Bigg Boss 9 Nominations Episode : సేవింగ్ పవర్‌తో బతికిపోయిన అయేషా - ఈ వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే!
- హాట్ హాట్‌గా ఏడో వారం నామినేషన్స్ - మొత్తం 'ఎనిమిది' మంది! - విజిల్ వేసి వార్నింగ్ ఇచ్చిన తనూజ

Published : October 21, 2025 at 11:04 AM IST
Bigg Boss 9 Telugu Seventh Week Nominations List : బిగ్ బాస్ సీజన్ -9 రోజులు గడిచే కొద్దీ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి ప్రవేశించింది. సోమవారం ఎపిసోడ్లో నామినేషన్స్ హాట్ హాట్‌గా జరిగాయి. ముఖ్యంగా అయేషా- రీతూకి పెద్ద ఫైట్ జరగ్గా, తనూజకు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యకు గట్టి మాటల యుద్ధమే నడిచింది. మొత్తంగా ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది ఉన్నారు. ఇంతకీ, నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది? ఎవరెవరు నామినేట్ అయ్యారు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డే 43 ఎపిసోడ్లో భరణి ఎలిమినేషన్ అనంతరం ఎక్కువ ఎమోషనల్ అవుతున్న దివ్య, తనూజ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఓదార్చుకోవడాన్ని చూపించారు. అనంతరం ఏడో వారం నామినేషన్స్ మొదలయ్యే ముందు ఒక అనౌన్స్మెంట్ చేశాడు బిగ్‌బాస్. కెప్టెన్స్‌గా ఉన్న గౌరవ్-సుమన్ శెట్టిలకు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. అక్కడ రెడ్, బ్లూ అనే రెండు పిల్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక్కో దానికి ఒక్కో పవర్ ఉంటుంది. మీరిద్దరూ వాటిలో మీకు కావాల్సిన పిల్‌ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాడు. అప్పుడు సుమన్‌శెట్టి రెడ్ పిల్, గౌరవ్ బ్లూ పిల్ ఎంచుకున్నారు.
సుమన్‌కి కలిసొచ్చిన లక్..
తర్వాత వాటిని ఓపెన్ చేయగా సుమన్‌కు "సేవ్ యుఆర్ సెల్ఫ్" అని వచ్చింది. దాంతో మీరు ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారని చెప్పాడు బిగ్‌బాస్. అదే గౌరవ్‌కు బ్లూ పిల్ ఓపెన్ చేయగా "సేవ్ సమ్ వన్" అని వచ్చింది. దీంతో మిమ్మల్ని ఇంటి సభ్యులు నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పాడు. అదేవిధంగా.. మీకు వచ్చిన "సేవ్ సమ్ వన్ పవర్" ను మీరు ఎప్పుడు ఉపయోగించాలో సమయం వచ్చినప్పుడు చెప్తా.. అని అన్నాడు బిగ్‌బాస్.
అనంతరం నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు. ఈ వారం నామినేషన్స్ శంఖారావాన్ని ఇమ్మాన్యుయేల్, ఆయేషా పూరించారు. బిగ్‌బాస్ ఇల్లు వేలాది బెలూన్స్‌తో నిండి ఉంది. అక్కడ ఉన్న బెలూన్స్ కొన్నింటిలో నామినేషన్స్ టికెట్స్ దాగి ఉన్నాయి. ఆ టికెట్లు పొందిన వారికి నామినేట్ చేయడానికి కావాల్సిన వివిధ శక్తులు లభిస్తాయి. అలాగే, అందులో వచ్చిన టికెట్స్‌ను ఎవరితో షేర్ చేసుకోవాలో మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరే ఉంచుకోవచ్చు అని చెప్పాడు బిగ్‌బాస్.
తర్వాత ఈ బెలూన్ టాస్కులో ఇమ్మానుయేల్‌కి ఐదు టికెట్స్ (నామినేట్ 2 అనేవి రెండు, నామినేట్ 1 అనేవి మూడు), అయేషాకి మొత్తం మూడు టికెట్లు (నామినేట్ 1 అనేవి రెండు, డైరెక్ట్ నామినేట్ ఒకటి) దొరికాయి. అప్పుడు ఇమ్మూ తన దగ్గరున్న ఐదు టికెట్లలో రీతూ, దివ్యలకు నామినేట్ 2, మిగతావి కల్యాణ్, తనూజ, రమ్యకి ఇచ్చాడు. మరోవైపు అయేషా నామినేట్ 1 అనే టికెట్స్‌ను సాయి, సంజనకి ఇచ్చి.. డైరెక్ట్ నామినేట్ టికెట్ తన దగ్గర ఉంచుకుంది.
లవ్ కంటెంట్ కోసమే వచ్చావ్..
అనంతరం అయేషా డైరెక్ట్ నామినేషన్‌గా రీతూని చేస్తున్నా బిగ్‌బాస్ అని చెప్పి.. ఫోమ్ ఫేస్‌కి పూసింది. కారణం వచ్చేసి.. అని అయేషా మొదలుపెట్టడంతో ఒక నిమిషం.. అని రీతూ అంది. దానికి అయేషా నీకోసం అందరూ వెయిట్ చేయాలా..? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్లుగా తుడుచుకునేలా ఉంటే అది ఎందుకు పెట్టారు చెప్పు.. అంటూ వాదించింది అయేషా. మరి ఎలా మాట్లాడాలి చెప్పు. నేను మాట్లాడుతున్నానో లేదో తెలియాలి కదా.. అని అంది రీతూ చౌదరి. "నువ్వు నీ ఓవరాక్షన్ నాకు ఈ ఇంట్లో అస్సలు నచ్చలేదు. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం.. అది చాలా సేఫ్ ప్లే కనుక నాకు నచ్చలేదు" అని కామెంట్ చేసింది అయేషా. దాంతో వెంటనే రీతూ.. "నేను చెప్పానా.. లవ్ చేస్తున్నానని.. లవ్ చేస్తూ తిరుగుతున్నానని" అంటూ ఫైర్ అయింది. అప్పుడు అయేషా.. నాకు ఒక ఆడియన్‌గా అలా కనిపించింది.. నా రీజన్ నాకు ఉంది.. మిగతావాళ్లంతా చూస్తున్నారు రీతూ నేనేం ఫూల్ కాదు.. నాకు అయితే నీ ఓవరాక్షన్ నచ్చలేదు. నువ్వు ఇక్కడుంటే బాలేదు. అందుకే నువ్వు బయటికెళ్లిపోవాలని నామినేట్ చేస్తున్నాను.. అని చెప్పేసి వెళ్లి కూర్చుంది అయేషా.
దివ్య Vs అయేషా..
తర్వాత దివ్య తనకు వచ్చిన నామినేషన్ 2 టికెట్లో భాగంగా ముందుగా అయేషాని నామినేట్ చేసింది. రెండో నామినేషన్‌గా సాయిని సెలెక్ట్ చేసింది దివ్య. ఎప్పుడూ మీ ఒపీనియన్‌యే రైట్ అనే ఫీలింగ్‌లో ఉంటారనిపిస్తుంది నాకు అంటూ కారణం చెప్పింది. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య కాస్త డిస్కషన్ జరిగింది. దివ్య తర్వాత రీతూ తనకు వచ్చిన నామినేషన్ 2 టికెట్లో భాగంగా అయేషాని ముందుగా నామినేట్ చేసింది. ఇదే క్రమంలో మరికొంతసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. తన రెండో నామినేషన్‌గా రాముని సెలక్ట్ చేసింది రీతూ చౌదరి. నువ్వు నాకు ఈ మధ్య అసలు ఎక్కడా కనిపించట్లేదని అంది రీతూ. దీనికి రాము చాలా సేపు వాదించాడు.
యాక్టింగ్ ముసుగులో ఉన్నారంటూ రమ్య ఫైర్..
అనంతరం రమ్య తనూజని నామినేట్ చేసింది. మీరు ఇంట్లో యాక్టింగ్ చేస్తున్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా మాట్లాడేసరికి నీ వయసుకు తగ్గట్లు నువ్వు మాట్లాడు అని తనూజ అంటుంది. అప్పుడు వెంటనే రమ్య కౌంటర్‌గా మీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అని అంది రమ్య. దీంతో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ తనూజ సీరియస్ అయింది. ఇలా ఇద్దరి మధ్య కాసేపు పెద్ద ఫైట్ జరిగింది. తర్వాత శ్రీనివాస్.. కల్యాణ్‌కి ఫోమ్ పూసి నామినేట్ చేశాడు. సంజనా దివ్యని నామినేట్ చేసింది.
Bharani Elimination: భరణి ఎలిమినేషన్‌ను శాసించిన 'పవరాస్త్ర' - ఆ ముగ్గురికి సలహాలు - అతనికి సారీ!
విజిల్ వేసి మరీ వార్నింగ్ ఇచ్చిన తనూజ..
అనంతరం తనూజకు ఛాన్స్ రావడంతో రమ్యకి వార్నింగ్ ఇచ్చి మరీ నామినేట్ చేసింది. ఒకరిని హర్ట్ చేయాలని, ఇంకొకరికి మంట పెట్టాలని వచ్చావా? అంటూ తనూజ అడగ్గా.. నీలాగా ఒకరు వెళ్లిపోతే ఒకరితో బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదంటూ కౌంటర్ ఇచ్చింది రమ్య. అప్పుడు మళ్లీ రియాక్ట్ అయిన తనూజ.. నామినేషన్స్‌లో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని మాధురి చెప్పిన డైలాగ్‌నే రమ్యకి చెప్పింది. అంతేకాకుండా, రెండు చేతులు కలిస్తే వచ్చే చప్పట్ల సౌండ్ కన్నా.. ఒక్క చేతితో వేసే విజిల్ సౌండ్ గట్టిగా వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది తనూజ. ఇలా ఇద్దరూ వాదించుకున్నారు. ఇక చివరగా కల్యాణ్ సంజనను పలు కారణాలు చెబుతూ నామినేట్ చేశాడు. ఇదే క్రమంలో ఇమ్మూ, కల్యాణ్ మధ్య కాసేపు డిస్కషన్ జరుగుతుంది. ఆపై సంజన కూడా కల్యాణ్‌పై ఫైర్ అయ్యింది.
సేవింగ్ పవర్‌తో బతికిపోయిన అయేషా..
అలా నామినేషన్స్ అన్నీ ముగిసేసరికి.. లిస్ట్‌లో 9 మంది చేరారు. రీతూ చౌదరి, తనూజ, దివ్య, కల్యాణ్, సంజన, రమ్య, రాము, సాయి, అయేషాలు ఉన్నారు. అప్పుడు బిగ్‌బాస్ కెప్టెన్ గౌరవ్‌ని తన దగ్గరున్న సేవ్ ఎనీ ఒన్ పవర్‌ని ఉపయోగించాలని చెప్పాడు. ఆ టైమ్‌లో గౌరవ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అయేషాని సేవ్ చేస్తున్నట్లుగా చెప్పాడు. దాంతో అయేషా ఏడో వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యింది.
నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే..
ఏడో వారం నామినేషన్స్ పూర్తయ్యే సరికి మొత్తం ఎనిమిది మంది లిస్ట్‌లో ఉన్నారు. వీరిలో వైల్డ్‌కార్డ్స్ నుంచి ఇద్దరు ఉండగా, మిగతావాళ్లు ఆరుగురు ఉన్నారు. కల్యాణ్, తనూజ, రీతూ చౌదరి, రాము, దివ్య, సంజన, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారని బిగ్‌బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ఎండ్ అయింది.

