Bigg Boss 9 Today Promo : 'అదుర్స్' స్కిట్‌తో అదరగొట్టిన కంటెస్టెంట్లు - పడిపడి నవ్వుకున్న రష్మిక! - తనూజపై నాగ్ సీరియస్!
సన్డే ఫన్‌డేగా బిగ్ బాస్ హౌస్ - సందడి చేసిన 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ టీమ్!

Published : November 2, 2025 at 3:54 PM IST
Bigg Boss 9 Sunday Promo : బిగ్ బాస్ సీజన్ 9లో ఎనిమిదో వారం ఎలిమినేషన్‌కు వేళైంది. ఇప్పటికే ఈ వారం ఎవరు హౌస్ వీడనున్నారో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నప్పటికీ అధికారికంగా ఎవరు అనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. ఇదిలా ఉంటే ఇవాళ సన్డే ఫన్డే కావడంతో హౌస్ సందడిగా మారిపోయింది. తాజా విడుదలైన డే 56 మొదటి ప్రోమోలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక, హీరో దీక్షిత్ బిగ్ బాస్ స్టేజ్‌పై కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా హౌస్ మేట్స్ పోకిరి, అదుర్స్ సినిమాల్లో కొన్ని ఐకానిక్ సీన్స్ రీక్రియేట్ చేసి నువ్వులు పూయించారు కంటెస్టెంట్స్. మరి, అందుకు సంబంధించిన ప్రోమోపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
బిగ్ బాస్ 9 సన్డే మొదటి ప్రోమోలో కింగ్ నాగ్ అద్దిరిపోయే లుక్‌లో మాస్ ఎంట్రీ ఇచ్చారు. నాగ్ని చూడగానే సంజన కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ అరిచింది. అప్పుడు వెంటనే నాగ్.. అంటే ఇప్పటిదాకా బ్యాక్ లేదా అంటూ పంచ్ వేశారు. దానికి సంజన.. అంటే నిన్న పోయి ఇవాళ బ్యాక్ సార్ అని సమాధానం ఇచ్చింది. అనంతరం "ది గర్ల్‌ఫ్రెండ్" సినిమా ప్రమోషన్స్ కోసం హీరో దీక్షిత్, హీరోయిన్ రష్మిక బిగ్ బాస్‌కి వచ్చారు. అప్పుడు రష్మికను ఆప్యాయంగా ఆహ్వానించిన హోస్ట్ నాగార్జున.. రష్మిక నువ్వు ఒక విషయం చెప్పు రష్మికలా వచ్చావా.. గర్ల్‌ఫ్రెండ్‌లా వచ్చావా.. అంటూ అడిగారు. దానికి రష్మిక నవ్వుతూ అందరి గర్ల్‌ఫ్రెండ్‌లా వచ్చాను అంటూ సమాధానం ఇచ్చింది. తర్వాత దీక్షిత్ నిన్ను అడుగుతున్నాను ఇలా గర్ల్‌ఫ్రెండ్ నీకు లైఫ్‌లో దొరికితే ఏం చేస్తావు.. అని అడుగుతారు నాగ్. అప్పుడు దీక్షిత్ ఎలాగైనా ఆమెని సేవ్ చేసుకుంటా అని చెబుతాడు. నెక్ట్స్ రష్మికని చూడగానే ఇంటి సభ్యులందరూ చాలా ఎక్సైట్ అవుతారు. రీతూ ఐతే.. ఐ లవ్యూ రష్మిక అంటూ అరుస్తుంది.
రావు రమేష్ డైలాగ్‌తో అదరగొట్టిన ఇమ్మూ..
అనంతరం హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు రష్మికను పరిచయం చేస్తూ.. "మీ ముందు నేషనల్ క్రష్మిక ఉంది. ఇప్పుడు మీ పెర్ఫామెన్స్‌ను జడ్జ్ చేస్తుంది. మీకు ఒక క్లిప్ చూపిస్తాను దాన్ని రీక్రియేట్ చేయాలి" అంటూ హౌస్‌మేట్స్‌కు చెబుతారు నాగార్జున. ఆ క్లిప్‌లో డిమోన్-రీతూలకు సరిగ్గా సరిపోయే ఒక సీన్ చూపించారు. తర్వాత ఇమ్మాన్యుయేల్ లేచి ఆ సీన్ గురించి.. "సిగ్గుండాలిరా యుద్ధం కూడా ఆరు తర్వాత ఆపేస్తారు.. నువ్వేంట్రా మార్నింగ్ లేచిన దగ్గరి నుంచి దీనిపైన దాడి చేస్తానే ఉన్నావ్" అంటూ యాజ్ ఇట్ ఈజ్‌గా రావు రమేష్ డైలాగ్‌ని చెబుతాడు. దాంతో అందరూ కాసేపు నవ్వుకుంటారు.
పోకిరి సీన్లో తనూజ-కల్యాణ్..
నెక్స్ట్ తనూజ-కల్యాణ్ పోకిరి సినిమాలో లిఫ్ట్ సీన్ రీక్రియేషన్‌తో ఫన్ క్రియేట్ చేశారు. ఇక ప్రోమో ఎండింగ్లో భరణి, మాధురి, పవన్, రీతూ, ఇమ్మూ అందరూ కలిసి అదుర్స్ సినిమాలోని ఒక సీన్‌ని రీక్రియేట్ చేసి ఫుల్ ఫన్ అందించారు. హౌస్ మేట్స్‌తో పాటు హోస్ట్ నాగ్, రష్మిక అయితే తెగ నవ్వుకున్నారు. ఈ సీన్లో ముందుగా డిమోన్ పవన్.. అబ్బా బామ్మ ఇక చెప్పక తప్పట్లేదు చెప్తున్నాను.. ఇదిగో ఈ చంద్రకళని(రీతూను చూపిస్తూ) మా గురువు గారు ప్రేమించారు.. అంటూ మాధురితో అంటాడు. దానికి మాధురి.. ఎవరూ మన భట్టాచారే.. ఆ వెధవ పొట్టేసుకొని తపాలే ముఖమూ వాడూ ప్రేమ కావాల్సి వచ్చిందా ప్రేమా.. అంటూ డైలాగ్ కొడుతుంది.
Bigg Boss 9 Telugu: డేంజర్ జోన్లో ఆ ముగ్గురు! - ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?
బ్రహ్మానందంలా మారిపోయిన భరణి..
అనంతరం భరణి బ్రహ్మానందంలా మారిపోయి.. పొట్ట ఉన్నవాళ్లు ప్రేమించకూడదా అండి.. నా జాబేమిటి.. కూర్చొని చేసే పని.. గుప్పెడంత పొట్ట ఉండదా.. ఏ ఇక్కడున్న వాళ్లందరికీ సిక్స్ ప్యాక్‌లు ఉన్నాయా ఏంటి.. అని అంటాడు. దానికి రీతూ.. ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు మ్యారేజ్ గురించి.. అని అంటుంది. అప్పుడు భరణి.. నువ్వు అలా హార్ష్‌గా మాట్లాడకు చందూ.. నేను హర్ట్ అవుతాను.. అంటూ సిగ్గుపడతాడు.
పెద్ద మనసుతో ఈ పెద్దావిడకి మరో జీవితం ఇవ్వాలనుకోవడం తప్పా అండి.. అంటూ ఇమ్మానుయేల్ అనగానే సిగ్గుపడిపోతుంది సంజన. దానికి భరణి.. మీరు అలా సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది.. అంటూ డైలాగ్ కొడుతాడు. దాంతో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇలా అందరూ కలిసి అదుర్స్ సీన్‌ను మాత్రం అదుర్స్ అనిపించేలా చేశారు సెకండ్ ప్రోమోలో తనూజకి కూడా చాలా సింపుల్‌గా క్లాస్ పీకాడు హోస్ట్ నాగార్జున. మొత్తానికి ఇవాళ్టి ఎపిసోడ్ ఆడియన్స్‌కు ఫుల్ ఫన్ను అందించనుంది.
Bigg Boss 9 Day 55 Review : "గురివింద గింజలా మాట్లాడకు సంజనా" - మోకాళ్లపై క్షమాపణ కోరిన డిమోన్!
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా దివ్య - భరణిపై ట్రోలింగ్!

