Bigg Boss 9 Day 47 : ఇమ్మూ "రెండోసారి"! - కళ్లు తిరిగిపడిపోయిన తనూజ - వెక్కివెక్కి ఏడ్చిన కల్యాణ్!
- హ్యాట్ టాస్క్‌లో ఇరగదీసిన ఇమ్మాన్యుయేల్ - రీతూ, మాధురి మాటల యుద్ధం!

Published : October 25, 2025 at 11:04 AM IST
Bigg Boss 9 Telugu Day 47 Review : ఏడో వారం కెప్టెన్ రేస్ ముగిసింది. నిన్నటి వరకు దొంగల టాస్క్ చేసిన కంటెస్టెంట్లు, కెప్టెన్సీ కంటెండర్సై శుక్రవారం(డే 47) ఎపిసోడ్లో కెప్టెన్ అవ్వడం కోసం ఒక టాస్క్ ఆడారు. అందులో ఇమ్మాన్యుయేల్ గెలిచి మరోసారి కెప్టెన్ అయ్యాడు. తర్వాత తనూజ కళ్లు తిరిగి పడిపోవడంతో కల్యాణ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతకంటే ముందు కంటెండర్ల లిస్ట్ విషయంలో రీతూ, మాధురి మధ్య మాటల వార్ నడిచింది. అయేషా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. వీటితో పాటు డే 47 ఎపిసోడ్లో జరిగిన మరిన్ని విశేషాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
ఎపిసోడ్ 47లో హౌస్‌లోకి పోలీసులుగా ఎంట్రీ ఇచ్చిన కరణ్ జీత్(అమర్దీప్), ఇంద్రజిత్(అర్జున్ అంబటి) ఒక్కొక్కరిగా హౌస్‌మేట్స్‌ను ఇన్వెస్టిగేట్ చేశారు. మాస్ మాధురి, సైలెన్సర్ సంజనాను పట్టించిన వాళ్లకి డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ షిప్ ఆఫర్ చేయడంతో.. తనూజా సంజనాను పట్టించింది. దాంతో సంజనాను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం తనూజకు కెప్టెన్సీ కంటెండర్ షిప్ ఇచ్చారు పోలీసులు. వాష్ రూం కబోర్డులో దివ్వెల మాధురిని దాచిపెట్టారు. తర్వాత మాధురి కట్ అవుట్ పై 'కిల్' అని రాయమంటూ రీతూకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన పని అయిపోయిందంటూ హౌస్ నుంచి వెళ్లిపోయారు అమర్దీప్, అర్జున్ అంబటి. ఆ తర్వాత సుమన్ శెట్టిని తొక్కలో కెప్టెన్ అని నోరుజారిన సంజనా, తర్వాత సారీ చెప్పి, తప్పు ఒప్పుకుంది. కాసేపటి తర్వాత జైలు నుంచి ఆమెను విడుదల చేశారు.
హౌస్ నుంచి వెళ్లిపోయిన అయేషా..
అనంతరం అయేషాకు టైఫాయిడ్, డెంగీ ఉన్నట్టుగా నిర్ధారించారు డాక్టర్లు. తర్వాత కల్యాణ్ వెళ్లి.. మీ కట్ అవుట్ మీద 'కిల్' అని ఎవరో రాశారంటూ అయేషాతో చెప్పాడు. అప్పుడు ఇద్దరూ కలిసి రమ్యపై అనుమానపడ్డారు. ఆ తర్వాత రామూతో అయేషా "నేను కోరుకున్నది ఏదీ నాకు దక్కదు" అంటూ బాధపడింది. నెక్ట్స్ తనూజ-ఇమ్మూ కలిసి రీతూ, పవన్ క్యారెక్టర్స్ ఇమిటేట్ చేస్తూ ఒక ఫన్నీ స్పూఫ్ చేసి నవ్వించారు. అనంతరం బిగ్‌బాస్.. అయేషాను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి నువ్వు త్వరగా కోలుకోవడానికి, ఇతర ఇంటి సభ్యుల ఆరోగ్య భద్రత కోసం హౌస్ నుంచి బయటకు పంపుతున్నట్టు చెప్పాడు. దాంతో అయేషా.. ఫినాలే వీక్‌లో వస్తానని అందరికీ గుడ్ బై చెప్పి హౌస్ నుంచి వెళ్లిపోయింది.
Bigg Boss 9 Updates: బిగ్‌బాస్‌లో హిస్టరీ రిపీట్! - వెళ్లిపోయిన కంటిస్టెంట్ మళ్లీ ఎంట్రీ?
రీతూ Vs మాధురి..
నెక్ట్స్ ఇన్వెస్టిగేషన్ విషయంలో పోలీసులు ఇచ్చిన ఆఫర్‌తో డైరెక్ట్ కంటెండర్ షిప్ పొందిన తనూజా, రీతూలు తమ వద్ద ఉన్న మనీని మిగతా సభ్యులతో పంచుకున్నారు. దొంగల టాస్క్ అనంతరం హౌస్ మేట్స్‌లో ఎక్కువ డబ్బు సంపాదించిన నిఖిల్, కల్యాణ్, ఇమ్మూ, దివ్య కంటెండర్లుగా అర్హత సాధించారు. తర్వాత కంటెండర్ల లిస్ట్‌లో అతని పేరు లేకపోవడంతో హర్ట్ అయ్యాడు డిమోన్ పవన్. దాంతో ఇమ్మూ దగ్గర రీతూ -డెమోన్ కలిసి పంచాయితీ పెట్టారు. ఇదే క్రమంలో దివ్వెల మాధురి, రీతూ చౌదరి మధ్య మాటల యుద్ధం జరిగి మర్యాద దాకా వెళ్లింది.
హ్యాట్ టాస్క్‌లో ఇరగదీసిన ఇమ్మూ ..
అనంతరం దొంగల టాస్క్‌లో కంటెండర్స్ అయినవారి మధ్య కెప్టెన్సీ కోసం "హ్యాట్ టాస్క్" పెట్టాడు బిగ్ బాస్. ఇందులో తనూజ, ఇమ్మూ, కల్యాణ్, రీతూ చౌదరి, దివ్య, నిఖిల్ పాల్గొనగా.. ఫైనల్ స్టేజ్ వచ్చే వరకు ఇమ్మూ, తనూజ మిగులుతారు. నెక్ట్స్ వీరిద్దరి మధ్య జరిగిన రౌండ్లో ఇమ్మూ మళ్లీ హ్యాట్ దక్కించుకుని మాధురికి ఇవ్వగా.. ఆమె తనూజని కెప్టెన్సీ రేస్ నుంచి ఎలిమినేట్ చేసింది. తర్వాత తనూజతో బ్యాడ్జ్ పెట్టించుకుని ఇంటికి రెండో సారి కెప్టెన్ అయ్యాడు ఇమ్మాన్యుయేల్.
కళ్లు తిరిగి పడిపోయిన తనూజ.. వెక్కి వెక్కి ఏడ్చిన కల్యాణ్..
ఇక కెప్టెన్సీ రేస్‌లో చివరి వరకు ఉండి అది చేజారిపోవడంతో తనూజ బాగా ఎమోషనల్ అయ్యింది. అప్పుడే తనూజ ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ.. డాక్టర్ డాక్టర్ అంటూ సడన్‌గా సృహతప్పి పడిపోయింది. వెంటనే ఇంటి సభ్యులు ఆమెను హుటాహుటిన మెడికల్ రూంకి తీసుకెళ్లారు. మరోవైపు తనూజ కళ్లు తిరిగిపడిపోవడంతో కల్యాణ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. తర్వాత రమ్య వచ్చి.. తనూజ బాగానే ఉంది. ఏం కాదు అని కల్యాణ్‌ను తెగ ఓదార్చింది. అలాగే, మాధురి, ఇమ్మూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
తర్వాత కిచెన్‌లో తనూజాకి ఫేవరేటిజం చూపిస్తున్నారంటూ రమ్య - మాధురి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇక అర్ధరాత్రి కల్యాణ్ తనూజ దగ్గరికి రాగా "ఎందుకు ఏడ్చావ్? నీలా నేను ఆలోచించలేను. నా వేలో చెప్పు" అంటూ తనూజ అడిగింది. "ఇప్పుడు బజ్జో.. రేపు నీకొకటి చెప్తా" అంటూ తనూజ నిద్రపోయేదాకా అక్కడే ఆమె చేతిని పట్టుకుని కూర్చుండిపోయాడు కల్యాణ్. అలా శుక్రవారం ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది.
Bigg Boss 9 Telugu : ఈసారి గెలిచేది అమ్మాయే! - బిగ్ బాస్ విన్నర్‌పై భారీగా ఊహాగానాలు!
Bigg Boss 9 Telugu Day 46: సంజనా 'చెత్త' గొడవ - హౌజ్‌లోకి పోలీసులు!

