Bigg Boss 9 Telugu Day 53 Episode: టాస్కుల్లో ఇరగదీసిన భరణి టీమ్ - 'గూబ పగిలిపోద్ది' అంటూ శ్రీజ వార్నింగ్ - మాధురి అలక!
-కల్యాణ్ మిస్టేక్‌తో శ్రీజకు గడ్డుకాలం - టాస్క్ చివర్లో డీమాన్ - శ్రీజ గొడవ - చపాతీ గురించి తనూజపై అలిగిన మాధురి!

Published : October 31, 2025 at 10:42 AM IST
Bigg Boss 9 Telugu Day 53 Episode: బిగ్‌బాస్ సీజన్ 9లో శ్రీజ దమ్ము, భరణి రీఎంట్రీ కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న జరిగిన టాస్కుల్లో భరణి టీమ్ దుమ్ముదులిపింది. అయితే ఇలా ఓవైపు టాస్క్‌లు జరుగుతుంటే మరోవైపు ఫుడ్ విషయంలో గొడవలు ఓ రేంజ్లో జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా తనూజపై అలిగి ఫుడ్ తినడం మానేసింది మాధురి. ఇక ఎపిసోడ్ లాస్ట్‌లో కల్యాణ్‌పై ఫైర్ అయ్యింది శ్రీజ. మరి మొత్తంగా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది? ఎవరు పర్మినెంట్ హౌజ్‌మేట్ అయ్యారో ఇప్పుడు చూద్దాం.
తనూజపై సీరియస్ అయిన మాధురి: పొద్దుపొద్దున్నే సాంగ్‌కి డ్యాన్స్ చేసి అందరూ గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. పక్కనే ఉన్న సంజనతో రాత్రి తనూజతో జరిగిన గొడవ గురించి మాధురి చెప్పింది. "నాకు నిన్న కోపానికి బీపీ వెళ్లిపోయింది పైవరకూ. ఎందుకులే గొడవని పడుకుండిపోయాను" అని మాధురి అంది. ఇంతలో "మార్నింగ్ తినడానికి ఏం చేస్తున్నారు" అంటూ తనూజ అడిగింది. "అది మీరే చెప్పాలి" అంటూ మాధురి అంది. "కూరగాయలు ఉండేదాన్ని బట్టి వండేది నువ్వు కదా" అని తనూజ అంటే.. "నువ్వు ఏం చెప్తే అది వండాలని చెప్పావ్ కదా" అని మాధురి పంచ్ వేసింది. "ఇన్ని రోజులు నేను ఏం చెప్తే అదే వండావా" అని తనూజ కౌంటర్ ఇచ్చింది. "నిన్న కూడా నువ్వు చెప్పావ్ కదా రైస్ చేసేయ్, ఇలా చపాతీ కావాలని" అంటూ మాధురి ఆన్సర్ ఇచ్చింది.
"సరే మార్నింగ్ రైస్ ఏం వండుతావని అడుగుతున్నా" అని తనూజ అంటే.. "అందుకే అడుగుతున్నా నువ్వేం రైస్ చేయమంటే అది చేస్తా. నాకు తెలియట్లేదు తనూజ.. నిన్న నాకు ఆకలేసింది ఒక చపాతీ ఎక్స్‌ట్రా అడిగాను. దానికే నువ్వు అరిచావ్. ప్రతి దానికి నువ్వు అరుస్తున్నావ్. అందుకే నీతో డిస్కస్ చేయాలని లేదు. ఫుడ్ విషయంలో కూడా దెబ్బలాడితే మా ఇంట్లో వాళ్లు చూస్తే హర్ట్ అవుతారు ఇంక. ఆకలికి చస్తుంది ఏడుస్తుందని. మధ్యాహ్నం అన్నం తినకే కదా నీతో ఒక చపాతీ ఎక్స్‌ట్రా అడిగాను" అంటూ మాధురి ఎమోషనల్ అయింది. దీంతో దివ్యని పిలిచి "ఆవిడ ఎక్స్‌ట్రా చపాతీ అడిగితే ఇవ్వలేదా" అంటూ తనూజ అడిగింది. అదేంటి ఇచ్చా కదా అని దివ్య అంటే.. "అది కాదు ఇంకొకటి అడిగా. లేవు అంటే పిండి చేసుకుంటా అని కూడా అన్నా. తనూజయే కదా వద్దన్నావ్. ఆకలేస్తేనే కదా అడుగుతాను. నేను ఈ 14 డేస్‌లో ఎప్పుడైనా అడిగానా" అని మాధురి చెప్పింది. ఇక తనూజ ఆన్సర్ ఇవ్వకుండా కుకింగ్ టీమ్ ప్లస్ కెప్టెన్‌ని పిలిచి మీటింగ్ పెట్టింది.
ఇక అందరికీ వంట చేసేసి మళ్లీ గార్డెన్ ఏరియా దగ్గరికొచ్చి కూర్చుంది మాధురి. దీంతో "ప్లేట్ పట్టుకొచ్చి.. అక్కా కొంచెం టేస్ట్ చెయ్" అని ఇమ్మూ అడిగాడు. "అసలు తినను. చికాకుగా ఉన్నప్పుడు నేను తిండి తినను" అని మాధురి చెప్పింది. ఫుడ్ మీద కోపం ఎందుకు.. అంటూ సంజన ప్లేట్ పట్టుకొని వచ్చింది. మరోవైపు "మాధురి గారు తినరంట" అని తనూజకి కల్యాణ్ చెప్పాడు. "తింటారా ఎవరికైనా ఇచ్చుకుంటారా ఆవిడ ఇష్టం. అక్కడ పెట్టెయ్ ఆవిడ ఫుడ్" అంటూ తనూజ చెప్పింది.
ఈజీగా గెలిచేసిన దివ్య: కాసేపటి తర్వాత బిగ్‌బాస్ ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ చేశాడు. "భరణి-శ్రీజ.. మీరు ఇంట్లో కొనసాగేందుకు చేసిన మొదటి ప్రయత్నం చాలా వీరోచితంగా చేశారు. కానీ దురదృష్టవశాత్తు అది ఒక ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అందుకే కట్టు-పడగొట్టు టాస్క్‌ను రద్దు చేస్తూ మీకు ఇప్పుడు ఫ్లాగ్‌ని పొందేందుకు మరో అవకాశం ఇస్తున్నాను. భరణికి బాలేనందున ఈ టాస్కులో ఎవరినైనా ఆడించొచ్చు" అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో భరణి కోసం దివ్య ఆడింది. మరోవైపు శ్రీజ పోటీ పడింది. ఈ టాస్కులో దివ్య చాలా అవలీలగా గెలిచేసింది. దీంతో ప్యాలెస్ మీద పెట్టడానికి మొదటి ఫ్లాగ్ భరణికే దక్కింది.
అంత యాటిట్యూడ్ అవసరం లేదు: మరోవైపు మధ్యాహ్నం భోజనం సమయంలో తనూజపై ఫైర్ అయ్యింది శ్రీజ. "డైనింగ్ టేబుల్ నుంచే కర్రీ ఉందా కొంచెం" అని శ్రీజ అడిగింది. కానీ తనూజ రెస్పాండ్ కాలేదు. శ్రీజ మళ్లీ అడిగేసరికి "ఒక్క నిమిషం చూస్తున్నాం" అంటూ దివ్య రిప్లయ్ ఇచ్చింది. దీనికి హర్ట్ అయిన శ్రీజ.. "ఇందాక ఉందన్నారు కదా అడిగితే చెప్పడానికి ఏంటి. నేను టెంపరరీ హౌస్‌మేట్‌ని అయినా అడిగినప్పుడు చెప్పండి. అంత యాటిట్యూడ్ అవసరం లేదు. రేషన్ మేనేజర్ ఎవరు అందుకే అంత పొగరన్నాను" అంటూ ఇండైరెక్ట్‌గా తనూజపై ఫైర్ అయ్యింది. అయితే మాధురి మధ్యాహ్నం కూడా తినకుండా అలా గార్డెన్ ఏరియాలోనే కూర్చుంది. అయితే ఎంతకీ తినకపోయేసరికి ఇమ్మూ మరోసారి వెళ్లి మాట్లాడాడు. తనూజ, మాధురి మధ్య ఇష్యూను సాల్వ్ చేయడానికి ఇమ్మాన్యుయేల్ ట్రై చేశాడు. ఇది వర్కౌవుట్ కాలేదు కానీ.. ఇమ్మూ, కల్యాణ్, సంజన బతిమాలడంతో మొత్తానికి మాధురి భోజనం చేసింది.
రెండు నిమిషాల్లో కల్యాణ్ గెలుపు: తర్వాత 'రిలీజ్ ది వారియర్' అంటూ బిగ్‌బాస్ మరో టాస్క్ పెట్టాడు. "ఈ టాస్కులో ప్రతి టీమ్ నుంచి ఇద్దరు ఆడాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ఒక టీమ్ తర్వాత ఇంకో టీమ్ ఆడతారు. ప్రతి టీమ్‌లోనూ ఒక సభ్యుడు బందీ అయి ఉంటాడు. వారిని వేరే సభ్యుడు విడిపించాలి" బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. ఈ టాస్కులో భరణి జైలులో ఉండగా.. రాము తన కోసం ఆడాడు. వీళ్లు 8 నిమిషాల్లో ఈ టాస్క్ పూర్తి చేశారు. మరోవైపు శ్రీజ జైలులో నిల్చోగా ఆమె కోసం కల్యాణ్ ఆడాడు. కేవలం 3 నిమిషాల్లోనే వీళ్లు టాస్క్ పూర్తి చేయడంతో శ్రీజ టీమ్ గెలిచింది. దీంతో ప్యాలెస్‌పై జెండాను పెట్టింది శ్రీజ.
గూబ పగిలిపోద్ది: ఆ వెంటనే 'రైట్ కలర్- రైట్ కనెక్షన్' అంటూ మూడో టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్కులో భరణి తరఫున ఇమ్మానుయేల్ బరిలోకి దిగాడు. శ్రీజ తరుపున కల్యాణ్ ఆడాడు. ఈ గేమ్‌లో కల్యాణ్‌ని ఓడించి ఇమ్మూ గెలిచేశాడు. దీంతో భరణి టీమ్ రెండు టాస్కుల్లో గెలిచి లీడ్‌లోకి వచ్చేసింది. ఈ గేమ్ ఓడిపోయిన తర్వాత రీతూతో డీమాన్ మాట్లాడుతూ.. "నా బాధేంటంటే టాలెంట్, స్కిల్ ఉన్నా గుర్తించకపోతే బాధగా ఉంటుంది" అంటూ తనని ఆడించకపోవడంపై డీమాన్ మాట్లాడాడు. "చాలా ఈజీ గేమ్ అయినా కల్యాణ్ ఆడలేకపోయాడు" అంటూ" డీమాన్ అన్నాడు. ఈ విషయంలో డీమాన్-శ్రీజకి గొడవ అయింది. తర్వాత గేమ్ ఓడిపోయినందుకు శ్రీజకి కల్యాణ్ సారీ చెప్పాడు. దీనికి "సారీ ఏం చెప్పకు గూబ పగిలిపోద్ది. అన్నీ మనమే గెలిచేస్తామా" అంటూ శ్రీజ తిట్టింది.
మా ఆయనపై కూడా ఇలానే: కాసేపటికి మాధురి దగ్గరికొచ్చి "నాకు జడేస్తావా" అని తనూజ అడిగింది. దీంతో మాధురి జడేస్తూ "రీతూ ఇందాక నా దగ్గరికొచ్చి ఏమందో తెలుసా. మీరు నాది డీమాన్‌ది అన్ హెల్తీ రిలేషన్ షిప్ అన్నారు కదా. అన్ హెల్తీ రిలేషన్‌లోనే ఈగోలు ఉంటాయి. కోపం వచ్చి మాట్లాడుకోరు.. మీ ఇద్దరిలా. మాది హెల్తీ రిలేషన్ అందుకే ఎన్ని గొడవలైనా కలిసిపోతామని చెప్పింది తెలుసా" అంటూ మాధురి చెప్పింది. దీనికి "మనం మాట్లాడుకుంటున్నాం కదా.. రాత్రి మీ మైక్‌కి బ్యాటరీ మార్చింది నేనే కదా" అని తనూజ అంది. "అది ఓకే పడుకున్నప్పుడు పక్కకి రావాలి కదా" అని మాధురి అంది. "మళ్లీ నువ్వు కసురుకుంటావేమో తోసెస్తావేమోనని కిందపడతాను అని భయపడి రాలేదు" అని తనూజ అంది. "నీ మీద కోపం కాబట్టి ఫుడ్ మీద చూపించాను. మా ఆయన మీద కోపం కూడా నేను ఫుడ్ మీదే చూపిస్తాను" అంటూ మాధురి చెప్పింది. ఇక వీళ్లిద్దర కలిసిపోవడంపై ఇమ్మాన్యుయేల్ సెటైర్లు వేశాడు. దీంతో నిన్నటి ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. అయితే పర్మినెంట్ హౌజ్‌మేట్ ఎవరని బిగ్‌బాస్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం భరణి అయినట్లు వైరల్ అవుతోంది.
Bigg Boss 9 Telugu: ఆ ఒక్కరే పర్మనెంట్ హౌజ్‌మేట్! - హీరో హీరోయిన్గా 'డీమాన్ - రీతూ'!

