Bigg Boss 9 Telugu Day 46: సంజనా 'చెత్త' గొడవ - హౌజ్‌లోకి పోలీసులు!
- టాస్కుల్లో ఇరగదీసిన సంజనా టీమ్ - 'రీతూ - పవన్' బ్రేకప్!

Published : October 24, 2025 at 10:59 AM IST
Bigg Boss 9 Telugu Day 46 Episode: బిగ్‌బాస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్షిప్ కోసం టాస్క్‌లు నడుస్తున్నాయి. మాస్ మాధురి, సంజనా సైలెన్సర్ అంటూ కంటెస్టెంట్స్‌ను రెండు టీమ్‌లుగా విడగొట్టు టాస్కులు పెడుతున్నాడు బిగ్‌బాస్. ఇక మొదటి రెండు రోజుల్లో మాధురి టీమ్ గెలిస్తే, నిన్నటి ఎపిసోడ్‌లో సంజనా టీమ్ ఇరగదీసింది. ఇలా ఓవైపు టాస్క్‌లు జరుగుతుంటే రీతూ-డీమాన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అంతేకాకుండా చెత్త విషయంలో కెప్టెన్లపై సంజనా విరుచుకుపడింది. అలాగే బిగ్‌బాస్ హౌజ్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
బురద టాస్క్‌లో దుమ్మురేపిన డీమాన్: నిన్నటి ఎపిసోడ్‌ని టాస్కుతో మొదలుపెట్టాడు బిగ్‌బాస్. "ఏ గ్యాంగ్‌స్టర్ అయినా తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఎక్కువ బలం ఉండటం చాలా ముఖ్యం. ఆ బలంతోనే వారు వారి ప్రత్యర్థులను అణిచివేయగలుగుతారు. ఇప్పుడు ఆ బలాన్ని మీరు చూపించి డబ్బు సంపాదించడానికి నేను మీకు ఇస్తున్న మూడవ అవకాశం 'జెండాలే మీ అజెండా'. ఈ పోటీ కోసం గ్యాంగ్ లీడర్స్ మీ గ్యాంగ్‌లోని బలమైన, దమ్మున్న ఇద్దరు పోటుగాళ్లని ఎంచుకొని వారిని ఈ పోటీలో దింపడానికి వారితో ఒప్పందాలు కుదుర్చుకోండి.
ప్రతి గ్యాంగ్ నుంచి ఇద్దరు పోటుగాళ్లు వచ్చి తమకి ఇచ్చిన బెల్ట్‌ని ధరించి అక్కడున్న మడ్ పిట్‌లో నలుగురు పోటుగాళ్లు ప్రత్యర్థి గ్యాంగ్ ఫ్లాగ్స్ ఉన్న వైపు నిలబడాల్సి ఉంటుంది. స్టార్ట్ బజర్ మోగగానే అందులో ఉన్న మీ టీమ్ కలర్ ఫ్లాగ్స్‌ని, బోనస్ పాయింట్ల కోసం ఎల్లో కలర్ ఫ్లాగ్స్‌ని సంపాదించి మీ బాస్కెట్‌లో పెట్టాలి. ఎండ్ బజర్ మోగేలోపు ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ ఫ్లాగ్స్ సేకరించి తమ బాస్కెట్లో పెట్టి ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది. ఆ గ్యాంగ్ లీడర్‌కి ఐదు వేల బీబీ క్యాష్ వస్తుంది. మీ టీమ్ కలర్ ఫ్లాగ్ సేకరించడం ద్వారా ప్రతి ఫ్లాగ్‌కీ ఒక పాయింట్ లభిస్తుంది. ఎల్లో ఫ్లాగ్ సేకరించడం ద్వారా ఐదు పాయింట్లు లభిస్తాయి" అని బిగ్‌బాస్ చెప్పాడు.
ఇక ఈ గేమ్‌కి సంజన టీమ్ తరఫున డీమాన్-గౌరవ్, మాధురి గ్యాంగ్ తరఫున ఇమ్మాన్యుయేల్-కళ్యాణ్ బరిలోకి దిగారు. ఇక గేమ్ ఇలా మొదలైందో లేదో డీమాన్-గౌరవ్ ఇద్దరూ రెచ్చిపోయారు. కళ్యాణ్-ఇమ్మూని తమ జెండాలవైపు బలంగా లాక్కొని వెళ్లిపోయారు. దీంతో ఈ గేమ్‌లో ఏకపక్షంగా డీమాన్-గౌరవ్ గెలిచేశారు. దీంతో సంజన టీమ్‌కి 5 వేల బీబీ క్యాష్ వచ్చింది. ఈ టాస్కులో ఓడిపోయినందుకు గానూ "బిగ్‌బాస్ పేరు ఎత్తిన ప్రతిసారి మాధురి టీమ్ నుంచి ఇమ్మానుయేల్ కోడిలా సౌండ్ చేయాలి" అంటూ ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చాడు.
సంజనా చెత్త కామెంట్స్: కాసేపటి తర్వాత కెప్టెన్సీ రూమ్‌లో నుంచి చెత్త బుట్ట తీసుకొచ్చి సంజన గొడవ స్టార్ట్ చేసింది. "సొంత కప్పులు కూడా అక్కడ పడేసి వెళ్తున్నారు. ఏదో మేము సర్వెంట్స్ అని. ఇది డస్ట్ బిన్. ఇది రోజుకి ఒన్ టైమ్ అయినా క్లీన్ చేస్తున్నారా. అసలు 1 ఇంచ్ ప్లేస్ ఉందా డస్ట్ బిన్‌లో" అంటూ సంజన అరిచింది. దీంతో వాష్‌రూమ్ క్లీనింగ్ వర్క్ చేస్తున్న దివ్య మాట్లాడింది. "నిన్న నైట్ చేశాం.
ఇప్పుడు మార్నింగ్ తీస్తాం. అయినా మీ ప్రాబ్లమ్ ఏంటి.. ఆ వాష్‌రూమ్‌లో లేడీస్ డస్ట్‌బిన్ ఫుల్ క్లియర్ ఉంది అక్కడెందుకు వాడట్లేదు" అని దివ్య క్వశ్చన్ చేసింది. "లేదు అక్కడికి ప్రతిసారి పోవడానికి అవదు. దూరం ఉంది. అయినా ఈ డస్టబిన్‌ను 4 డేస్‌లో ఒక్కసారి పని చేస్తున్నారు. పిక్నిక్‌కి వచ్చారా మీరు" అంటూ సంజన నోరుపారేసుకుంది. దీంతో "మీరేం చేశారు వాష్‌రూమ్ పనిలో ఉన్నప్పుడు మీరు చేయలేదా పిక్నిక్" అని దివ్య కూడా రెయిజ్ అయింది. ఇంతలో "నిన్న మీరు పడుకున్నాక వీళ్లు క్లీన్ చేశారు మీకు తెలుసా అది" అని సంజనతో కెప్టెన్ సుమన్ శెట్టి చెప్పాడు.
"అయినా మీ వర్క్ డిష్ వాషింగ్ కదా మీరు ఎందుకు కంప్లెయింట్ ఇస్తున్నారు" అని సంజనాను కెప్టెన్ గౌరవ్ అడిగాడు. "మేము వాడుతున్నామండీ వాష్‌రూమ్".. అంటూ సంజన చెప్పింది. దీంతో "అసలు మీరు ఎందుకు వాడుతున్నారు. అక్కడున్న వాష్‌రుమ్స్ క్లోజ్ చేసి లేవు కదా. అది క్లోజ్ చేస్తేనే ఇది వాడాలి. మరి ఇప్పుడు మీరెందుకు వెళ్లారు" అని సుమన్ క్వశ్చన్ చేశాడు. "నేను హ్యాండ్ వాష్ కోసమే వెళ్లాను" అని సంజన చెప్తే.. "వెళ్లకూడదు. మేము పడుకోవడానికి మాత్రమే ఆ రూమ్ ఇచ్చాం. ఆ డస్ట్‌బిన్ లోపల పెట్టండి సంజన గారు" అని సుమన్-గౌరవ్ చెప్పారు. "లేదు వాళ్లు అది ఎంప్టీ చేశాకే పెడతాను" అంటూ సంజన పట్టుపట్టింది. ఈక్రమంలో గౌరవ్ - సుమన్‌కు, సంజనాకు మాటామాటా పెరగగా.. చేతిలో ఉన్న కవర్‌ను సుమన్ శెట్టిపై విసిరేసి వీరంగం చేసింది సంజనా.
నీటిని స్ప్రే చేయాలి: కాసేపటి తర్వాత బిగ్‌బాస్ మరో టాస్క్ పెట్టాడు. "ఇప్పటివరకూ మీరు మీ చేతులకి కాళ్లకి ఉన్న దమ్మేంటో చూపించారు. ఇప్పుడు మీ నోటికి ఉన్న దమ్మును కూడా చూపించే సమయం వచ్చింది. అందుకు మీకు ఇస్తున్న ఛాలెంజ్ హ్యూమన్ ఫౌంటైన్. ఈ టాస్కులో ప్రతి గ్యాంగ్ నుంచి ఐదుగురు పాల్గొంటారు. బజర్ మోగినప్పుడల్లా ప్రతి గ్యాంగ్ నుంచి ఒక్కో పోటుగాడు ముందుకొచ్చి తమ నోటిలో నీళ్లు నింపుకొని ఎదురుగా ఉన్న బకెట్స్‌లో నీటిని స్ప్రే చేయాలి. ఎవరి స్ప్రే అయితే దూరంగా ఉన్న బకెట్లో పడుతుందో ఆ పోటుగాడు ఆ రౌండ్ విజేత అవుతాడు. ఇలా ఏ గ్యాంగ్ ఎక్కువ రౌండ్స్ గెలిస్తే ఆ గ్యాంగ్ విజేతగా నిలుస్తుంది. మీ గ్యాంగ్ లీడర్‌కి 1000 బీబీ క్యాష్ వస్తుంది" అని బిగ్‌బాస్ చెప్పాడు.
మోకాళ్ల మీద కూర్చున్న మాధురి టీమ్: ఈ టాస్కులో కూడా సంజనా బ్లూ టీమ్ గెలిచి షాకిచ్చింది. "విన్నింగ్ గ్యాంగ్ సెలబ్రేషన్స్ కోసం గెలిచిన గ్యాంగ్ లీడర్ ముందు ఓడిన గ్యాంగ్ వాళ్లందరూ మోకాళ్లపై ఉండి మీరు తోపు మేము తుప్పాస్ అని చెబుతూ సలాం కొట్టాల్సి ఉంటుంది" అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో సంజన ముందు మాధురి టీమ్ అంతా కూర్చొని చెప్పినట్లే చెప్పింది. కాసేపటికి ఎవరి దగ్గర ఎంత క్యాష్ ఉందో చెప్పాలని బిగ్‌బాస్ అడిగాడు. తనూజ దగ్గర అందరికంటే అత్యధికంగా 7వేల బీబీ క్యాష్ ఉంది. ఇక రాము రమ్యల దగ్గర జీరో ఉంది. దీంతో "రాము-రమ్య దగ్గర ఉన్న డబ్బు సున్నా కనుక వారు కంటెండర్ రేసు నుంచి తప్పుకుంటారు. వాళ్ల ఫొటోలకి మాలలు వేయండి" అని బిగ్‌బాస్ చెప్పాడు.
అప్పుడే బ్రేకప్ - అప్పుడే ప్యాకప్: రీతూ దగ్గర క్యాష్ తక్కువ ఉండటంతో మాధురి.. ఆపోజిట్ టీమ్ అయినా సరే డీమాన్‌ని సాయం అడిగింది. అయితే ఈ విషయంలో రీతూ-డీమాన్‌కి చిన్న గొడవ అయింది. "నేను ఇక నీతో మాట్లాడను. నువ్వు నాతో మాట్లాడకు" అంటూ రీతూ వెళ్లిపోయింది. కట్ చేస్తే డీమాన్ వాష్‌రూమ్‌లోకి వెళ్లి బాధపడుతుంటే రీతూ బయట నిల్చొని డోర్ కొడుతూ పిలుస్తుంది. డీమాన్ బయటికి రాగానే సారీ చెప్పి రీతూ హగ్ ఇచ్చేసింది.
హౌజ్‌లోకి పోలీసులు ఎంట్రీ: ఈ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు అమర్‌దీప్-అర్జున్ అంబటి పోలీస్ గెటప్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. "మేము వచ్చిన మెయిన్ రీజన్ ఇద్దరు డాన్స్‌ని పట్టుకోవడానికి వచ్చాం. సంజన సైలెన్సర్, మాస్ మాధురి ఎక్కడా" అంటూ అర్జున్ అడిగాడు. వీళ్లు వస్తున్నారని బిగ్‌బాస్ ముందే చెప్పడంతో సంజన-మాధురి లోపల దాక్కున్నారు. "ఇక వాళ్లిద్దరూ లేరు సార్" అని హౌస్‌మేట్స్ అంతా వాళ్లని కాపడటానికి ట్రై చేశారు. ఇలా కాదని మొత్తం హౌస్ అంతా తిరుగుతూ అమర్-అర్జున్ సెర్చ్ చేశారు. తర్వాత ఎవరైనా ఏమైనా కొట్టేశారా.. అని అడిగితే "మేము ఏం కొట్టేయలేదు సార్" అంటూ ఇమ్మూ అతి వినయంగా చెప్పాడు. దీంతో "హౌజ్‌లో ఏం కొట్టేశారో మాకు తెలుసు సార్. అవి తీసుకొస్తే మీరు ఉంటారు సార్. లేకపోతే మాతో పాటే మెయిన్ డోర్ నుంచి బయటికి వస్తారు సార్" అంటూ అమర్ బెదిరించాడు. తర్వాత ఒక్కొక్కరి బెడ్ దగ్గరికెళ్లి హౌస్‌మేట్స్ దాచిన ఫుడ్ అన్నీ బయటికి తీశాడు అమర్. దీంతో ఎపిసోడ్ పూర్తి అయ్యింది. ఇక నేటి ఎపిసోడ్‌లో కూడా అమర్-అర్జున్ హౌస్‌మేట్స్‌ని ఇంట్రాగేట్ చేయబోతున్నారు.
Bigg Boss 9 Telugu Today Promo: "జెండాలే మీ అజెండా" - బురద టాస్క్‌లో కంటెస్టెంట్ల పాట్లు!
Bigg Boss 9 Telugu Day 45 : మరోసారి నోరుజారిన సంజనా - 'ధమాకా కిక్'లో మాధురి టీమ్ విన్

