ETV Bharat / entertainment

Bigg Boss Srija: అంతా నాటకమే! - బిగ్​బాస్ పై దమ్ము శ్రీజ ఫైర్​!

- "రీ-ఎంట్రీ" తీరుపై అసహనం - ఆ మరక వదిలించుకునేందుకేనని ఆరోపణ!

Bigg Boss  9 Telugu Dammu Srija
Bigg Boss 9 Telugu Dammu Srija (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 3, 2025 at 4:38 PM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Dammu Srija: బిగ్​బాస్​ సీజన్​ 9 మొదలై దగ్గరదగ్గర 60 రోజులకు చేరుకుంది. ఇన్ని రోజుల ఆటలో ఎన్నో ఎలిమినేషన్లు జరిగాయి. అయితే అందులో అన్​ఫెయిర్​ ఎలిమినేషన్​ అంటే టక్కున గుర్తొచ్చే పేరు దమ్ము శ్రీజ. ఎందుకంటే ప్రేక్షకుల ఓటింగ్​తో సంబంధం లేకుండా ఈమె ఎలిమినేట్​ అయ్యింది. అయితే అలా బయటికి వెళ్లిన శ్రీజను రీ-ఎంట్రీ అంటూ మళ్లీ ఇంట్లోకి పంపించిన బిగ్​బాస్​.. మరోసారి ఎలిమినేట్​ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆడియన్స్​ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయమై దమ్ము శ్రీజ స్పందించింది. ఈ మేరకు ఓ వీడియోను తన యూట్యూబ్​ ఛానల్​లో పోస్ట్​ చేసింది. మరి, ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

బిగ్‌బాస్ సీజన్-9లో గత వారం రీఎంట్రీ పేరుతో హౌజ్ మొత్తం వేడెక్కింది. దమ్ము శ్రీజ-భరణి ఇద్దరినీ హౌజ్​లోకి రప్పించి.. కొన్ని టాస్కులు పెట్టారు బిగ్​బాస్​. కేవలం టాస్క్​లు మాత్రమే కాకుండా.. వీరిద్దరిలో ఎవరిని మీరు హౌజ్​లో చూడాలనుకుంటున్నారో ఓట్ చేయండి అంటూ 24 గంటల పాటు పోలింగ్ కూడా పెట్టారు. చివరికి ఈ పోలింగ్‌లో భరణికి ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ శ్రీజని మరోసారి ఎలిమినేట్ చేశారు. అయితే మొదటిసారి ఎలిమినేట్​ అయినప్పుడు జర్నీ వీడియో లేకుండానే శ్రీజ ఇంటి ముఖం పట్టింది. రెండో సారైనా వీకెండ్ ఎపిసోడ్‌లో శ్రీజని స్టేజ్ మీదకి రప్పించి జర్నీ వీడియో వేసి ఎలిమినేషన్​ ప్రక్రియను పూర్తి చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేకుండానే మరోసారి బయటికి పంపించింది బిగ్​బాస్​ టీమ్​. ఈ క్రమంలో బిగ్​బాస్​ నిర్ణయాలపై ఫైర్​ అయ్యింది శ్రీజ. అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ వరకూ తన జర్నీ ఎలా సాగిందో వివరిస్తూ ఓ వీడియోని తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది.

అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం: బిగ్‌బాస్ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఓటింగ్‌తో సంబంధం లేకుండా వైల్డ్ కార్డ్స్ ఇష్టంతో తనని ఎలిమినేట్ చేశారని శ్రీజ చెప్పింది. ఇందుకోసం ఏదో అప్పటికప్పుడూ గేమ్స్ అంటూ పెట్టి మిగిలిన అందరినీ గెలిపించేసి తనని చివరిలో ఉంచారని శ్రీజ చెప్పింది. అసలు వైల్డ్‌కార్డ్స్ నిర్ణయంతో తమని ఎలిమినేట్ చేస్తారని ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని శ్రీజ చెప్పుకొచ్చింది. అసలు ఓటింగ్‌లో టాప్-3లో ఉన్న నన్ను ఎలిమినేట్ చేయాలని ఎందుకు అనిపించిందో అంటూ శ్రీజ ప్రశ్నించింది. అది అప్పటికప్పుడు వాళ్లు(వైల్డ్​కార్డ్స్​) తీసుకున్న నిర్ణయం అని అందుకే AV కూడా తనకి వేయలేదని శ్రీజ మండి పడింది.

అక్కడికి వెళ్లేవరకూ తెలియదు: "వైల్డ్​కార్డ్స్​ వచ్చి నన్ను ఎలిమినేట్ చేసిన విధానం నాకు చాలా బాధగా అనిపించింది. శనివారం నాటి ఎపిసోడ్​లో సంజనా, రీతూకు ఎవిక్షన్​ బోర్డ్​, నాకు డేంజర్​ జోన్​ బోర్డ్​ ఉండే సరికి వాళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్​ అవుతారని, నేను సేవ్​ అవుతానని అనుకున్నా. కానీ అనూహ్యాంగా వైల్డ్​కార్డ్స్​ డెసిషన్​తో ఎలిమినేట్​ అయ్యి స్టేజ్ మీదకి వెళ్లేవరకూ కూడా నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పటికీ ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇస్తున్నారేమో, నన్ను ఏమైనా సీక్రెట్ రూమ్‌లో పెడుతున్నారేమోనని అనుకున్నాను. కానీ వెంటనే బజ్ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి షాకిచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. తర్వాత బిగ్‌బాస్ ఎపిసోడ్స్ కూడా ఏమీ చూడలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ బిగ్‌బాస్ టీమ్ వాళ్లే కాల్​ చేసి ఇలా నామినేషన్స్ చేయాడానికి హౌజ్​లోకి వెళ్లాలి అని రమ్మని పిలిచారు. అయితే అక్కడికి వెళ్లేవరకూ మాకు రీ-ఎంట్రీ ఉందని చెప్పలేదు.

అతని కోసం బలిపశువును చేశారు: తర్వాత హోటల్‌లో ఉండగా రీ-ఎంట్రీ ఉంటుంది అని చెప్పి రెండు వారాలకు సంబంధించిన లగేజ్​ తీసుకున్నారు. నాతో సహా మిగిలిన వారందరి లగేజ్​లూ తీసుకున్నారు. అయితే స్టూడియోకి వెళ్లాక అక్కడ భరణి గారు కూడా ఉండటం చూసి షాకయ్యా. ఎందుకంటే నన్ను ఆడియన్స్ ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేశారు. అందుకే నన్ను పిలిచారు అనుకున్న. కానీ భరణి గారిని ఎందుకు రీ-ఎంట్రీకి పిలిచారు. అలా అయితే మిగిలిన వాళ్లని కూడా పిలవాలి కదా? ఎందుకంటే వాళ్లందరూ ఆడియన్స్​ ఓటింగ్​ మీద డిపెండ్​ అయ్యి ఎలిమినేట్​ అయినవారే కదా. అందరినీ పిలిచి ఓటింగ్​ పెట్టి ఎవరికి ఎక్కువ వస్తే వారిని ఉంచి మిగిలిన వారిని పంపిస్తే సరిపోయేది.

కానీ కేవలం భరణి గారినే పిలిచి ఫేవరిజం చూపించారు. పైగా నేను, భరణి గారు హౌజ్​లోకి వెళ్లేటప్పుడు అక్కడ గేటు ఓపెన్ చేసే వాళ్లు భరణి గారికి ఒక హింట్ కూడా ఇచ్చారు. ముందులా కాదు ఈసారైనా గేమ్ బాగా ఆడండి. మీరు ఉంటారు కాబట్టి అన్నారు. అప్పుడే నేను అనుకున్నా ఏదో ఒకటి చేసి నన్ను పంపించేస్తారని. అలానే జరిగింది. అంతేకాదు ఒక్కరోజు ఓటింగ్​ ఉందన్న సంగతి కూడా తెలియదు. అయితే ఈ రీ-ఎంట్రీ ప్రాసెస్​ చూసిన తర్వాత నా ఎలిమినేషన్ వల్ల బిగ్‌బాస్‌పై పడిన మరకని వదిలించుకోవడానికే మళ్లీ పిలిచి నాటకం ఆడారు. కేవలం భరణి రీ-ఎంట్రీ కోసం నన్ను బలిపశువును చేశారు. కనీసం రెండోసారి కూడా ఎలాంటి AV లేకుండా నన్ను పంపించేశారు. ఇది న్యాయమా? నేను కోరుకునేది ఒక్కటే నా జర్నీ వీడియో మాత్రం ఇవ్వండి చాలు" అంటూ ఎమోషనల్ అయింది దమ్ము శ్రీజ.

Bigg Boss 8th Week Elimination : దివ్వెల మాధురి ఔట్​ - 3 వారాలకు భారీగా రెమ్యునరేషన్​!

Bigg Boss 9 Today Promo : 'అదుర్స్' స్కిట్​తో అదరగొట్టిన కంటెస్టెంట్లు - పడిపడి నవ్వుకున్న రష్మిక! - తనూజపై నాగ్ సీరియస్!