ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu Day 60 Episode: కెప్టెన్సీ రేసులో "ఆరుగురు" - సీక్రెట్​ టాస్క్​లో ఫెయిల్​ అయిన రీతూ!

- మూడు టాస్కుల్లో అదరగొట్టిన ఆరెంజ్​ టీమ్​ - రీతూ చౌదరికి బిగ్‌బాస్ స్పెషల్ పవర్!

Bigg Boss 9 Telugu Day 60 Episode
Bigg Boss 9 Telugu Day 60 Episode (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 7, 2025 at 10:31 AM IST

6 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Day 60 Episode: కెప్టెన్సీ కంటెండర్​షిప్​ కోసం ఈ వారం బిగ్​బాస్​ హౌజ్​లో హైడ్రామా కొనసాగింది. రెబల్ అంటూ కొంతమందిని నియమంచి వారితోటే హౌజ్​మేట్స్‌ని కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసు నుంచి తప్పిస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే దివ్య, సుమన్​శెట్టిలు సీక్రెట్​ టాస్క్​ను సక్సెస్​ఫుల్​గా కంప్లీట్​ చేయగా.. నిన్నటి ఎపిసోడ్​లో రీతూను రెబల్​గా చేసి మరికొన్ని సీక్రెట్​ టాస్క్​లు ఇచ్చారు. మరి ఆ టాస్క్​లు ఏంటి? ఎవరిని తప్పించింది? కెప్టెన్సీ పోటీదారులుగా ఎవరు నిలిచారో ఇప్పుడు చూద్దాం.

తనూజకు సేఫ్టీ బ్యాడ్జీ: "టచ్​ ఇట్​ స్మెల్​ ఇట్​ గెస్​ ఇట్​" అంటూ జరిగిన ఘోస్ట్ టాస్కులో తనూజ గెలవడంతో మరోసారి సేఫ్టీ బ్యాడ్జ్ ఆరెంజ్ టీమ్‌కే దక్కింది. అయితే "టీమ్ మొత్తం చర్చించుకొని ఈ బ్యాడ్జ్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ అవ్వండి" అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో రాము, ఇమ్మూ, తనూజ, గౌరవ్ నలుగురూ వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు. మొదటి టాస్కులో రాము-ఇమ్మూ కలిసి ఆడి గెలిచారు. అప్పుడు ఇమ్మూ బ్యాడ్జ్ తీసుకున్నాడు. రాము త్యాగం చేశాడు. ఈసారి తనూజ సింగిల్‌గా ఆడి గెలిచింది కనుక ఈసారి సేఫ్టీ బ్యాడ్జ్ తనకే కావాలని పట్టుబట్టింది. దీంతో ఇమ్మూ కూడా ఓకే అన్నాడు. "సరే అయితే. నెక్స్ట్ మళ్లీ మనకే వస్తే నాకు కావాలి" అంటూ గౌరవ్ అన్నాడు. దీనికి ముగ్గురూ ఓకే అంటూ తలాడించారు. దీంతో తనూజకు సేఫ్టీ బ్యాడ్జ్​ ఇస్తున్నట్లు బిగ్​బాస్​కు చెప్పారు.

కొత్త రెబల్​గా రీతూ: ఇంతలో బిగ్‌బాస్ ఫోన్ చేశాడు. సుమన్ శెట్టితో మాట్లాడుతూ "మీరు ఇప్పటివరకూ ఇచ్చిన సీక్రెట్ టాస్కులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో దివ్య-సుమన్ మీ ఇద్దరూ రెబల్స్‌గా చేసిన పని ఇంతటితో పూర్తయింది. ఇక నుంచి కొత్త రెబల్ వస్తారు. అయితే ఈ విషయాన్ని మీరు ఎవరికీ చెప్పకూడదు" అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో "ఓకే" అంటూ ఫోన్ కట్ చేసి.. దివ్య దగ్గరికెళ్లి ఇదే విషయం చెప్పాడు సుమన్​. తర్వాత మళ్లీ ఫోన్ కాల్ రాగా.. ఈసారి రీతూతో మాట్లాడాడు బిగ్‌బాస్. "రీతూ నేను మిమ్మల్ని కొత్త రెబల్‌గా నియమిస్తున్నాను. మీ మొదటి సీక్రెట్ టాస్క్ ఇంట్లో ఒకరితో సీరియస్‌గా గొడవపడాలి" అని బిగ్‌బాస్ చెప్పాడు.

ఇమ్మూతో గొడవ - సాయి అవుట్​: ఇక ఇంట్లో తను ఎవరితో గొడవ పడాలా అని కాసేపు ఆలోచించింది రీతూ. చివరికి వాష్‌రూమ్ ఏరియాలో ప్రశాంతంగా కూర్చున్న ఇమ్మూని గెలికింది. "నువ్వు పవన్‌ని తీయకుండా ఉంటే మేము ఇప్పుడు బాగా ఆడి గెలిచేవాళ్లం. నువ్వు తియ్యడం వల్లే ప్రాబ్లమ్ మాకు" అంటూ గొడవ స్టార్ట్​ చేసింది రీతూ. దీనికి "ఏం మాట్లాడుతున్నావ్ రీతూ ప్రతిసారీ నన్ను అంటారు. నేను తీయడం వల్ల నీకు ప్రాబ్లమ్ ఎట్లా అయితది" అని ఇమ్మూ అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు సీరియస్​గా డిస్కషన్​ జరిగింది. సీక్రెట్ టాస్కు పూర్తి చేయడంతో కెప్టెన్సీ రేసు నుంచి ఒకరిని తప్పించే పవర్ రీతూకి వచ్చింది. దీంతో ముందు "గౌరవ్‌ని తీసేయండి బిగ్‌బాస్" అని రీతూ చెప్పింది. మళ్లీ ఏమనుకుందో ఏంటో కానీ మళ్లీ వచ్చి లేదు గౌరవ్ వద్దు సాయిని తీసేయండి అని మాట మార్చింది. దీంతో బిగ్‌బాస్ నెక్స్ట్ టాస్క్ మొదలయ్యే ముందే కాల్ చేసి.. సాయితో మాట్లాడాడు. "రెబల్ నిన్ను రేసు నుంచి తప్పించారు. కనుక మీరు ఇక కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసులో లేరు" అని షాకిచ్చాడు.

దుమ్మురేపిన ఆరెంజ్​ టీమ్​: కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌లో భాగంగా బిగ్‌బాస్ 'రెయిజ్ ది ఫ్లాగ్' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా మూడు టీమ్స్ నుంచి ఇద్దరు చొప్పున ఈ గేమ్ ఆడాలి. ఇద్దరు ప్లేయర్లు టబ్‌లో ఉన్న వాటర్‌ని రిలే విధానంలో బకెట్స్‌లోకి నింపుకొని వాటిని మరో టబ్‌లో పాయాలి. అలా వాటర్ నిండటం వల్ల అందులో ఉన్న బాల్స్ పైకి వస్తాయి. వాటిని ఫ్లాగ్ ఉన్న పోల్‌కి హ్యాంగ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్లాగ్ రెయిజ్ అవుతుంది. ఈ టాస్కులో ఆరెంజ్ టీమ్ నుంచి గౌరవ్-ఇమ్మాన్యుయేల్​, పింక్ నుంచి దివ్య-సుమన్, బ్లూ టీమ్ నుంచి భరణి-రీతూ ఆడారు. ఈ టాస్కులో కూడా ఆరెంజ్ టీమ్‌యే గెలిచింది.

గొడవ తర్వాత గౌరవ్​కు సేఫ్టీ బ్యాడ్జీ: మరోసారి ఆరెంజ్ టీమ్‌యే గెలవడంతో ఈసారి సేఫ్టీ బ్యాడ్జ్ ఎవరికి దక్కాలో చర్చించుకొని చెప్పాలని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో నలుగురు మళ్లీ మాట్లాడుకోవడానికి పక్కకి వెళ్లారు. ఇంతలో తనూజ "సేఫ్టీ బ్యాడ్జ్ అంటే ఒకరి తర్వాత ఒకరికి ఇలా పాస్ అవ్వడం కాదు. అలా అయితే మన టీమ్ ఓడిపోద్ది. ఇప్పుడు ఇమ్మూకి ఇస్తే గౌరవ్‌కి అన్యాయం అవుతుంది. గౌరవ్‌కి ఇస్తే ఇమ్మూకి అన్యాయం అవుతుంది" అంటూ మాట్లాడింది. దీనికి ఇమ్మూ-గౌరవ్ ఇద్దరూ ఒప్పుకోలేదు. ఇమ్మూ అయితే మళ్లీ తనకే బ్యాడ్జ్ కావాలంటూ గొడవ పడ్డాడు. కానీ గౌరవ్ మాత్రం "ఇదేంటి ఫస్ట్ రెండు సార్లు వస్తే మీరు తీసుకున్నారు. ఈసారి నాకు కానీ రాముకి కానీ కదా కావాలి?" అంటూ మాట్లాడాడు. చివరికి చాలా పెద్ద రచ్చ జరిగిన తర్వాత గౌరవ్​కు ఇచ్చారు.

రీతూ రెండో సీక్రెట్​ టాస్క్​ ఫ్లాప్​: కాసేపటి తర్వాత రీతూకి మళ్లీ ఫోన్‌ చేసి సెకండ్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. "రీతూ మీరు ఇమ్మానుయేల్ ఫ్యామిలీ ఫొటోని ఎవరికీ కనపడకుండా దొంగతనం చేసి సీక్రెట్ ప్లేస్‌లో పెట్టాలి. టాస్క్ పూర్తయిన తర్వాత కూడా మీరు ఈ విషయం ఇమ్మానుయేల్‌కి చెప్పడానికి వీల్లేదు. ఈ టాస్క్ పూర్తి చేస్తే మీరు మరొకరిని రేసు నుంచి తప్పించే అవకాశం మీకు వస్తుంది" అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో చెప్పిన పని చేయడానికి రీతూ.. ఇమ్మానుయేల్ బెడ్ దగ్గరికెళ్లింది. కానీ ఏమనుకుందో ఏంటో కానీ తర్వాత చేద్దామనుకొని అక్కడి నుంచి బయటికొచ్చేసింది. ఇంతలో బిగ్‌బాస్ అందరినీ కూర్చోమని ఒక నోటీస్ పంపించాడు. "నిన్నటిలానే మీరందరూ ఎవరు రెబల్ అని అనుకుంటున్నారో ఒక్కొక్కరిగా వచ్చి చెప్పండి. అలానే వారే ఎందుకు అన్న రీజన్ కూడా చెప్పాలి. అలా ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్లు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంటారు" అని బిగ్‌బాస్ అన్నాడు. ఇలా ప్రాసెస్​ మొత్తం పూర్తయ్యే సరికి గౌరవ్​కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో గౌరవ్‌ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

కెప్టెన్సీ రేసులో ఆరుగురు: ఆ వెంటనే బిగ్‌బాస్ ఓ ప్రకటన చేశాడు. "నేను ఇచ్చిన సీక్రెట్ టాస్కులు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన రెబల్స్ దివ్య-సుమన్ శెట్టి కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. అలానే మరో రెబల్ రీతూ పూర్తిగా సక్సెస్ కాలేకపోయినా మరో అవకాశం ఇస్తున్నాను. దివ్య, సుమన్ కంటెండర్లు అవ్వగా మిగిలిన వాళ్లలో సంజన, నిఖిల్, గౌరవ్, డీమాన్, సాయి, కళ్యాణ్ అప్పటికే రెబల్స్ చేత, ఓటింగ్ చేత రేసు నుంచి ఔట్ అయ్యారు. ఇక మిగిలిన తనూజ, భరణి, రీతూ, రాము, ఇమ్మూలో నలుగురికి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్లుగా అవకాశం ఉంది. అది ఎవరో మీరే నిర్ణయం తీసుకోండి" అంటూ బిగ్‌బాస్ అన్నాడు. దీంట్లో పెద్ద చర్చేం లేకుండా రాము తప్పుకుంటున్నట్లు చెప్పాడు. అలా చివరికి భరణి, రీతూ, తనూజ, ఇమ్మానుయేల్, దివ్య, సుమన్ శెట్టి ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. ఇక వీరికి కెప్టెన్సీ టాస్కు నేటి ఎపిసోడ్‌లో జరగనుంది.

Bigg Boss Season 9 : దాడి చేసుకున్న కంటిస్టెంట్లు! - బిగ్​ బాస్​లో సంచలనం!!

Bigg Boss 9 Telugu Day 59 Episode: భయపడి గెలిచిన తనూజ - ఘోస్ట్​ రూమ్​లో రీతూ గడబిడ!