రవితేజ, నవీన్ పొలిశెట్టి కొత్త సినిమాలకు టికెట్ రేట్ పెంపు- ఏ మూవీకి ఎంతంటే?
మరో రెండు సినిమాల టికెట్ ధర పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్- 10 రోజులపాటు పెరిగిన రేట్లే

Published : January 10, 2026 at 6:15 PM IST
Anaganaga Oka Raju Ticket Price : ఈ సంక్రాంతి సినిమాలు రాజాసాబ్, మన శంకరవర ప్రసాద్ గారు సినిమాల టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు చిత్రాల టికెట్ హైక్స్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తాజాగా అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సినిమాలకు ప్రీమియర్ షోలు లేవు.
ఏ సినిమాకు ఎంతంటే?
- భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీఫ్లెక్స్‌లో టికెట్ ధర రూ.75 పెంపునకు అనుమతి
- అనగనగా ఒక రాజు చిత్రానికి సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీఫ్లెక్స్‌లో టికెట్ ధర రూ.75 పెంపునకు అవకాశం
- రెండు సినిమాలకు విడుదలైనప్పటి నుంచి తొలి 10 రోజులు పెరిగిన ధరలే ఉంటాయి
కాగా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను తెరకెక్కించారు. ఇందులో డింపుల్ హయాతీ, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరో ఓవైపు భార్య, ఇంకోవైపు ప్రియురాలు మధ్య నలిగిపోయే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్లు నవ్వులు పూయించాయి. ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, సునీల్, సత్య తదితరులు ఆయా పాత్రల్లో నటించారు.
మరోవైపు, నవీన్ పొలిశెట్టి లీడ్‌లో మారి తెరకెక్కించిన అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14 విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ రెండు సినిమాల ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించింది హీరో నవీన్ కావడం విశేషం. సినిమా రెండేళ్ల కిందటే ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల డిలే అయ్యింది. అయితే ప్రేక్షకులను నిరాశ పర్చకూడదనే ఉద్దేశంతో నవీన్ స్క్రిప్ట్‌ను పర్ఫెక్ట్గా రాశారు. ఆయన రాసిన స్క్రిప్ట్‌ను డైరెక్టర్ మారి తెరకెక్కించారు. ఆయనకు ఇదే తొలి సినిమా కావడం గమనార్హం.
ఫుల్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కింది. గ్లింప్స్, పాటలతో ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డ నేపథ్యంలో తాజా ట్రైలర్ కూడా అలరిస్తుంది. ఇది ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. సినిమా ఎంత ఎంటర్టైన్గా ఉండనుందో ఈ ట్రైలర్‌తో డైరెక్టర్ చూపించారు. సితారా బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
'పండక్కి అల్లుడొచ్చేస్తున్నాడు రెడీగా ఉండండి'- 'అనగనగా ఒక రాజు' ట్రైలర్
'ఆ కారణం వల్లే నా సినిమాలు లేట్ అవుతాయి'- నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ స్పీచ్!

