ETV Bharat / entertainment

'మన శంకరవరప్రసాద్ గారు' టికెట్ ధర పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్- ప్రీమియర్స్​కు కూడా ఓకే!

రెండో రోజుల్లో థియేటర్లలోకి రానున్న 'మన శంకరవరప్రసాద్ గారు' - సంక్రాంతికి చిరు సందడే సందడి- టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Mana Shankara Vara Prasad Garu
Mana Shankara Vara Prasad Garu (Source : Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 8:28 PM IST

2 Min Read
Choose ETV Bharat

Mana Shankara Vara Prasad Garu Tickets : మెగాస్టార్ చిరంజీవి మరో రెండు రోజుల్లో 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైనర్​గా తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతోపాటు స్పెషల్ ప్రీమియర్ షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే?

దీంతో జనవరి 11న స్పెషల్‌ ప్రీమియర్‌ షో ఉండనుంది. రాత్రి 8గంటల నుంచి 10 గంటల మధ్య షో ను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ షో టికెట్‌ ధరను రూ.500 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. ఇక జనవరి 12వ తేదీ నుంచి పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఈ సమయంలో సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) టికెట్‌ ధర అదనంగా ఉంటుంది. అలాగే, ఈ 10రోజులు కూడా రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది.

ఓవర్సీస్​లో జోరు
సినిమా అడ్వాన్స్ బుకింగ్స్​ ఓవర్సీస్​లో జోరుగా సాగుతున్నాయి. యూకేలో ఇప్పటికే 20 వేల టికెట్లు సోల్డ్ అయ్యాయి. అటు యూఎస్​ఏలోనూ ప్రీమియర్స్​ సేల్ జోరుగా జరుగుతోంది. అక్కడ టికెట్ అమ్మకాలతో 5 లక్షల డాలర్లు ఇప్పటికే వసూల్ అయ్యాయి. రిలీజ్ నాటికి ఈ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఇక రిలీజ్ తర్వాత సినిమాకు టాక్ బాగుంటే ఓవర్సీస్​లో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. అక్కడ 3 మిలియన్ డాలర్ల క్లబ్​లో చేరే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక తెలంగాణలో మాత్రం ఎలాంటి టికెట్ పెంపు లేకుండానే సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు తెలంగాణలో ఎప్పటిలాగే రెగ్యులర్ రేట్లే ఉండనున్నాయి. అలాగే హైదరాబాద్​లోనూ ప్రీమియర్స్ ఉండే ఛాన్స్ లేదు! దీనిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాగా, ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నయనతార హీరోయిన్​గా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్​పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి.

వెంకీతో ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తా- అనిల్‌తో సినిమా రాఘవేంద్రరావు కోరిక: చిరంజీవి

రెండు రోజుల్లో 'రాజాసాబ్'- అడ్వాన్స్ బుకింగ్స్​పై నో క్లారిటీ- ​ఇంకా డైలమాలోనే