Bigg Boss 9 Today Promo : ఫన్నీ "గ్యాంగ్ లీడర్స్" - ఇమ్మూ, తనూజ మధ్య కల్యాణ్ చిచ్చు!
- రసవత్తరంగా బిగ్ బాస్ ఏడో వారం గేమ్ - తనూజ, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం!

Published : October 21, 2025 at 4:09 PM IST
Bigg Boss 9 Telugu Day 44 Promo : ఇన్ని రోజులు తనూజ, ఇమ్మూ మధ్య నడిచిన ఓ క్యూట్ ట్రాక్‌కు బ్రేకులు పడ్డట్టున్నాయి! అటు గ్యాంగ్ లీడర్స్ టాస్క్ ఫన్నీ ఫన్నీగా సాగినట్టుగా ఉంది! తాజాగా విడుదలైన డే 44 ఎపిసోడ్‌కు సంబంధించిన రెండు ప్రోమోలు ఈ విషయాలను చెప్పకనే చెబుతున్నాయి. ఇంకా ఈ ప్రోమోల్లో ఏముందో ఇప్పుడు చూద్దాం.
మొదటి ప్రోమోలో ఏముంది?
నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన బెలూన్ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్‌కు ఐదు నామినేషన్స్ టికెట్స్ వచ్చాయి. అప్పుడు ఇమ్మూ-కల్యాణ్‌కు మధ్య జరిగిన ఓ డిస్కషన్లో తనూజను నామినేట్ చేస్తానని తన వద్ద పాయింట్స్ ఉన్నాయని చెప్పాడు కల్యాణ్. కానీ, తనూజను నామినేట్ చేయకుండా సంజనను నామినేట్ చేశాడు. కల్యాణ్ చేసిన ఆ మోసం ఇవాళ్టి ఎపిసోడ్లో తనూజ, ఇమ్మూకు మధ్య చిచ్చు పెట్టినట్లు ప్రోమోలో తెలుస్తోంది.
"వాడు(కల్యాణ్) నన్ను నామినేట్ చేయలేదని.. లేచి వాయిస్ రైజ్ చేసి మరీ మాట్లాడడం ఏంటో నాకు అర్థం కాలేదు" అంటూ దివ్య నిఖిత వద్ద తన బాధ వ్యక్తం చేసింది తనూజ. "నాకు అర్థమే కాలేదు ఆ పాయింట్" అని అంటున్న క్రమంలో.. ఇమ్మాన్యుయేల్ వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. "నువ్వు మాట్లాడకు" అంటుంది తనూజ. దాంతో ఇమ్మాన్యుయేల్.. కల్యాణ్ అనేవాడు నా దగ్గర తనూజను నామినేట్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయని అన్నాడు అందుకే అతనికి నామినేషన్ టికెట్ ఇచ్చానని దివ్యకి చెబుతాడు.
సేఫ్ గేమ్ అడుతున్నావంటూ తనూజ ఫైర్..
తర్వాత వెంటనే తనూజ రియాక్ట్ అవుతూ అది కూడా ఒక్కరికి కాదు.. నన్ను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరికీ ఇచ్చాడు అంటూ కోపంతో ఊగిపోతుంది. అప్పుడు ఇమ్మూ.. ఈ వారం నా నామినేషన్స్ పాయింట్ నీ మీదనే ఉంది. అందుకే ఇచ్చాను అంటూ చెబుతాడు. అదే చెప్పాల్సిందిగా అని తనూజ అనగా.. "అదేగా చెప్పాను ఇప్పుడు" అంటూ రిప్లై ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. తర్వాత నాకు నీది సేఫ్ గేమ్ అనిపించిదంటూ ఇమ్మూ అనేసరికి.. నీది కూడా నాకు సేఫ్ గేమ్ అనిపిస్తుందని కౌంటర్ ఇచ్చింది తనూజ. అయితే, నన్ను నామినేట్ చేయ్.. నేనేం వద్దని చెప్పడం లేదు కదా.. అన్నాడు ఇమ్మూ. అలా ఇద్దరి మధ్య వాదన పెరిగిపోయింది.
"తనూజకి రమ్యని నామినేట్ చేయాలని ఉంది.. రమ్యకి తనని చేయాలని ఉంది. అందుకే, ఒకరికిచ్చి ఇంకొకరికి ఇవ్వకుంటే పార్షియాలిటీ చూపించినట్లు ఉంటుందని ఇద్దరికి ఇచ్చా. వాళ్లూ వాళ్లూ చూసుకుంటారు కదా.. మధ్యలో నాకేంటి?" అని ఇమ్మూ దివ్య నిఖితతో అన్నాడు. అది విన్న తనూజ సూపర్ గేమ్ అంటూ చప్పట్లు కొట్టింది. దానికి ఇమ్మాన్యుయేల్ కూడా ఏమాత్రం తగ్గకుండా.. వావ్ సూపర్.. మేమూ కొడుతా చప్పట్లు అంటూ గట్టిగానే చప్పట్లు కొట్టాడు. తర్వాత ఇక్కడ నుంచి వెళ్లు అని తనూజ అంటే.. నువ్వు వెళ్లు తనూజా అంటూ ఇమ్మూ కూడా అదే స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు.
Bigg Boss 9 Nominations Episode : సేవింగ్ పవర్‌తో బతికిపోయిన అయేషా - ఈ వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే!
ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసింది?..
"కాసేపటికి ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసిందీ.. ఇలాంటి వ్యక్తి కోసమా నేను నిలబడింది అని నాకు బాధ కలిగింది" ఇమ్మూ అంటాడు. అది విన్న తనూజ.. ఇక్కడ ఎవ్వరూ ఎవరి కోసం నిలబడలేదు. ఎవ్వరూ ఎవరి కోసం సపోర్ట్ చేయలేదు అని అంటుంది. అలాంటప్పుడు.. 'రింగ్ గేమ్‌లో నా దగ్గరకు వచ్చి.. నాకు ఈ హౌస్‌లో నువ్వు తప్ప ఎవ్వరూ లేరని ఎందుకు అన్నావ్ చెప్పూ' అంటూ ఇమ్మూ నిలదీశాడు.
దానికి తనూజ రియాక్ట్ అవుతూ.. ఏయ్ నీతోనే కాదు.. రీతూతో కూడా అలాగే అన్నా అని వాదిస్తుంది. అప్పుడు ఇమ్మూ కూడా తగ్గకుండా అదీ నీ గేమ్.. నీ అవసరాన్ని బట్టి.. ఒక్కో సందర్భంలో ఒక్కోలా మాట్లాడతావ్ మాట.. అంటూ గట్టిగానే ఫైర్ అవుతాడు. ఎన్ని గేమ్‌లలో సపోర్ట్ చేయలేదు. వాటర్ గేమ్‌లోనూ నీకు సపోర్ట్ చేసి.. సేఫ్ గేమ్ ఆడినోడినయ్యానంటూ ఇమ్మూ ఆవేదన వ్యక్తం చేశాడు. నా పక్కనున్న వాళ్లకి పోయకుండా నీకోసం వెనక ఎక్కడో ఉన్న వాళ్లకి పోశా.. అదీ నీకోసం నేను తీసుకున్న స్టాండ్ అని ఇమ్మూ అన్నాడు. దాంతో ప్రోమో ఎండ్ అయింది.
మరో ప్రోమోలో "బిగ్ బాస్ ఇంటి పరిసరాల్లో చాలా కాలంగా రెండు గ్యాంగ్స్ మధ్య జరుగుతున్న బీభత్సమైన పోరును మా సెక్యూరిటీ గార్డ్స్ చాలా ధైర్య సాహసాలు చూపి రూపుమాపారు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ఆ రెండు గ్యాంగ్‌ల లీడర్స్ ఇద్దరూ తప్పించుకున్నారు. ఆ ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ ఉన్న ప్రస్తుత అవతారం ఇప్పుడు మీ అందరికీ ప్రత్యేకంగా చూపించబోతున్నాం" అంటూ బిగ్ బాస్ ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ పెట్టాడు. ఈ గేమ్‌లో ఒక్కొక్కరు ఒక్కో వేషం వేసి ఆకట్టుకున్నారు. ఇలా కొద్దిసేపు గేమ్ ఫుల్ ఫన్ క్రియేట్ చేసింది. అయితే, మొత్తంగా ఇవాళ్టి ఎపిసోడ్ ఆడియన్స్‌కు మంచి మజాను అందించనుంది.
Bharani Elimination: భరణి ఎలిమినేషన్‌ను శాసించిన 'పవరాస్త్ర' - ఆ ముగ్గురికి సలహాలు - అతనికి సారీ!

