ETV Bharat / entertainment

అనిల్ రావిపూడి-వెంకటేశ్- కల్యాణ్​ రామ్ కొత్త సినిమా షురూ- హీరోయిన్లు కన్ఫర్మ్

విక్టరీ వెంకటేశ్​, నందమూరి కల్యాణ్​ రామ్​తో భారీ మల్టీస్టారర్​ - అధికారికంగా ప్రారంభమైన సినిమా- హీరోయిన్లుగా కృతి, కీర్తి

Venkatesh Kalyan Ram
Venkatesh Kalyan Ram (Source : Shine Screens ScreenShot)
author img

By ETV Bharat Telugu Team

Published : June 18, 2026 at 10:25 AM IST

3 Min Read
Choose ETV Bharat

Anil Ravipudi New Movie : అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్- నందమూరి కల్యాణ్​ రామ్​ కాంబోలో కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్​ ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్​లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొని లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా ఎంపికైయ్యారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాతికి విడుదల చేయాలని అనిల్ భావిస్తున్నారు.

క్లాప్ కొట్టి ప్రారంభించిన అల్లు అరవింద్
ఈ పూజా కార్యక్రమంలో నిర్మాత సాహూ గారపాటి, దర్శకుడు అనిల్​ రావిపూడి, హీరోలు వెంకటేశ్, కల్యాణ్ రామ్, హీరోయిన్లు కీర్తి సురేశ్, కృతి శెట్టి పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు సురేశ్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. మూవీటీమ్​కు దిల్​రాజు స్క్రిప్ట్ అందించగా, వెంకటేశ్ కృతి శెట్టి, కీర్తి సురేశ్, కల్యాణ్​ రామ్​పై అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఇక మూవీ టీమ్​ను రాఘవేంద్రరావు ఆశీర్వదించారు. అనంతరం చిత్రబృందంతో కలిసి దర్శకుడు అనిల్ గ్రూప్​ ఫొటో దిగారు.

హీరోయిన్లుగా కీర్తి, కృతి
ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో హీరోయిన్లుగా ఎవరు అవకాశం దక్కించుకుంటారని ఆసక్తి నెలకొంది. అయితే ఆ సస్పెన్స్​కు ఇవాళ్టితో తెరపడింది. ఇందులో నటించే ఛాన్స్​ కీర్తి సురేశ్, కృతి శెట్టి పట్టేశారు. అయితే ఇందులో ఓ హీరోతో ఎవరు జోడీగా నటించనున్నారో అనే విషయాన్ని పూజా కార్యక్రమంలోనే రివీల్ చేశారు. దీనిని కూడా ఓ ప్రమోషన్​లాగే అనిల్ డిజైన్ చేశారు.

ప్రమోషన్ వేరే లెవెల్
అల్లు అరవింద్ క్లాప్ కొట్టే సమయంలోనే అదిరిపోయే స్టైల్​లో నటీనటుల జోడీలను రివీల్ చేశారు. మొదట కావాలనే వెంకటేశ్​ పక్కన కృతి శెట్టిని- కల్యాణ్ రామ్​కు జోడీగా కీర్తి సురేశ్ నిల్చొని ఉండాలని అనిల్ సూచించారు. ఆ తర్వాత పొరపాటు జరిగిందన్నట్లుగా కృతి, కీర్తి తమ ప్లేస్​లను సరిచేసుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. దీంతో వెంకటేశ్​కు జోడీగా కీర్తి, కల్యాణ్ పక్కన కృతి కనిపించనున్నారని అర్థమైంది.

ఐదో సినిమా!
F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు (అతిథి పాత్ర) తర్వాత అనిల్, వెంకీల కలయికలో వస్తున్న ఐదో సినిమా ఇది. నందమూరి కల్యాణ్​ రామ్​తో అనిల్ చేస్తున్న రెండవ సినిమా ఇది. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్‌తో కలిసి షైన్ స్క్రీన్స్​కు చెందిన సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి జీ.వీ. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కల్యాణ్ రామ్ నటించిన పటాస్​ చిత్రంతో అనిల్ దర్శకుడిగా పరిచయమయ్యారు.

అనిల్ స్టైలే ఢిఫరెంట్
​సినిమాను ప్రమోట్ చేయడంలో అనిల్ స్టైల్ వేరు. ఈ సినిమాకు కూడా షూటింగ్ ప్రారంభం కాకముందే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇటీవల సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్​ను కన్ఫర్మ్ చేస్తూ ఓ వీడియో చేశారు. వివాహ భోజనంబు సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీక్రియేట్‌ చేస్తూ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. అందులో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌తో కలిసి ఆయన చేసిన వీడియో నవ్వులు పూయించింది.

కాగా, ఈ సినిమా 'venkyanil 5' అనే వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతుంది. స్ట్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ఇక రెగ్యులర్ షూటింగ్​ కూాడా ప్రారంభం కానుంది. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాల్లో వినోదానికి, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఈ కొత్త ప్రాజెక్టు కూడా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కనుంది. ఆరు నెలల్లో సినిమాను కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకురానున్నారు.

LIVE : అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్​ లాంచ్​! - ప్రత్యక్షప్రసారం

'క్లాప్ కూడా కొట్టలేదు, అప్పుడే OTT డీల్ క్లోజ్​'- అనిల్ రావిపూడి బ్రాండ్ వ్యాల్యూ ఇది!