Bigg Boss 9 Day 52 Promo : రీ-ఎంట్రీ టాస్క్‌లో శ్రీజ, భరణి మధ్య గట్టి వార్ - సుమన్ రచ్చ రచ్చ!
- మొదటి టాస్క్‌లో అదరగొట్టిన డిమోన్! - సంచాలక్‌తో మాటల యుద్ధం!

Published : October 29, 2025 at 4:18 PM IST
Bigg Boss 9 Telugu Day 52 Promo : బిగ్ బాస్ సీజన్ 9లో ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. తనూజ, కల్యాణ్, మాధురి, రీతూ చౌదరి, డిమోన్ పవన్, సంజన, రాము, గౌరవ్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే, నామినేషన్స్ అనంతరం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో ఒకరు మళ్లీ ఇంట్లోకి రీ-ఎంట్రీ ఇస్తారని చెప్పాడు బిగ్ బాస్. అందులో భాగంగానే నిన్నటి ఎపిసోడ్లో "పర్మనెంట్ హౌస్ మేట్ గా మారే అవకాశం" అంటూ శ్రీజ, భరణీ ఇద్దరినీ ఇంట్లోకి పంపారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరితో కలిపి హౌస్‌మేట్స్‌కు టాస్క్‌లు పెట్టి.. వాళ్లలో ఒక్కరు మాత్రమే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఇస్తున్నారు బిగ్ బాస్. తాజా విడుదల చేసిన డే 52కు సంబంధించిన మొదటి ప్రోమోలో హౌస్ మేట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి ఒక టాస్క్ ఆడారు. మరి, ఈ టాస్క్‌లో గెలిచింది ఎవరు? ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం.
ప్రోమోలో ఏం ఉందంటే?
"భరణి, శ్రీజ మీరు ఎలిమినేట్ అయినా ఈరోజు ఇక్కడ ఉన్నారు. కానీ, మీ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఈ హౌస్‌లో స్థానం ఉందని అనే విషయం మర్చిపోకండి" అంటూ బిగ్ బౌస్ చెప్పడంతో ప్రోమో స్టార్ట్ అవుతుంది. పర్మనెంట్ హౌస్‌మేట్స్‌గా మారాలనుకుంటున్న సభ్యులు.. అందుకోసం మీరు ఇంట్లో ఉన్న సభ్యుల్లో కొందర్ని మీ సైనికులుగా ఎంపిక చేసుకోవాలని చెబుతాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే హౌస్‌మేట్స్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టగా.. అందులో భరణికి సపోర్ట్ చేసే వాళ్లు ఒక వైపు, శ్రీజకి సపోర్ట్ చేయాలనుకునేవారు మరో వైపు వెళ్లారు. అయితే, శ్రీజ, భరణి ఇంటి సభ్యులను రిక్వెస్ట్ చేసి.. తమవైపు రమ్మని అడగవచ్చు. వారి తరఫున టాస్కుల్లో సపోర్ట్ చేయవచ్చని చెబుతాడు బిగ్ బాస్.
Bigg Boss 9 Telugu : ఆట తక్కువ - డ్రామాలెక్కువ!
టాస్క్‌లో అదరగొట్టిన డీమోన్..
శ్రీజ, భరణిల్లో ఒకరు పర్మనెంట్ హౌస్ మేట్‌గా మారడానికి రెండు టీమ్స్ మధ్య టాస్కులు మొదలయ్యాయి. అందులో భాగంగా "కట్టు పడగొట్టు" అంటూ ఒక టాస్క్ పెడతాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో అటు ముగ్గురు, ఇటు ముగ్గురు టీమ్ మెంబర్స్‌గా బ్లాక్స్ సాయంతో వారికి కేటాయించిన బాక్స్‌లో ఏడు ఫ్లోర్స్ నిర్మించాలి. అవతలి టీమ్ వారు దాన్ని పడగొడుతుండాలి. ఎండ్ బజర్ మోగే టైమ్‌కి ఏ టీమ్ టవర్ ఎత్తుగా ఉంటుందో ఆ టీమ్ ఈ రౌండ్ విజేత అవుతుందని చెబుతాడు బిగ్ బాస్. అలాగే, ఈ టాస్క్‌కి సుమన్ శెట్టి, కల్యాణ్‌లను సంచాలక్‌గా నిర్ణయించాడు.
'కట్టు పడగొట్టు' టాస్క్‌లో భాగంగా శ్రీజ టీమ్‌లో డిమోన్ పవన్, గౌరవ్.. భరణి టీమ్‌లో ఇమ్మాన్యుయేల్, నిఖిల్ ఆడుతారు. ఈ రెండు గ్రూప్‌ల మధ్య వార్ రంజుగా సాగుతుంది. ముఖ్యంగా ఈ టాస్క్‌లో భరణిని, ఇమ్మాన్యుయేల్‌ని, నిఖిల్‌ని ఆపడంలో డిమోన్ పవన్ మంచి ఎఫర్ట్ పెట్టాడు. గేమ్ ఆడుతుండగా బజర్ మోగింది. అప్పుడు శ్రీజ బ్లాక్‌లో అంటే బ్లూ బాక్స్‌లో ఉన్న బ్లాక్స్ ఫ్లోర్లు చివరగా కాలితో నెట్టగా అది బాక్స్ ఎడ్జ్ టచ్ అయి ఉంటుంది. కానీ, అందులో ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నాయి. అయితే, భరణి బాక్స్‌లో ఒకటి మాత్రమే ఉండగా అది బాక్స్‌లో ఉంది.
ఈ క్రమంలో రెండు టీమ్స్‌లో ఎవరు గెలిచారనే దానిపై హౌస్‌లో గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా సంచాలక్ సుమన్ తీసుకున్న నిర్ణయంతో శ్రీజ, కల్యాణ్‌లు విభేదించడంతో హౌస్ మేట్స్ మధ్య కాసేపు మాటల యుద్ధం నడుస్తుంది. చివరగా టవర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి శ్రీజ టీమ్ విన్నర్ అని కల్యాణ్ అంటే.. అవి 'సర్కిల్లో లేవు' అంటూ అరుస్తూ సంచాలక్‌గా ఉన్న సుమన్.. భరణి టీమ్(రెడ్ టీమ్) విన్నర్ అని చెబుతుండడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. అయితే, చివరగా ఈ టాస్క్ మొదటి రౌండ్లో "శ్రీజ టీమ్" విన్ అయినట్లు తెలుస్తోంది.

