బిగ్‌బాస్ సీజన్ 10 - హౌజ్‌లోకి వెళ్లే "సెలబ్రిటీలు" వీళ్లే! - సోషల్ మీడియాలో వైరల్!
-అతి త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ నయా సీజన్ - సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కంటెస్టెంట్స్ పేర్లు!

Published : August 27, 2026 at 2:33 PM IST
Bigg Boss 10 Telugu Contestant List: బిగ్‌బాస్ పేరు చెబితే చాలా మంది తిట్టుకుంటారు. అయితే ఎంత తిట్టుకున్నా తీరా సీజన్ స్టార్ట్ అయ్యే సమయానికి చూసేందుకు రెడీ అవుతారు. తొమ్మిది సీజన్ల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ తాజాగా కొత్త సీజన్ కోసం ముస్తాబవుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్ 10 ప్రసారం కానుంది. ఇక సీజన్ మొదలవుతుందంటే హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకునేందుకు ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే హౌజ్‌లోకి వెళ్లే సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
కామనర్స్ కోసం అగ్నిపరీక్ష: సాధారణంగా బిగ్‌బాస్ అంటే కాస్త ఫేమ్ ఉన్నవాళ్లను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చి వారితో గేమ్ ఆడిస్తుంటారు. కానీ గత సీజన్లో అగ్నిపరీక్ష ద్వారా కామనర్స్‌ను హౌజ్‌లోకి పంపించారు. అలా ఇంట్లోకి వెళ్లిన వారిలో డెమాన్ పవన్, కళ్యాణ్ పడాల చివరి వరకూ నిలిచారు. ఇక ఆ ఇద్దరిలో కల్యాణ్ విన్నర్ అయ్యి చరిత్ర సృష్టించాడు. ఈసారి కూడా కామనర్స్‌కు అవకాశం కల్పించేందుకు అగ్నిపరీక్ష సీజన్ 2 ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం టాప్ 15 కంటెస్టెంట్స్‌కు వివిధ రకాల టాస్కులు జరుగుతున్నాయి.
సేమ్ ప్రాసెస్: గత సీజన్ మాదిరే ఈసారి కూడా మొత్తం 15 మంది పార్టిసిపేట్ చేస్తున్నట్లు సమాచారం. అందులో తొమ్మిది మంది సెలబ్రిటీలు కాగా, ఆరుగురు కామనర్స్ ఉండనున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. కామనర్స్ విషయం పక్కన పెడితే సెలబ్రిటీ కంటెస్టెంట్లకి సంబంధించిన రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్, ఫిట్నెస్, కామెడీకి కొదవలేకుండా కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసినట్లు బయట టాక్. మరి ఇంట్లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరంటే..
- సీరియల్ నటి దేబ్జానీ
- సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ
- సినీ నటుడు కృష్ణుడు
- విలన్ క్యారెక్టర్ టెంపర్ వంశీ
- జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్‌ప్రసాద్
- సినీ నటుడు అదిత్ ఈశ్వరన్
- జబర్దస్త్ కమెడియన్ నరేష్
- యాంకర్ వర్షిణి సౌందరాజన్
- కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి
- ఈ తొమ్మిది మందితో పాటు సీరియల్ నటులు సౌందర్య రెడ్డి, సుహాసిని, చైత్ర రాయ్ పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కామనర్స్ వీళ్లే: సెలబ్రిటీలు కాకుండా అగ్నిపరీక్ష సీజన్ 2లో సెలెక్ట్ అయిన మరో ఆరుగురు కూడా హౌజ్‌లోకి వెళ్లనున్నారు. ప్రస్తుతం టాప్ 15లో అమన్ మసూద్, ఝాన్సీ, శ్రష్టి వ్యాకరణి, గాయత్రి, అపూర్వ, షాలినీ, చరణ్, రాజకుమారి, రామకృష్ణ, భాగీ తుళ్లూరి, రోహిత్ నాయుడు, ప్రియాంక, మిథిలేష్, హేమంత్ యాదవ్, దీపక్ సేనాపతి ఉన్నారు. ఈ 15 మందిలో ఆరుగులు ఇంట్లోకి అడుగుపెట్టనున్నారని టాక్. మరికొన్ని రోజుల్లో ఈ లిస్ట్ గురించి క్లారిటీ రానుంది.
సీజన్ 10 ప్రారంభం ఎప్పుడు: గత సీజన్ మాదిరే సెప్టెంబర్‌లో బిగ్‌బాస్ సీజన్ 10 మొదలు కానుందని సమాచారం. దశావతారం కాన్సెప్ట్‌తో స్టార్ట్ అవ్వనున్న సీజన్ సెప్టెంబర్ 6 లేదా 13 వ తేదీని నుంచి ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని గురించి తెలియాలంటే అధికారిక అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Bigg Boss 9 Telugu: "అది నా పిల్ల" - బిగ్‌బాస్ స్టేజ్‌పై పవన్ సాయి షాకింగ్ కామెంట్స్!
Bigg Boss Trophy బిగ్‌బాస్ ట్రోఫీ కోసం రూ.16 లక్షలు ఇచ్చిన కంటెస్టెంట్!

