Bigg Boss 9 Telugu Day 50 Episode: "మీది అన్ హెల్దీ బాండ్" రీతూపై మాధురి పర్సనల్ ఎటాక్ - హాట్‌హాట్‌గా నామినేషన్లు!
-ఎక్స్ కంటెస్టెంట్స్ చేత నామినేషన్స్ - సంజనాపై ఫైర్ అయిన సుమన్ శెట్టి!

Published : October 28, 2025 at 10:49 AM IST
Bigg Boss 9 Telugu Day 50 Episode: బిగ్‌బాస్ సీజన్ 9 మొదలై నిన్నటితో 50 రోజులు పూర్తైంది. ఈ సందర్భంగా నామినేషన్స్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు బిగ్‌బాస్ టీమ్. ఇప్పటివరకు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన వారిని మళ్లీ ఇంట్లోకి తీసుకొచ్చి నామినేట్ చేసే అధికారం ఇచ్చారు. దీంతో నిన్నటి ఎపిసోడ్ దద్దరిల్లిందనే చెప్పాలి. స్ట్రాంగ్ రీజన్స్‌తో హౌజ్‌మేట్స్‌కు కత్తులు దించారు మాజీలు. మరీ ముఖ్యంగా శ్రీజ పాయింట్స్ వేరే లెవల్. ఇక మాధురి -రీతూ మధ్య జరిగిన గొడవ వామ్మో అనేలా ఉంది. మరి 50వ రోజు బిగ్‌బాస్ హౌజ్‌లో ఏమేమి జరిగాయో ఇప్పుడు చూద్దాం.
"బిగ్ బాస్ ఇల్లు నామినేషన్ సమరానికి సిద్ధమైంది. ఈసారి వీరిలో కొంతమంది తిరిగి ఇంట్లోకి వచ్చి ట్రోఫీ కోసం మీతో పోటీ పడబోతున్నారు. నామినేషన్లో మీ తలరాత రాయబోతున్నారు" అంటూ అనౌన్స్ చేసిన బిగ్‌బాస్.. ముందుగా ఎక్స్ కంటెస్టెంట్ ప్రియాను లోపలికి పంపారు. ఇక సంజనాకు కత్తి దింపింది ప్రియా. "నేషనల్ టెలివిజన్ లో ఒకమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. నిఖిల్ వచ్చాడు కాబట్టి కల్యాణ్ ఫీల్ అవుతున్నాడు అని చెప్పడం కరెక్ట్ కాదు. రోడ్డు రోలర్ అంటూ బాడీ షేమింగ్ చేస్తున్నారు. క్లాస్ అంటే ఏంటి? దువ్వాడ మాధురి - తనూజా విషయంలో ఇన్ సెక్యూర్ అయ్యారు" అని సంజనాను నామినేట్ చేసింది. అలాగే నామినేట్ చేసే పవర్‌ను కల్యాణ్‌కు ఇవ్వగా .. రామూ రాథోడ్‌ను నామినేట్ చేశాడు.
ముద్దుగా మాటలు చెప్పి మందార పూలు పెడుతున్నారు: ప్రియా వెళ్లిపోగానే మర్యాద మనీష్ ఎంటర్ అయ్యాడు. ఇక వచ్చి రావడంతోనే కల్యాణ్‌ను నామినేట్ చేశాడు. "ఇమ్మాన్యుయేల్‌ను వెన్నుపోటు పొడిచావ్. ఫిల్టర్ గేమ్ వద్దు. నువ్వు మానిప్యులేట్ అవుతున్నావ్. సోలో గేమ్ ఆడు. నీకు ముద్దు మాటలు చెప్పి, చెవిలో మందార పువ్వులు పెడుతున్నారు. నీకు వీడియోలు చూపించారు. వేరే వాళ్లకి వీడియోలు చూపించలేదని అనుకుంటున్నావా? ఆ వీడియోలలో నువ్వు తప్పని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఇప్పటికైనా నీ గేమ్ నువ్వు ఆడు" అంటూ మనీష్ చెప్పాడు. అలాగే తన నామినేషన్ పవర్‌ను ఇమ్మాన్యుయేల్ కి ఇచ్చాడు. "ఆయేషా స్టోన్‌కు అర్హురాలా అని నాగార్జున గారు అడిగితే, తనూజా అవును అని చెప్పి సేఫ్ ఆడింది. నువ్వు ఒక పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండవు. నేను నిన్ను సపోర్ట్ చేయలేదు అని చెప్పడం బాధగా అనిపించింది. బొమ్మల గేమ్‌లో తనూజ నా కోసమే ఆడింది. కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి రాముకి ఓటేసింది. నాకు మైండ్ పోయింది" అని ఇమ్మాన్యుయేల్ తన నామినేషన్ పాయింట్‌ని చెప్పాడు. తనూజా లేచి " అతను తల ఊపాడు. అందుకే నేను అతన్ని నామినేట్ చేశాను. కానీ ఇప్పుడు ఈ పర్సన్ రెండు నాలుకలతో మాట్లాడుతున్నాడు" అని డిఫెండ్ చేసుకుంది. ఇలా ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది.
మర్యాద మనీష్ ఎగ్జిట్ అయిన తర్వాత ఫ్లోరా సైనీ వచ్చింది. ఇక రీతూను నామినేట్ చేస్తూ.. "నువ్వు ఇంతకుముందు సీజన్లు చూసి వచ్చి, అదే ఫేక్ లవ్ స్టోరీ నడుపుతున్నావ్. ముందు కల్యాణ్‌ను ట్రై చేసావ్. కానీ వర్క్ అవుట్ అవ్వకపోవడంతో డీమాన్‌తో ట్రాక్ స్టార్ట్ చేశావ్. తనూజా హెల్త్ బాలేనప్పుడు కల్యాణ్ ఏడిస్తే నవ్వావు. అయేషా వెళ్లినప్పుడు కూడా నవ్వావు. ఎంతటి శాడిస్ట్ అయితే అలా ఉంటారు?" అంటూ ఫ్లోరా చెప్పి నామినేట్ చేసింది. కానీ "ఫాల్స్ అలిగేషన్" అని కొట్టిపడేసింది రీతూ.
మీ మాటలతో చచ్చిపోతున్నాం: ఫ్లోరా తన రెండో కత్తిని సుమన్ శెట్టికి ఇవ్వగా, ఆయన చెత్త బుట్ట గొడవను తీసి సంజనను నామినేట్ చేశాడు. "లాగిపెట్టి లెంపకాయ కొట్టి సారీ సిస్టర్ అంటే మీరు ఊరుకుంటారా. ఎవడు తొక్కలో కెప్టెన్ సిస్టర్ ఇక్కడ. మీరు కెప్టెన్ అయ్యారు. మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం మేమందరం. కెప్టెన్ సంజన గారు అంటూ సెల్యూట్ కొట్టాం" అంటూ సుమన్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. ముందు నోరు జారాను అని ఒప్పుకున్న సంజన.. గొడవ పెద్దది అవ్వడంతో మరోసారి నోరు జారింది. "అసమర్థ కెప్టెన్. మీరు చేస్తే నీతులు మేము చేస్తే బూతులు" అంటూ సమర్థించుకుంది. "మీ మాటలతో చచ్చిపోతున్నాం" అంటూ కుండబద్దలు కొట్టాడు సుమన్ శెట్టి.
తప్పు చేసినప్పుడే తెలుగు రాదు: ఆ తర్వాత "సంజనాకు తెలుగు బాగా తెలుసు. తప్పు వర్డ్స్ చెప్పినప్పుడే తెలుగు రాదు అంటుంది. సెన్స్ లేదు, షట్ అప్" అని దువ్వాడ మాధురి మండిపడింది. సంజన ముందు ఫైర్ అయ్యి, తరువాత కుళాయి తిప్పేసింది. దీంతో ఇమ్మూ "డిగ్రెడ్ చేశావ్" అంటూ సంజనాకు తన తప్పును చెప్పాడు. మరోవైపు రీతూ, డెమోన్ కంటెండర్ విషయంలో గొడవ పడ్డారు. "నావల్ల నువ్వు బ్యాడ్ అవుతున్నావ్ కదా. నువ్వు నీ గేమ్ ఆడుకో" అంటూ డెమోన్ అరిచాడు.
కల్యాణ్‌కు పోటు పొడిచిన శ్రీజ: ఇక ఫ్లోరా సైనీ వెళ్లిన తర్వాత దమ్ము శ్రీజ ఎంట్రీ ఇచ్చింది. రావడం రావడమే "అలా వెళ్తాను అనుకోలేదు. ఇలా వస్తాను అనుకోలేదు. మాధురి గారు ఎలా ఉన్నారు. మీ పేరు మాస్ మాధురా? రాజుగారా? అనేది తెలియట్లేదు. చాలామందిని బయట అడిగాను. నాకే తెలీదు నీకెలా తెలుస్తుంది అన్నారు. తెలియాలని రూల్ లేదు కదా. బాండింగ్స్ బాగున్నాయా? గేమ్ ఆడడానికే వచ్చారా?" అంటూ దువ్వాడ మాధురికి ఇచ్చిపడేసింది శ్రీజ దమ్ము. ఇక "లీనియన్స్ ఇస్తున్నారు. చప్పట్లు అన్నది ఎవరో వారితోనే రాజూ రాజూ అంటూ తిరుగుతున్నారు. ఎన్ని రోజులు సపోర్ట్‌తో నెట్టుకొస్తారు?" అంటూ తనూజాను కూడా ఓ ఆట ఆడుకుంది శ్రీజ. ఇక తన నామినేషన్‌ను కల్యాణ్‌కు వేసింది. "ఈ హౌజ్‌లో నన్ను డిసప్పాయింట్ చేసిన పర్సన్ కల్యాణ్. నిన్ను అమ్మాయిల పిచ్చోడు అన్నవాళ్లను ఎందుకు నామినేట్ చేయలేదు? తుప్పాస్ నామినేషన్ వేసి సేఫ్ గేమ్ ఆడావు. నీ ప్రొఫెషన్ తీసి మాధురి మాట్లాడింది. నువ్వు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆమె వల్లే గొడవలు అయ్యాయి. తనూజా చెయ్యి వేయమన్నది. ఇప్పుడు ఆమెను నామినేట్ చేస్తే బ్యాడ్ అవుతాను అని సంజనాను నామినేట్ చేశావ్" అంటూ కల్యాణ్‌ను నామినేట్ చేసింది.
మాధురిని రెచ్చగొట్టిన శ్రీజ: అలాగే ఆ కత్తిని మాధురికి ఇస్తూ ఎంతబాగా నామినేట్ చేస్తారో? బాండింగ్స్ అని చెప్పి నామినేట్ చేస్తారో? నార్మల్‌గా చేస్తారో చూస్తాను" అంటూ రెచ్చగొట్టింది శ్రీజ. ఇక తన నామినేషన్‌ను రీతూకి వేస్తూ "నువ్వు సపోర్ట్ తో గేమ్ ఆడుతున్నావ్. అసలు నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావా? డీమాన్‌ను సపోర్ట్ చేయడానికి వచ్చావా" అంటూ మాధురి ప్రశ్నించింది. దీంతో "మీరు బిగ్‌బాస్ హౌజ్‌కు తనూజను సపోర్ట్ చేయడానికి వచ్చారా? "మీవి బాండ్స్ కాదా ? వాళ్లిద్దరివి బాండ్స్ కాదా" అని ప్రశ్నించింది. "అందరివి హెల్దీ బాండ్స్, మీది అన్ హెల్దీ బాండ్. 24 గంటలు మీ ఇద్దరి గోల టార్చర్" అంటూ నోరు జారింది మాధురి. దీంతో "జాగ్రత్తరా మళ్లీ బయటకెళ్తే బుర్ర పగలగొడతారేమో" అంటూ శ్రీజ మరింత చిచ్చు రేపింది. దీంతో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. ఇలా ఎలిమినేట్ అయిన వారిలో ప్రియా, మనీష్, ఫ్లోరా, శ్రీజ వచ్చి నామినేట్ చేశారు. ఇక మిగిలిన వారు అంటే భరణి, శ్రష్టి, హరీష్ నేటి ఎపిసోడ్లో నామినేట్ చేయనున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ప్రకారం పలు కారణాల వల్ల మాస్క్ మ్యాన్ హరిత హరీష్ నామినేషన్స్‌కు రాలేదంట.

