Bharani Elimination: భరణి ఎలిమినేషన్‌ను శాసించిన 'పవరాస్త్ర' - ఆ ముగ్గురికి సలహాలు - అతనికి సారీ!
-ఫుల్ ఎంటర్టైనింగ్గా దీపావళి ఎపిసోడ్ - భరణి ఎలిమినేషన్‌తో దివ్య-తనూజ ఏడుపు!

Published : October 20, 2025 at 8:39 AM IST
Bharani Elimination in Bigg Boss Telugu 9: దీపావళి సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్ హౌజ్ దద్దరిల్లింది. కంటెస్టెంట్స్‌కు ఫన్నీ గేమ్స్ నిర్వహించారు. ఇక హీరోయిన్లు శివానీ నాగరం, అప్సర రాణి, ఆనంది డ్యాన్సులతో అలరించారు. సింగర్ సాకేత్ పేరడీ సాంగ్స్‌తో ఎంటర్టైన్ చేశారు. అంతేకాకుండా కంటెస్టెంట్స్ ఆటతీరుపై హైపర్ ఆది పంచులు వేయడంతో పాటు గేమ్ గురించి హింట్స్ కూడా ఇచ్చారు. అలానే సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా తమ మూవీ జటాధర ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్‌కి వచ్చారు. ఈ క్రమంలో సంజనా, సుమన్ శెట్టి, డీమాన్ పవన్‌లకు ఇంటి నుంచి వీడియో మెసేజ్‌లు వచ్చాయి. అలాగే పండగ సందర్భంగా హౌజ్‌మేట్స్‌కు నాగార్జున గిఫ్ట్స్ అందించారు. ఇలా ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగింది. కానీ ఎలిమినేషన్ టైమ్‌కు హోజ్ మొత్తం ఎమోషనల్ అయ్యింది. ఈ క్రమంలో ఎలిమినేషన్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.
నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరినీ సేవ్ చేయగా చివరికి భరణి-రాము రాథోడ్ డేంజర్ జోన్‌లో మిగిలిపోయారు. అప్పటి నుంచి అటు దివ్య ఇటు తనూజ ఏడుస్తూనే ఉన్నారు. తనూజ ఏడుపు చూసి నాగార్జున కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి.. "ఏమైందమ్మా ఏమైనా చెప్పాలా" అని అడిగారు. "సార్ నేను నా ఫ్యామిలీ బాగా మిస్ అవుతున్నా. వాళ్ల వాయిస్ కూడా వినలేకపోయాను. చాలా బాధగా ఉంది. ఇక హౌజ్‌లోకి వచ్చిన తర్వాత నాన్న అనే బాండింగ్ భరణి గారితో ఏర్పడింది. కానీ అందరూ దాని గురించి చెప్పి నా గేమ్ స్పాయిల్ అవుతుంది అనడంతో ఆయనతో కూడా వారం రోజులుగా సరిగా మాట్లాడలేకపోయా. అందరు ఉన్నా ఒంటిరిని అనే ఫీలింగ్ కలుగుతుంది" అంటూ తనూజ ఫుల్ ఏడ్చేసింది.
ఇక డేంజర్ జోన్‌లో ఉన్న భరణి-రాము ఇద్దరినీ గార్డెన్ ఏరియాకి రమ్మని నాగార్జున పిలిచారు. "ఇది దీపావళి స్పెషల్ అయినా ఎలిమినేషన్ తప్పదు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలయ్యే ముందు ఒక విషయం అడగాలి. ఈ హౌజ్‌లో ఒకరి దగ్గర పవరాస్త్ర ఉంది. ఇమ్మాన్యుయేల్ దగ్గర ఉన్న ఆ పవరాస్త్రకి మూడు పవర్స్ ఉన్నాయి. అది ఈ వీక్ యూజ్ చేయొచ్చు. రెండోసారి మరికొన్ని వారాల తర్వాత వాడొచ్చు. మూడోది.. ఇంకొన్ని వారాల తర్వాత వాడాలి. ఇక ఈ వారం ఆ పవరాస్త్రకి ఇస్తున్న పవర్ సేవింగ్ పవర్. ఇప్పుడు సేవ్ చేస్తే మళ్లీ సేవ్ చేసే పవర్ ఇక ఉండదు. మరి ఇమ్మానుయేల్ ఈ వారం ఆ పవర్‌ని ఎవరికైనా యూజ్ చేస్తావా" అంటూ నాగార్జున అడిగారు.
షాకింగ్‌గా ఇమ్మాన్యుయేల్ నిర్ణయం: అంతా విన్న తర్వాత "నేను పవరాస్త్ర వాడదామనుకుంటున్నా సార్" అని ఇమ్మూ చెప్పాడు. అయితే ఇమ్మాన్యుయేల్ పవరాస్త్రను భరణి కోసం వాడతారని ఆడియన్స్ భావించగా.. కానీ రాము కోసం అది యూజ్ చేశాడు. "ఈ 6 వారాల గేమ్స్ చూసుకుంటే రాము స్ట్రయిట్ ఫార్వాడ్ ఉన్నాడు సార్. కానీ ఫస్ట్ 2 వీక్స్ కనిపించిన భరణి అన్న మళ్లీ కనిపించలేదు. ఎక్కడో బాండ్స్‌లో ఇరుక్కుపోయినట్లు అనిపించింది. కనుక నేను రాము కోసం పవరాస్త్ర ఉపయోగిస్తున్నా" అని ఇమ్మాన్యుయేల్ చెప్పాడు. దీంతో "ఇమ్మాన్యుయేల్ తన పవరాస్త్ర ఉపయోగించాడు.. కానీ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు లీస్ట్‌లో ఉన్నారో చూద్దాం. ఇమ్మూ నీ పవరాస్త్ర తీసుకొని చేతిలో పట్టుకొని ఉండు. భరణి-రాము మీ ఎదురుగా ఉన్న క్రాకర్స్‌ని వెలిగించండి. అది వెలిగి అందులో ఉన్న కలర్ మీరు ఎలిమినేటెడ్ ఆర్ సేఫ్ అని తెలుస్తుంది" అంటూ నాగార్జున చెప్పారు. ఇక క్రాకర్ వెలిగించగానే రాము సైడ్ ఉన్న క్రాకర్ గ్రీన్ కలర్ రాగా భరణి వెలిగించింది రెడ్ కలర్ చూపించింది. దీంతో "భరణి నువ్వు ఎలిమినేట్ అయ్యావ్.. స్టేజ్ మీదకి రా" అంటూ నాగార్జున పిలిచారు.
"ఇమ్మానుయేల్ నీ దగ్గరున్న సేవింగ్ పవర్ నువ్వు వాడావ్. ఇంకా నీ పవరాస్త్రకి రెండు పవర్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు వాడాలి అనేది బిగ్‌బాస్ చెప్తారు" అని నాగార్జున అన్నారు. ఇక భరణి బయటికి వెళ్లేముందు తనూజ-దివ్య సహా అందరూ పరిగెత్తుకుంటూ గార్డెన్ ఏరియా దగ్గరున్న డోర్ వరకూ వచ్చి బిగ్‌బాస్‌ని డోర్ ఓపెన్ చేయాలంటూ రిక్వెస్ట్ చేశారు. డోర్ ఓపెన్ కాగానే దివ్య వెళ్లి భరణిని హత్తుకొని ఏడ్చేసింది. దివ్య అవగానే తనూజ పట్టుకొని ఏడ్చేసింది. ఆ తర్వాత సంజన దగ్గరికెళ్లి " మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు హార్ట్ ఫీలింగ్స్ లేవు ఇప్పుడైనా నమ్మండి" అని భరణి చెప్పాడు. ఇక గేటు దగ్గర కూడా దివ్య, తనూజ ఇద్దరూ భరణిని పట్టుకొని ఏడస్తూనే ఉన్నారు.
ఆ మాట 100 శాతం పూర్తి చేయాలి: ఇక స్టేజ్ మీదకి రాగానే ఎలిమినేషన్ ఎక్స్‌పెక్ట్ చేశావా.. అని నాగ్ అడిగారు. లేదు సార్ ఊహించలేదు.. అని భరణి అన్నాడు. వెంటనే జర్నీ వీడియో ప్లే చేశారు. తర్వాత భరణి వెళ్లే ముందు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పెయ్ అని నాగ్ అడిగారు. ఫస్ట్ ఇమ్మానుయేల్ గురించి మాట్లాడతా సార్ అంటూ.. "నా జర్నీ వీడియో మొత్తం చూపించారు. నేను ఫస్ట్ పిలిచిన పేరు ఇమ్మానుయేల్. ఫస్ట్ వచ్చి హగ్ చేసుకుంది నిన్నే. డే1 నుంచి మనం ఒక మాటే మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ మాట ఎవరికీ తెలీదు. ఆ మాట నువ్వు 100 శాతం పూర్తి చేస్తావని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నీ మమ్మీ బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయి. లవ్యూ బ్రదర్" అని భరణి అన్నాడు. "సారీ అన్నా" అని ఇమ్మూ అంటే.. "హే సారీ వద్దు ప్లీజ్ నో హార్ట్ ఫీలింగ్స్" అంటూ భరణి చెప్పాడు.
ఎవరి మీద ఆధారపడకు: ఇక "తనూజ నీకు ఒకటే చెప్తాను. ఎవరి మీదా ఆధారపడకు. ఎవరినీ నమ్మకు. నీ బెస్ట్ నువ్వు ఇవ్వు. లవ్యూ.. ప్లీజ్ ఏడవకు" అని భరణి అన్నాడు. దీనికి "ఐ మిస్ యూ నాన్న. ఐ మిస్ యూ. నేను ఏడవను. నాకు తెలుసు" అంటూ తనూజ చెప్పింది.
అలా ఫస్ట్ టైమ్ అనిపించింది: తర్వాత దివ్య గురించి మాట్లాడాడు భరణి. "దివ్య నువ్వు చాలా స్వీట్‌హార్ట్. నిజంగా నాకు ఇంకొక చెల్లి ఉంటే బావున్ను అని ఫస్ట్ టైమ్ అనిపించింది. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత.. అసలు ఎంత బాగా చూసుకున్నావో నన్ను. డుమ్రీ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉంటాయి. ప్లీజ్ టేక్ కేర్.. ఐ మిస్ యూ" అంటూ భరణి అన్నాడు. భరణి మాటలకి దివ్య ఇంకా ఏడ్చేసింది. " నా ఫ్యామిలీ తర్వాత నేను ఎవరినీ అంత పట్టించుకోలేదు సార్. ఎవరితోనూ నేను రిలేషన్‌ని కలుపుకోను.. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ని నా అన్నయ్యలాగే చూసుకున్నాను. నేను ఈ హౌస్‌కి వచ్చిన తర్వాత ఏ విషయానికి ఏడవలేదు. ఆయనకి రిలేటెడ్ అయిన విషయాలకే నేను ఎమోషనల్ అయ్యాను. ఆయన ఎప్పటికీ నా అన్నయ్యే" అంటూ దివ్య ఏడ్చేసింది.
సారీ బ్రదర్: ఇక చివరిగా డీమాన్ గురించి మాట్లాడాడు భరణి. "డీమాన్.. నా వల్ల ఈ హౌజ్‌లో ఎవరికైనా అన్యాయం జరిగింది. నా వల్ల ఎవరికైనా పొరపాటు జరిగిందంటే అది నీకే జరిగింది. అందుకే చెప్తున్నా కప్పు కొట్టి బయటికి రా. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సారీ.. ఆల్ ది బెస్ట్" అంటూ భరణి అన్నాడు. "అయ్యే లేదన్నా ఫర్లేదు" అంటూ డీమాన్ చెప్పాడు. ఇలా హౌజ్ నుంచి ఆరోవారంలో భరణి ఎలిమినేట్ అయ్యాడు.

