ రగిలిపోయింది. "నీకు కొంచెమైనా అనిపిస్తుందా పర్సనల్ రీజన్స్ అన్నీ తీసుకొచ్చి కెప్టెన్సీ టాస్కులో తీసేస్తావా. ఫైట్ చేసుకొని వచ్చాం దివ్య. పర్సనల్ రీజన్ ఏంటంటే నీది, భరణి గారిది. దాని వల్ల తీసేస్తున్నానని చెప్పు. నీకు పర్సనల్ ఏమున్నా పర్సనల్‌గా పెట్టుకో గేమ్ వరకూ తీసుకురాకు" అంటూ తనూజ ఫైర్ అయ్యింది. ఇదేంటి మీరు మీరూ కొట్టుకొని మధ్యలోకి నన్ను లాగుతారు అన్నట్లుగా భరణి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.

"నువ్వు స్టోరీలు అల్లుకుంటూ ఉండు తనూజ" అంటూ దివ్య కౌంటర్ ఇచ్చింది. "నువ్వు తనూజని ఎలిమినేట్ చేయవని అన్నందుకు నీకు అందరూ ఆ ఛైర్ ఇచ్చారు" అని తనూజ చెప్పింది. "ఓన్లీ కల్యాణ్ అన్నాడు. నేను నిన్ను తీయనని అన్నాను. కానీ ఇమ్మానుయేల్‌ని చూసిన తర్వాత నాకు అనిపించింది. ఇమ్మూ ఈ రేసులో ఉండాలంటే తనూజనే తీసేయాలనిపించింది" అంటూ చెప్పింది దివ్య. "ఇక్కడ ఇమ్మాన్యుయేల్ కాదు రీతూ కాదు.. ఓన్లీ పర్సనల్ రీజన్ వల్లే తను తీసేసింది. పర్సనల్ రీజన్ వల్లే నామినేషన్ నుంచి ఇక్కడి వరకూ లాక్కొని వచ్చి నన్ను తీసేసింది. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర కూడా చెప్పింది. రీతూ నువ్వు ఉంటే నేను నిన్ను తీయనని చెప్పింది. కానీ ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నా కూడా ఆమె నన్ను తీస్తుందంటే అది పర్సనల్ రీజన్‌ వల్లే. నాకు నీతో మాట్లాడాలని లేదు. నీ పర్సనల్స్ హౌజ్​ బయట పెట్టుకో లోపల కాదు. ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు" అంటూ తనూజ ఫైర్​ అయ్యి లోపలికి వెళ్లిపోయింది.

భరణిపై అరిచిన దివ్య: ఇక తనూజని ఓదార్చేందుకు లోపలికి వెళ్తున్న భరణిపై దివ్య ఫైర్ అయింది. "విన్నారా భరణి గారు.. హ్యాపీ ఆ ఇప్పుడు" అని దివ్య అంది. "దేనికి" అని భరణి అడిగితే "ఎలా మాట్లాడుతున్నారో వినలేదా. నా గేమ్ నేను ఆడుకుంటుంటే కూడా ఎవరు ఇన్వాల్వ్ చేస్తున్నారో చూస్తున్నారా. ఎవరు పర్సనల్ రీజన్స్ తెస్తున్నారో చూస్తున్నారా మీరు" అని దివ్య అందరిముందు గట్టిగా అరిచింది.

నాతో మీరు మాట్లాడొద్దు: ఇక ఏడుస్తున్న తనూజని రీతూ ఓదార్చింది. "ఇద్దరి మధ్యలో నేను వెళ్లట్లేదురా.. మధ్యాహ్నం కూడా భరణి సార్ మీద ఆమె అలిగి కూర్చొంటే నేనే వెళ్లమన్నాను.. వెళ్లి మాట్లాడండి ఆమెతో అని చెప్పాను. నేను ఈ వీక్ అవ్వాలని చాలా కష్టపడ్డా. గేమ్‌ని గేమ్‌లా చూడకుండా.. ఆమె ఒక్క గేమ్ ఆడలేదు.. గెలిచిందంతా భరణి సార్ సపోర్ట్ వల్లే" అంటూ తనూజ దుప్పటి కప్పుకొని ఏడుస్తూ చెప్పింది. ఇంతలో భరణి వచ్చి ఓదార్చబోతే "నేను ఎప్పుడైనా ఆమె గురించి మీకు బ్యాడ్‌గా చెప్పానా. ఎప్పుడైనా బ్యాడ్ కోరుకున్నానా" అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. "నేను మాట్లాడనులే నీతోటి ఇక" అని భరణి అన్నాడు. "వద్దు నాతో మీరు ఎప్పుడూ మాట్లాడొద్దు ఇంక" అంటూ తనూజ వెక్కివెక్కి ఏడ్చింది.

నా వాళ్లు ఎవరు: కాసేపటి తర్వాత భరణితో మళ్లీ ఇదే టాపిక్ డిస్కస్ చేసింది తనూజ. దీంతో "ఆమె (దివ్య) నాకు సపోర్ట్ చేయట్లేదు ఇమ్మూకి సపోర్ట్ చేస్తుంది. కొంచెం ఆలోచించు" అని భరణి అన్నాడు. "ఓకే తను ఇమ్మూకే సపోర్ట్ చేస్తుంటే నన్ను తీసేటప్పుడు మీ వైపు అంత సేపు చూడాల్సిన అవసరం ఏంటి. సరే అందరూ నాకు సపోర్ట్ అందరూ సపోర్ట్ అని అన్నారు కదా. అందరి సపోర్ట్ ఉంటే లాస్ట్ వీక్, 5వ వారం నేను ఎందుకు కెప్టెన్ అవ్వలేదు. అసలు ఎక్కడున్నారు నా వాళ్లు" అంటూ తనూజ అడిగింది. దీనికి ఏం చెప్పాలో తెలీక భరణి సైలెంట్‌గా ఉండిపోయాడు.

ఏం మాట్లాడతావు చెప్పు: ఇక భరణి ఒంటరిగా బెడ్డు మీద ఉన్నప్పుడు దివ్య అక్కడికెళ్లింది. "మాట్లాడొచ్చా ఒక్క నిమిషం" అని దివ్య అడగ్గానే "ఏం మాట్లాడతావ్ చెప్పు" అంటూ భరణి తనలోని విలన్​ను బయటికి తీశాడు. "ఎందుకంత కోపంగా చూస్తున్నారు" అని దివ్య అడిగితే "ఏం మాట్లాడతావ్ చెప్పు" అని మళ్లీ అదే టోన్‌లో అన్నాడు భరణి. దీంతో "అరిచినందుకు సారీ చెబుదామని వచ్చాను" అని దివ్య అంది. "ఇది ఫస్ట్ టైమా నువ్వు అరిచింది. నువ్వు ఫస్ట్ టైమా అరిచింది. నువ్వు పాయింట్ రెయిజ్ చేస్తావ్ తనేదో మాట్లాడతది. నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి దాంట్లో. పేరు వచ్చినప్పుడు నేను తర్వాత తనతో మాట్లాడతాను అక్కడ సంబంధం లేదు కదా" అని భరణి అన్నాడు. దీంతో "సారీ" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది దివ్య. భరణితో జరిగిన డిస్కషన్​ గురించి కల్యాణ్​, ఇమ్మాన్యుయేల్​కు చెప్పింది.

కెప్టెన్​గా ఇమ్మూ: మరోవైపు కల్యాణ్ దగ్గర దివ్య గేమ్ గురించి భరణి మాట్లాడాడు. " గేమ్ ఆడొచ్చు కానీ మరీ ఇంత దారుణమా ఇంత పర్సనల్‌గా వెళ్లి తీసేయాలా" అంటూ భరణి అన్నాడు. ఆ తర్వాత కెప్టెన్సీ రేసులో చివరిగా మిగిలిన ఇమ్మానుయేల్-రీతూ చౌదరి ఇద్దరికీ 'కౌంట్ ఇట్ క్రాక్ ఇట్' అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్కుకి తనూజని సంచాలకులుగా పెట్టాడు. "ఈ గేమ్‌లో గార్డెన్ ఏరియాలో పలు రకాల వస్తువులు పెట్టి వాటిని కౌంట్ చేసి ముందుగా ఎవరు తమ ఫ్లాగ్ ఎగరేస్తారో వాళ్లు విన్ అవుతారు" అని టాస్క్​ గురించి వివరించాడు బిగ్​బాస్​. ఇక ఈ గేమ్‌లో రీతూ కంటే ముందు టాస్క్ కంప్లీట్ చేసి ఇమ్మాన్యుయేల్‌ హౌజ్​కి మూడో సారి కెప్టెన్ అయిపోయాడు. దీంతో ఎపిసోడ్​ ఎండ్​ అయ్యింది.

Bigg Boss 9 Telugu: నామినేషన్స్​లో "ఏడుగురు" - డేంజర్​ జోన్​లో 'సాయి - రాము'! - బయటికి వెళ్లేదెవరు!

Bigg Boss 9 Telugu Day 60 Episode: కెప్టెన్సీ రేసులో "ఆరుగురు" - సీక్రెట్​ టాస్క్​లో ఫెయిల్​ అయిన రీతూ!