ETV Bharat / entertainment

ఇట్స్​ అఫీషియల్​ - ఆరోజు నుంచే "బిగ్​బాస్​ సీజన్​ 10" ప్రారంభం! - ప్రోమో రిలీజ్​!

- పదో సీజన్ ప్రారంభ తేదీని అధికారికంగా అనౌన్స్​ చేసిన మేకర్స్​ - 'దశావతారం' కాన్సెప్ట్‌తో సరికొత్త సీజన్​!

Bigg Boss 10 Launch Date
Bigg Boss 10 Launch Date (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 29, 2026 at 6:03 PM IST

2 Min Read
Choose ETV Bharat

Bigg Boss 10 Launch Date : బుల్లితెరపై బిగ్గెస్ట్​ రియాలిటీ షో బిగ్​బాస్ సందడి మొదలుకానుంది. తొమ్మిది సీజన్ల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్​బాస్​.. పదో సీజన్‌కు రెడీ అవుతోంది. ఇక పదో సీజన్​ హోస్టింగ్​ బాధ్యతలను కూడా కింగ్​ నాగార్జున తీసుకున్నారు. అయితే ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా బిగ్​బాస్ సీజన్ 10 టెలికాస్ట్ డేట్ ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. ఈసారి "ఆటలో సవాలు కాదు, ఆటే సవాల్" అంటూ రిలీజ్​ చేసిన వీడియో ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

పదో సీజన్​ స్పెషాలిటీ ఏంటి: బిగ్​బాస్​ అంటే వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులను ఒక దగ్గర ఉంచి 100 రోజుల పాటు గేమ్​ ఆడిస్తారు. ఇక ఆ గేమ్స్​ కూడా ఫిజికల్​, మెంటల్​ సహా వివిధ రకాల స్ట్రెంత్​లకు సంబంధించినవి ఉంటాయి. దాదాపు అన్ని సీజన్లు అలానే ఉన్నాయి. అయితే పదో సీజన్​లో పలు మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లు ఈ సారి 'దశావతారం' కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ సీజన్ 10 రానుంది.

సీజన్​ ఎప్పుడు మొదలు: బిగ్​బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుందని, స్టార్ మా, జియో హాట్​స్టార్​లో వీక్షించవచ్చని మేకర్స్​ అధికారింగా ప్రకటించారు. దశావతారం కాన్సెప్ట్​తో సర్‌ప్రైజ్‌లు, డ్రామా, సవాళ్లు అన్నీ 10 రెట్లు ఉంటాయని తెలిపేలా రిలీజ్​ చేసిన వీడియో సోషల్​ మీడియాలో ట్రెండ్​ అవుతోంది. "మీరు ఎంతైనా ఊహించుకోండి.. దాన్ని మించి ఈ సీజన్‌ ఉంటుంది. ఈ సారి ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు" అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్స్​ను ఆడియన్స్​ ఎంజాయ్​ చేస్తున్నారు.

కామనర్స్​కు అవకాశం: సీజన్​ 1 హిట్​ కావడంతో.. కామనర్స్​కు మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అగ్నిపరీక్ష సీజన్​ 2 ప్రారంభమైంది. టాప్​ 15 కంటెస్టెంట్స్ అందరూ పోటా పోటీగా టాస్కులు పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు బెస్ట్ గేమ్‌ ఆడి ఓట్ అప్పీల్ చేసుకుంటే, మరికొందరు ఎల్లో కార్డ్ అందుకుని డేంజర్ జోన్‌లో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో అగ్నిపరీక్ష సీజన్ 2 ముగియనుంది. వీరిలో బెస్ట్​గా ఉన్నవారిని సెలెక్ట్​ చేసి హౌజ్​లోకి పంపిస్తారు.

కంటెస్టెంట్స్​ ఎవరు: ఇక బిగ్​బాస్​ ఎప్పుడు మొదలవుతుందో తెలియడంతో అందరి దృష్టి ఇప్పుడు కంటెస్టెంట్స్ మీద ఉంది. ఈ క్రమంలోనే సీజన్​ 10లో పార్టిసిపేట్​ చేయబోయే సెలబ్రిటీల పేర్లు సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నాయి. వాళ్లలో ముఖేష్​గౌడ, టెంపర్​ వంశీ, కృష్ణుడు, దేబ్జానీ, ఆటోరామ్​ప్రసాద్​, నరేష్​, అదిత్​ ఈశ్వరన్​, వర్షిణి సౌందరాజన్​, ఎక్స్​ప్రెస్​ హరి, సౌందర్య రెడ్డి, సుహాసిని, పల్లవి గౌడ, తేజస్విని, రాకింగ్​ రాకేష్​ తదితరుల పేర్లు వైరల్​ అవుతున్నాయి. ఇందులో ఎవరెవరు హౌజ్​లోకి అడుగుపెడుతున్నారో తెలియాలంటే సెప్టెంబర్​ 6వరకు వెయిట్​ చేయాల్సిందే.

బిగ్​బాస్​ సీజన్​ 10 - హౌజ్​లోకి వెళ్లే "సెలబ్రిటీలు" వీళ్లే! - సోషల్​ మీడియాలో వైరల్​!

Bigg boss 9 Telugu Final : ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న "పవన్"!