Bigg Boss 9 Today Promo : డబ్బులు కొట్టేసిన తనూజ-సుమన్, దివ్య ఫుల్ ఫైర్!
- రెండు టీమ్స్ మధ్య దొంగల టాస్క్ కంటిన్యూ - అరవొద్దంటూ రీతూకి కౌంటర్!

Published : October 22, 2025 at 3:57 PM IST
Bigg Boss 9 Today Promo : బిగ్ బాస్ హౌస్‌లో ఏడో వారం నామినేషన్స్ తర్వాత కెప్టెన్సీ కోసం టాస్కులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే నిన్నటి ఎపిసోడ్లో ఇంటి సభ్యులు రెండు గ్యాంగ్స్‌గా విడిపోయారు. ఈ రెండు టీమ్స్ మధ్య మంగళవారం ఎపిసోడ్లో జరిగిన గోలిసోడా టాస్క్‌లో మాస్ మాధురి టీమ్ గెలిచింది. దాంతో బిగ్‌బాస్.. మాధురి టీమ్‌కు 2వేలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. స్టోర్ రూమ్‌లో సంజన టీమ్ కోసం ఉంచిన డబ్బుల్ని తనూజ-సుమన్ కొట్టేస్తారు. దాంతో ఎవరు ఆ మనీ తీశారని ఆరా తీస్తూ వెతకడం స్టార్ట్ చేస్తుంది సంజన. ఇదే క్రమంలో రీతూ చౌదరి - తనూజ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. డే 44 ప్రోమోలో ఇంకా ఏముందో ఇప్పుడు చూద్దాం.
ప్రోమోలో ఏం ఉందంటే?
బిగ్ బాస్ -9 డే45 ఎపిసోడ్ మొదటి ప్రోమోలో నిన్నటి దొంగల టాస్క్ కంటిన్యూ అయింది. ప్రోమో స్టార్టింగ్‌లో "నేను చూశా సుమన్ అన్న తీయడం.. మళ్లీ నా దగ్గరకు వచ్చి నాకే చెబుతున్నాడు చూడూ.. అది నాకు ఇంకా చిరాగ్గా ఉంది" అంటూ రీతూ చౌదరి ఎవరితోనో అంటోంది. నెక్ట్స్ సీన్లో తనూజ, సుమన్ శెట్టి ఇద్దరూ కలిసి దొంగతనం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇదే క్రమంలో తనూజ.. సుమన్ దగ్గరకు వచ్చి నీ దగ్గర 3 నోట్స్ ఉన్నాయా అని అడుగుతుంది. అప్పుడు సుమన్ షర్ట్ లోపల ఉన్న మనీ చూపిస్తాడు. దాంతో సరే పెట్టుకో అంటుంది తనూజ.
తర్వాత దివ్య దగ్గరికి వెళ్లిన రీతూ చౌదరి డబ్బుల చోరీ గురించి అడుగుతుంది. దానికి దివ్య.. టీమ్ మొత్తం కంటెండర్స్ అవుతారా? లేదు కదా అంటూ సమాధానం ఇస్తుంది. వెంటనే రీతూ.. ఎవరు డబ్బు లేపేస్తే.. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్లే కంటెండర్స్ అవుతారా? అంటూ దివ్యను ప్రశ్నిస్తుంది. అప్పుడు ఎందుకవుతారు అలాగా.. అని దివ్య అడిగితే.. నేను ఏమైనా పోయి వాళ్లకి ఇస్తానా.. అంటూ తిరిగి సమాధానమిస్తుంది రీతూ చౌదరి.
Bigg Boss 9 Day 44 Review : 'గోలిసోడా పోరు'లో మాధురి టీమ్ విన్ - ఇమ్మూ స్వీట్ పాయిజన్ అంటూ!
రీతూ Vs తనూజ..
సంజన లొల్లి చేస్తుండటంతో సుమన్ డబ్బులు ఇచ్చేనా అని అంటుంటాడు. అప్పుడు తనూజ గేమ్‌యే దొంగతనం కదా.. నువ్వు ఇచ్చేస్తే ఏమ్ యూజ్.. అంటూ సలహా ఇస్తుంది. ఇక ఇదే విషయంపై వంటగదిలో రీతూ-తనూజకి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మరి ఇంకెందుకు టీమ్.. తీసేయనా ఈ క్లాత్(టీమ్ క్లాత్) అంటూ రీతూ తనూజపై గట్టిగానే ఫైర్ అవుతుంది. దానికి తనూజ ఏమాత్రం తగ్గకుండా.. మళ్లీ మళ్లీ అరవకు రీతూ.. అంటూ వాయిస్ రైజ్ చేస్తుంది. అప్పుడు రీతూ.. నేను అరవట్లేదు నువ్వు అరుస్తున్నావ్.. నేను అరిచానా నేను మాట్లాడాను.. అని అంటుంది.
ప్రామిస్ చేయమన్న మాధురి.. వెనకడుగేసిన తనూజ..
అనంతరం దివ్వెల మాధురి తనూజని పక్కకి తీసుకెళ్లి డైరెక్ట్‌గా ఇలా అడుగుతుంది. "నువ్వు నిజంగా తీయలేదా.. నీకేం సంబంధం లేదా.. నీకు ఎవరి మీద డౌట్ కూడా లేదా.." అంటూ మాధురి అడుగుతుంది. దానికి తనూజ.. లేదు నేను నిజంగా తీయలేదు.. అని చెప్పడంతో.. సరే ప్రామిస్ చెయ్.. అని అంటుంది మాధురి. అప్పుడు ప్రామిస్ ఎందుకు వేయాలిరా గేమ్ విషయానికి.. అంటూ వెనకడుగువేస్తుంది తనూజ. ఇక అందరికీ అనుమానం రావడంతో తనూజ డబులన్నీ తీసి కవర్లో దాస్తుంది.
బయటకు వెళ్లాక 2 వేలు ఇస్తాలే..
నెక్ట్స్ రాము రాథోడ్.. సుమన్ దగ్గరకు వెళ్లి అన్నా నాకు 200 కావాలన్నా.. లేదంటే నేను స్ట్రైక్ చేస్తా చూడూ అంటాడు. అప్పుడు సుమన్ శెట్టి.. బయటకు వెళ్లాక 2 వేలు ఇస్తాలే.. అంటూ ఫన్నీ కామెంట్ చేస్తాడు. ఇంతలో సంజన రూమ్ లోపలికి వచ్చి దివ్య మీ దగ్గర ఉన్నాయా డబ్బులు.. అని అడుగుతుంది. "ఎవరు చెప్పారు" అని దివ్య అడగ్గా.. మిమ్మల్ని తీసేసి రేపు గేమ్ ఆడతామని సంజన అంటుంది. దానికి దివ్య.. "ఓకే మీరేమైనా చేస్తే అది ఫన్, కంటెంట్.. పక్కనోళ్లు చేస్తే మాత్రం అన్‌ఫెయిర్.. మీరు గేమ్స్ ఆపేస్తారు.. మీకు ఒక రూల్, వేరే వాళ్లకి ఒక రూల్.." అంటూ సంజనపై ఫైర్ అవుతుంది. దాంతో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి, గేమ్ అయిపోయే వరకు ఏ టీం దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి? ఎవరు కంటెండర్ షిప్నకి అర్హులు అవుతారో తెలియాలంటే ఇవాళ్టి ఫుల్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Bigg Boss 9 Nominations Episode : సేవింగ్ పవర్‌తో బతికిపోయిన అయేషా - ఈ వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే!
Bharani Elimination: భరణి ఎలిమినేషన్‌ను శాసించిన 'పవరాస్త్ర' - ఆ ముగ్గురికి సలహాలు - అతనికి సారీ!

