Bigg Boss 9 Telugu Day 59 Episode: భయపడి గెలిచిన తనూజ - ఘోస్ట్ రూమ్‌లో రీతూ గడబిడ!
-రెబల్స్‌ను పట్టుకోలేక పోయిన హౌజ్‌మేట్స్ - అమాయకత్వంతో సీక్రెట్ టాస్క్‌ల్లో అదరగొడుతున్న దివ్య - సుమన్!

Published : November 6, 2025 at 10:51 AM IST
Bigg Boss 9 Telugu Day 59 Episode: బిగ్‌బాస్ సీజన్ 9లో తొమ్మిదో వారం కెప్టెన్సీకి సంబంధించి టాస్క్‌లు నిర్వహిస్తోన్నారు. ఈ క్రమంలోనే హౌజ్‌మేట్స్‌ను ఆరెంజ్, పింక్, బ్లూ అంటూ మూడు టీమ్స్‌గా డివైడ్ చేశారు బిగ్‌బాస్. అలాగే దివ్య, సుమన్‌ను రెబల్స్‌గా పెట్టి సీక్రెట్ టాస్క్‌లు పెడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో ఘోస్ట్ టాస్క్‌లో రీతూ అల్లాడించేసింది. మరి నిన్నటి ఎపిసోడ్లో అయినా రెబల్స్‌ను కనుకొన్నారా? ఘోస్ట్ టాస్క్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.
యాక్టింగ్ ఇరగదీసిన సుమన్ - దివ్య: బిగ్‌బాస్ హౌజ్ మొత్తానికి టీ లేకుండా పాల ప్యాకెట్లన్నీ కొట్టేశారు రెబల్స్ దివ్య, సుమన్ శెట్టి. అర్ధరాత్రి చేసిన ఈ దొంగతనంతో తెల్లారేసరికి ఎవరికీ టీ చుక్క కూడా లేకుండాపోయింది. అయితే ఉదయం కాగానే రేషన్ మేనేజర్ అయిన రీతూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేసరికి పాల ప్యాకెట్లు కనిపించలేదు. దీంతో రీతూ చౌదరి పాలు ఎవరో కొట్టేశారంటూ హడావిడి చేసింది. మిగిలిన హౌజ్‌మేట్స్ అంతా ముందు సంజనని అనుమానించారు, కానీ చివరికి కాదని తెలుసుకున్నారు. అయితే రాత్రి పాలు కొట్టేసిన సుమన్ - దివ్య మాత్రం మాములు యాక్టింగ్ చేయలేదు. "పాలు ఎవరు కొట్టేసినా ప్లీజ్ ఇచ్చేయండి" అంటూ దివ్య మహానటిలా యాక్ట్ చేసింది. ఇక సుమన్ శెట్టి అయితే అమాయకుడిలా ఫేస్ పెట్టి అందరినీ బోల్తా కొట్టించేశాడు. ఇక రేషన్ మేనేజర్ అయిన రీతూ మీద కూడా కొంతమందికి డౌట్ వచ్చింది. కానీ ఎవరూ అసలు రెబల్ ఎవరనేది మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే రెండో సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసు నుంచి మరొకరిని తప్పించే ఛాన్స్ రెబల్స్ అయిన దివ్య-సుమన్ శెట్టికి దక్కింది.
పాల ప్యాకెట్లు లేకపోయేసరికి ఎవరికీ బుర్ర పని చేయలేదు. రేషన్ మేనేజర్ అయిన రీతూయే రెబల్ అయి ఉండొచ్చని తనూజ అనుకుంది. అయితే దివ్య ఓవరాక్షన్ చూసి "నువ్వే రెబల్ ఎందుకు కాకూడదంటూ" రాము కామెడీగా గెస్ చేశాడు. కానీ నిఖిల్ మాత్రం దివ్యనే రెబల్ అని కరెక్ట్‌గా గెస్ చేశాడు. "రాత్రి నేను అప్పుడప్పుడూ లేచాను ఆ సమయంలో దివ్య పడుకోలేదు. బయట తిరగడం చూశాను. ఆమె రెబల్ అయి ఉంటుంది" అని నిఖిల్ అన్నాడు. "అదే టాక్.. క్యూట్ ఫేస్ పెట్టుకొని ఆడుతుంది" అని భరణి కూడా అన్నాడు.
రీతూ తెలివి - డైవర్ట్ చేసిన దివ్య: ఇక పాలు కచ్చితంగా ఎవరు తాగినా బాటిల్‌లో పోసుకొనే తాగుంటారని రీతూ అనుకుంది. వెంటనే అందరి బాటిల్స్ తీసుకొచ్చి స్మెల్ చూడటం స్టార్ట్ చేసింది. అయితే రీతూ ఎక్కడ కనిపెట్టేస్తుందోనని దివ్య కాస్త కంగారుపడింది. రీతూను డైవర్ట్ చేయడానికి వెంటనే పక్కనే ఉన్న గౌరవ్‌తో "మధ్యాహ్నానికి చేయాల్సిన కర్రీకి వెజిటేబుల్స్ కట్ చెయ్" అంటూ అరిచింది. "ఇదేంటి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా తినలేదు కదా లంచ్‌కి ఇప్పుడే ప్రిపరేషన్ ఏంటి" అంటూ గౌరవ్ అడిగాడు. దీనికి అటు రీతూ, ఇటు దివ్య ఇద్దరూ గౌరవ్‌పై అరిచారు. "కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో గౌరవ్ వద్దు" అంటూ రీతూ చెప్పింది. ఇదంతా చూసి గౌరవ్‌కి డౌట్ వచ్చింది. దీంతో వాష్‌రూమ్ ఏరియాలో ఉన్న కెమెరా దగ్గరికెళ్లి "పాలు దొంగతనంలో రీతూ హ్యాండ్ ఉంది. ఈ ఇంట్లో ఎవరూ రియల్‌గా లేరు" తన ఆవేదనను వ్యక్తం చేశాడు గౌరవ్.
రీతూ, దివ్య వర్సెస్ గౌరవ్: ఇక తనని కుకింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి మార్చేస్తామని అనడంతో గౌరవ్ గొడవపడ్డాడు. కెప్టెన్ దివ్య దగ్గరికెళ్లి పాల దొంగతనం విషయం మాట్లాడాడు. "పాలు పోయాయి కదా దానికి ఎవరు రెస్పాన్సిబులిటీ" అని గౌరవ్ అడిగాడు. "రేషన్ మేనేజర్‌దే బాధ్యత. కానీ అది డే టైమ్‌లో జరగలేదు కదా ఆమె రేషన్ మేనేజర్ అయినంత మాత్రాన రాత్రంతా ఫ్రిడ్జ్‌ని హగ్ చేసుకొని ఉండలేదు కదా" అంటూ రీతూకి సపోర్ట్ చేసింది దివ్య. దీంతో "ఇప్పుడు నేను ఐదు రోజులు పాల కోసం వెయిట్ చేయాలా" అని గౌరవ్ గొడవ పడ్డాడు. ఇలా దివ్య-గౌరవ్ మధ్య కాసేపు డిస్కషన్ నడిచింది. చివరికి గౌరవ్‌ను కిచెన్ టీమ్ నుంచి తప్పించి వాష్‌రూమ్స్ క్లీన్ చేసే డ్యూటీ ఇచ్చింది దివ్య. అది చేయనని గౌరవ్ చెప్పడంతో "నీకు రేపు ఫుడ్ ఉండదు" అంటూ బెదిరించింది దివ్య.
దివ్య వెళ్లిపోయిన వెంటనే రీతూ, గౌరవ్ మధ్య గొడవ జరిగింది. "కుకింగ్ సెక్షన్‌లో ఉంటే చెప్పినప్పుడు వంట చేసి పెట్టాలి. నీకు నచ్చినప్పుడు కాదూ" అంటూ రీతూ అరిచింది. దీనికి "నేను సర్వెంట్‌ని కాదు" అంటూ గౌరవ్ ఫైర్ అయ్యాడు. రీతూ కూడా అరవడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కాసేపటి తర్వాత హౌజ్‌లో పెట్టిన ఫోన్‌కి బిగ్‌బాస్ కాల్ చేసి దివ్యతో మాట్లాడాడు. "మీరు రెండో సీక్రెట్ టాస్క్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు. కనుక మరొకరిని కంటెండర్‌షిప్ రేసు నుంచి తప్పించండి. ఎవరిని ఔట్ చేయాలో జైలు దగ్గర ఉన్న కెమెరాలో చెప్పండి" అని బిగ్‌బాస్ అన్నాడు. దీంతో నిఖిల్‌ని తప్పిస్తున్నట్లు చెప్పింది దివ్య. ఇదే విషయాన్ని మళ్లీ ఫోన్ చేసి ఇమ్మానుయేల్‌కి చెప్పాడు బిగ్‌బాస్.
రేసు నుంచి డీమాన్ అవుట్: కాసేపటి తర్వాత అందరినీ కూర్చోబెట్టి నోటీస్ పంపించాడు బిగ్‌బాస్. "ఇప్పటివరకూ జరిగిన ఆటని మీరు గమనించి ఉంటారు. కనుక మీ దృష్టిలో ఎవరు రెబల్ అనేది మీరు ఒక్కొక్కరూ చెప్పాలి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు కంటెండర్‌షిప్ రేసు నుంచి తప్పుకుంటారు" అని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే ఎక్కువమంది డీమాన్ రెబల్ అని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత సాయి పేరు చెప్పారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా దివ్య, సుమన్ పేరు చెప్పలేదు. దీంతో "మీరందరూ అనుకున్నట్లు పవన్ రెబల్ కాదు. మీరు తప్పుగా అనుకున్నారు. అయినా ఎక్కువమంది పవన్ పేరు చెప్పడంతో తను రేసు నుంచి తప్పుకున్నాడు" అని బిగ్‌బాస్ చెప్పాడు.
బెదిరిన తనూజ: కంటెండర్‌షిప్‌లో భాగంగా తర్వాత 'టచ్ ఇట్ స్మెల్ ఇట్ గెస్ ఇట్' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనికి సంజన సంచాలకులు. దీని కోసం యాక్టివిటీ ఏరియాలో ఘోస్ట్ రూమ్ టైప్‌లో చీకటి గదిని రెడీ చేశారు. ఆ గదిలో ఐదు ఐటెమ్స్ ఉంటాయి. చీకటిలో వాటిని టచ్ చేసి, స్మెల్ చేసి, గెస్ చేసి ఏంటో కరెక్ట్‌గా చెప్పాలి. ఎవరు ఎక్కువ కరెక్ట్ చెబితే ఆ టీమ్ విన్ అవుతుంది. ఇక ఏం పెట్టారో చెక్ చేద్దామని వచ్చిన సంజన.. అక్కడున్న దెయ్యం వేషాలు చూసి బొమ్మలనుకుంది. కానీ వాళ్లు కదిలేసరికి సంజన కూడా ఉలిక్కిపడింది. ఇక ముందుగా ఆరెంజ్ టీమ్ నుంచి తనూజ ఆడటానికి వచ్చింది. రూమ్‌లోకి ఎంటర్ కాగానే తనూజ ఏడుపు మొదలెట్టింది. "నాకు చీకటంటే భయం ప్లీజ్" అంటూ ముందుకెళ్లింది. మొత్తానికి అలా భయపడుతూనే ఐదింటిలో నాలుగు కరెక్ట్ చెప్పేసింది. తిరిగి బయటికి వస్తుంటే దెయ్యం వేషాల్లో ఉన్న వాళ్లు భయపెట్టారు. దీంతో తనూజ గట్టిగానే ఏడ్చింది.
బయటికి రాగానే సంజనని పట్టుకొని ఏడ్చేసింది. ఆ తర్వాత పింక్ టీమ్ నుంచి దివ్య లోపలికి వెళ్లింది. ఎంత సౌండ్ చేసినా, ఎవరు ఎలా భయపెట్టినా కనీసం దివ్య రియాక్ట్ కాలేదు. ఐదింటిలో దివ్య మూడు కరెక్ట్‌గా గెస్ చేసింది. ఈ టాస్క్ జరుగుతుండగా మరోవైపు పాల ప్యాకెట్లు కొట్టేయాలని బిగ్‌బాస్ పంపిన చిట్టి గౌరవ్‌కి కిచెన్ దగ్గర దొరికింది. మనోడికి తెలుగు చదవడం రాదు కాబట్టి అది పట్టుకొని ఏంట్రా ఇది అంటూ తెగ తిరిగాడు. ఇంతలో ఇమ్మూ చూసి పక్కకి తీసుకెళ్లి అందులో ఉన్నది చదివి ఓహో ఇది రెబల్స్‌కి వచ్చిన చిట్టి అని కనిపెట్టాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రీతూనే రెబల్ అని గౌరవ్-ఇమ్మాన్యుయేల్ అనుకున్నారు. రీతూ కూడా అవును అంటూ వాళ్లని కాసేపు ఆటపట్టించింది.
ఆడపులిలా రీతూ: ఇక చివరిగా బ్లూ టీమ్ నుంచి రీతూ చౌదరి లోపలికి వెళ్లడానికి రెడీ అయింది. "జాగ్రత్త రీతూ లోపల భయపడతావ్" అని సంజన చెప్పింది. దీనికి "ఏంటి భయమా? పులి ఆడపులి ఇక్కడ" అంటూ స్టైల్‌గా లోపలికి ఎంట్రీ ఇచ్చింది రీతూ. తీరా లోపలికి వెళ్లగానే చీకటిగా ఉండటం.. ఏవేవో సౌండ్స్ రావడంతో రీతూలో భయం మొదలైంది. ఎవరో ఉన్నట్లుగా అనిపించడంతో రీతూ ఇక మొదలెట్టింది. "అన్నా ఎవరో ఉన్నారు ఇక్కడ. నువ్వు దగ్గరికొస్తే బాగోదు చెప్తున్నా" అంటూ రీతూ అరిచింది. ఇంతలో సంజన ఏదో చెప్పడంతో రీతూ గట్టిగా నవ్వింది. మొత్తానికి రీతూ 3 ఐటెమ్స్ గెస్ చేసింది. ఇక ఈ గేమ్‌లో తనూజ విన్ అయింది. దీంతో సేఫ్టీ కార్డ్ ఎవరికి ఇవ్వాలో ఆరెంజ్ టీమ్ డిసైడ్ అయి చెప్పండని బిగ్‌బాస్ అన్నాడు. దీంతో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది.
Bigg Boss 9: హౌజ్‌మేట్స్‌తో బిగ్‌బాస్ ఫన్ - తనూజను నమ్మని కంటెస్టెంట్లు!
Bigg Boss Srija: అంతా నాటకమే! - బిగ్‌బాస్ పై దమ్ము శ్రీజ ఫైర్!

