Bigg Boss 9 Telugu Day 57 Episode: నామినేషన్స్‌లో 'నాన్న - కూతురి' రచ్చ - లిస్ట్‌లో ఏడుగురు - డేంజర్లో ఇద్దరు!
-బిగ్‌బాస్ హౌజ్‌లో నామినేషన్స్ మంటలు - తనూజ-దివ్య మధ్య మాటల యుద్ధం!

Published : November 4, 2025 at 10:51 AM IST
Bigg Boss 9 Telugu Day 57 Episode: బిగ్‌బాస్‌లో తొమ్మిదో వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి. మరీ ముఖ్యంగా భరణి - తనూజ మధ్య జరిగిన డిస్కషన్ వేరే లెవల్ అన్నట్టు ఉంది. అయితే అప్పటివరకు నామినేషన్స్‌లో లేని తనూజకు దివ్య షాక్ ఇచ్చింది. మరోవైపు దివ్య - తనూజలకు భరణి ఓ రిక్వెస్ట్ చేసుకున్నాడు. మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఇంట్లో గొడవలు ఓ రేంజ్లో జరిగాయి. అసలు నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగింది? లిస్ట్‌లో ఎవరు ఉన్నారు? డేంజర్ బెల్స్ ఎవరికో ఇప్పుడు చూద్దాం.
నామినేషన్ ప్రక్రియ ఇదే: ఈ వారం నామినేషన్స్ ప్రక్రియని కాస్త వెరైటీగా డిజైన్ చేశాడు బిగ్‌బాస్. "మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ ముందు కొన్ని బొమ్మలున్నాయి. వాటి మీద ఇంటి సభ్యుల ఫొటోలు ఉన్నాయి. బజర్ మోగిన వెంటనే పరిగెత్తుకు వెళ్లి వేరే వాళ్ల ఫొటోలు ఉన్న బొమ్మని తీసుకొని సేఫ్ జోన్‌లోకి ముందుగా రావాలి. అందరికంటే ఆలస్యంగా చేరుకునే సభ్యులు, వారి దగ్గర ఉన్న బొమ్మ మీద ఎవరి ఫొటో ఉంటే వారిద్దరూ నామినేషన్ జోన్‌లోకి వస్తారు. చివరికి వారిద్దరిలో ఒకరు నేరుగా ఇంటి నుంచి బయటికివెళ్లేందుకు నామినేట్ అవుతారు. దివ్య మొదటి రౌండ్‌కి సంచాలకులు" అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో అందరూ బజర్ కోసం వెయిట్ చేశారు.
సంజనా - రీతూ వాదన: ఫస్ట్ రౌండ్‌లో సంజనా అందరికంటే లాస్ట్ వచ్చింది. అయితే సంజనకి తన ఫొటో ఉన్న టెడ్డీయే దొరికింది. దీంతో "ఇక నుంచి మీ బొమ్మ మీరు తీసుకోకూడదు. దివ్య ఆమె బొమ్మని ఎవరితో స్వాప్ చేస్తారో చెప్పండి" అంటూ బిగ్‌బాస్ అడిగాడు. దీంతో రీతూతో స్వాప్ చేసే అవకాశం ఇచ్చింది దివ్య. దీంతో సంజన-రీతూ ఇప్పుడు ఒకరితో ఒకరు ఎవరు ఈ హౌస్‌లో ఉండటానికి ఎక్కువ అర్హులు అనేది వాదించుకోవాలి. అందులో నుంచి ఎవరి వాదన బలంగా ఉందని అనిపిస్తుందో వాళ్లని సేవ్ చేసి మరొకరిని దివ్య నామినేట్ చేస్తుందన్నమాట. ఇక ఇందులో భాగంగా.."నేను మొదటి నుంచి సోలో ప్లేయర్. కానీ రీతూ.. ఎప్పుడూ డీమాన్ హెల్ప్‌తోనే ఆడింది" అంటూ సంజన వాదించింది. ఈ పాయింట్లని డిఫెండ్ చేసుకుంటూ రీతూ బలంగా మాట్లాడింది. అందరికి బాండ్స్ ఉన్నట్టే, నాకూ పవన్‌తో ఉంది. అది మీకు రాంగ్ అనిపిస్తే నేను ఏమీ చేయలేను" అని రీతూ అనింది. ఇక ఇద్దరి వాదన విని సంజనని నామినేట్ చేసి రీతూని సేవ్ చేసింది దివ్య. అయితే నామినేషన్ అయిపోయిన తర్వాత కుళాయి తిప్పేసింది సంజనా.
సుమన్ ఎమోషనల్: నెక్స్ట్ రెండో రౌండ్ జరగ్గా అందులో చివరిగా సుమన్ శెట్టి మిగిలిపోయాడు. అయితే సుమన్ చేతిలో తనూజ బొమ్మ ఉంది. దీంతో సుమన్ శెట్టి - తనూజ ఇద్దరూ ఒకరితో ఒకరు వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తనూజ ఇక్కడ చాలా సూటిగా ఒక ముక్క చెప్పింది. "నేను అయితే సుమన్ అన్నని నామినేట్ చేయాలనుకోవడం లేదు. అంతకుముందు నేను ఒకసారి అన్నని నామినేట్ చేశాను. మీరు యాక్టివ్‌గా లేరు అంటూ కానీ తర్వాత తను సూపర్ హీరో అయిపోయాడు. కనుక ఇప్పుడు నాకు సుమన్ అన్నని నామినేట్ చేసే పాయింట్స్ ఏం లేవు" అని తనూజ చెప్పింది. దీంతో సుమన్ శెట్టి ఎమోషనల్ అయిపోయాడు. "నేను త్వరగా లోపలికి పరిగెత్తలేకపోయాను. నా చేతిలో తనూజ బొమ్మ ఉండిపోయింది. నాకు తనూజని నామినేట్ చేయాలని లేదు. అందుకే నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటున్నా" అని సుమన్ అన్నాడు. ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఆ రౌండ్ సంచాలక్ అయిన సంజనా.. సుమన్ శెట్టిని నామినేట్ చేసింది.
రూల్ మార్చేసిన బిగ్‌బాస్: అయితే రెండు రౌండ్ల ఆట చూశాక బిగ్‌బాస్ రూల్ మార్చేశాడు. "ఈ ఆటలో మీరు తీసుకునే బొమ్మ మీరు నామినేట్ చేయాలి అనుకునేవారిది అయి ఉండాలని చెప్పినా మీకు ఇంకా అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు రూల్స్ మారుస్తున్నాను. ఈ రౌండ్‌లో ఆఖరిగా సేఫ్ జోన్‌లోకి చేరిన సభ్యులు వారి దగ్గరున్న బొమ్మ ఎవరిదో ఆ ఇద్దరూ తలా ఒకరిని తగిన కారణాలతో నామినేట్ చేయాలి. ఆ రెండు నామినేషన్స్ నుంచి ఒకరు నేరుగా నామినేట్ అవుతారు. ఈ రౌండ్‌లో అందరికంటే ముందుగా సేఫ్ జోన్‌లోకి వెళ్లినవాళ్లు సంచాలకులు" అని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక బజర్ మోగగానే ముందుగా సేఫ్ జోన్‌లోకి పవన్ వెళ్లాడు. కానీ సంచాలకులుగా ఉండాల్సిన పవన్ బొమ్మ సాయి దగ్గర ఉన్న కారణంగా ఈ రౌండ్‌కి దివ్యనే సంచాలకులుగా పెట్టాడు బిగ్‌బాస్. దీంతో ముందుగా భరణిని నామినేట్ చేశాడు డీమాన్. "మొదటి నుంచి భరణి సేఫ్ ఆడుతున్నాడని. ఏదో ఒక తప్పు చేసి సారీలు చెప్పడమే పని" అంటూ డీమాన్ అన్నాడు. ఇక చివరిగా వచ్చిన సాయి.. తనూజని నామినేట్ చేశాడు.
నాన్నకు పోటు పొడిచిన కూతురు: దీంతో భరణి-తనూజ ఇద్దరూ తమలో ఎవరు హౌజ్‌లో ఉండేదుకు ఎక్కువ అర్హులో వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగా భరణి మాట్లాడాడు. "నేను ఈ హౌస్‌లో తనూజకి మూడు టాస్కుల్లో గెలిచేందుకు హెల్ప్ చేశాను. తనకంటే బాగా టాస్కులు ఆడతాను. తనలా రేషన్ మేనేజర్‌గా చేసినప్పుడు ఇరిటేట్ అవ్వలేదు. అందరి చేత నేను చాలా మంచి రేషన్ మేనేజర్ అనిపించుకున్నాను. అలాగే ఏ బంధాల కారణంగా అయితే నేను బయటికి వెళ్లానో, అదే కారణంతో తనూజ కూడా వెళ్లి వస్తే పరిస్థితి అర్థమవుతుంది" అంటూ భరణి అన్నాడు. దీనికి తనూజ డిఫెండ్ చేసుకుంది. "టాస్క్ విషయంలో ఆయన ఎందుకు సపోర్ట్ చేశారంటే సపోర్టింగ్ గేమ్ కాబట్టి. అయినా ఆయన హౌస్‌లో నుంచి మొదటిగా వెళ్లిపోయింది రిలేషన్స్ వల్ల. కానీ తిరిగి హౌస్‌లోకి వచ్చాక కూడా ఆయన అందులోనే ఉండిపోయారు. మొన్న కెప్టెన్సీ టాస్కులో ఎవరికీ సపోర్ట్ చేయకుండా ఆయన డైలమాలో ఉండిపోయారు. అది కరెక్ట్ కాదు" అంటూ తనూజ చెప్పింది. ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత దివ్యభరణిని నామినేట్ చేసి షాకిచ్చింది.
నా టాపిక్ తీసుకోవద్దు: నామినేట్ అయిన తర్వాత భరణి ఒంటరిగా కూర్చున్నాడు. ఆ గ్యాప్‌లో తనూజ-దివ్య మాట్లాడుకుంటుంటే భరణి అక్కడికెళ్లి సీరియస్‌గా ఒక విషయం చెప్పాడు. "మీ ఇద్దరూ ఏదైనా మాట్లాడుకుంటే మీ ఇద్దరికీ సంబంధించిన టాపిక్‌యే మాట్లాడండి. కానీ నా టాపిక్ మాత్రం తీసుకురావద్దు ఇంక. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్" అని భరణి అన్నాడు. నెక్స్ట్ తనూజకి ఛాన్స్ రావడంతో ఇమ్మానుయేల్‌ని నామినేట్ చేసింది. "ఇమ్మానుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఆ ముసుగులో సేఫ్ ఆడుతున్నాడు" అంటూ తనూజ అంది. ఈ మాటలకి ఇమ్మూ గట్టిగానే ఫైర్ అయ్యాడు. "నువ్వు బెడ్డు టాస్కులో చీర కట్టుకొని పెళ్లి కూతురులా కూర్చున్నావ్. మేము సపోర్ట్ చేయకపోతే టాప్-5లోకి ఎలా వచ్చావ్ ఆ గేమ్‌లో నువ్వు" అంటూ ఇమ్మూ ఆడిగాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు గట్టిగానే తిట్టుకున్నారు. మరోవైపు రాము.. కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. చివరికి సంచాలక్‌గా ఉన్న డీమాన్.. ఇమ్మూని సేవ్ చేసి కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు.
నెక్స్ట్ రౌండ్‌కి కళ్యాణ్ సంచాలక్ అయ్యాడు. ఇమ్మూకి ఛాన్స్ రావడంతో తనూజని నామినేట్ చేశాడు. రీతూ ఏమో రాముని నామినేట్ చేసింది. దీంతో రాము-తనూజ ఇద్దరూ వాదించుకోవాల్సి వచ్చింది. "నా కంటే తనూజ స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నా" అంటూ రాము షాకిచ్చాడు. దీంతో కళ్యాణ్... రాముని నామినేట్ చేశాడు. తరువాతి రౌండ్‌లో ఇమ్మూ సాయిని నామినేట్ చేయగా.. తనూజని నిఖిల్ నామినేట్ చేశాడు. దీంతో సాయి-తనూజ ఇద్దరిలో ఎవరు హౌస్‌కి బెస్ట్ అంటూ వాదించుకున్నారు. ఇందులో సాయి గట్టిగానే మాట్లాడాడు. "కెప్టెన్సీ టాస్కులో మీలా నేను అయితే ఎవరిదగ్గరా ప్రాధేయపడను. నేను పోరాడతాను" అంటూ తనూజపై సెటైర్లు వేశాడు. తనూజ కూడా ఫైర్ అవడంతో ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది. చివరికి అంతా విని సంచాలక్ డీమాన్.. సాయిని నామినేట్ చేసి తనూజని సేవ్ చేశాడు. ఇంతటితో బాల్ టాస్క్ పూర్తి అయ్యింది.
స్పెషల్ పవర్‌తో తనూజ నామినేట్: ఇక చివరిలో ఇంటి కెప్టెన్‌గా ఉన్న దివ్యకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. "దివ్య మీరు ఒకరిని నేరుగా నామినేట్ చేసి కారణాలు చెప్పండి" అని బిగ్‌బాస్ అడిగాడు. దీంతో తనూజని నేరుగా నామినేట్ చేసింది దివ్య. "ఒక మనిషికి (భరణి) నీకంటే నేను ఎక్కువ ప్రయారిటీ అనే అభిప్రాయం నీకు ఉంది అని అనిపిస్తుంది. నేను వచ్చి ఇద్దరి మధ్య బాండ్‌ని బ్రేక్ చేశాను అన్నట్లుగా బయటికి వెళ్లింది" అని చెప్పింది దివ్య. దీనికి "నేను ఆయన్ని (భరణి) నామినేట్ చేశానని నువ్వు నన్ను నామినేట్ చేశావ్. అంతకంటే ఇందులో ఏం లేదు" అంటూ తనూజ అంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇలా చివరికి నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి సంజనా, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి, తనూజ లిస్ట్‌లో చేరారు.
డేంజర్ జోన్లో ఆ ఇద్దరు: ఇక ఓటింగ్ లైన్స్ ఓపెన్ కావడంతో ఫ్యాన్స్, ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న అనధికార లెక్కల ప్రకారం తనూజ టాప్‌లో ఉండగా, లీస్ట్‌లో రాము, సాయి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓటింగ్‌కు మరో నాలుగు రోజుల సమయం ఉన్నందున ఈ లెక్కలు మారే అవకాశం ఉంది.
Bigg Boss Nominations: "ఆమె బయటికి పోవాల్సిందే" - నామినేషన్స్‌లో 'నాన్న - కూతురి' గొడవ!
Bigg Boss Srija: అంతా నాటకమే! - బిగ్‌బాస్ పై దమ్ము శ్రీజ ఫైర్!

