తారక్ బాటలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్- 'ఆల్ఫా' కోసం హంతకురాలిగా ఆలియా!
డ్రాగన్ ప్రధాన హంతకుడు పాత్రలో కొత్తగా కనిపించనున్న తారక్- ఇదే తరహాలో అసాసిన్గా ఆలియా- యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఆల్ఫా మూవీ

Published : May 27, 2026 at 6:52 AM IST
Alia To Play An Assasina In Alpha : స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'డ్రాగన్'. ఇటీవల ఈ చిత్ర బృందం తారక్ పుట్టినరోజు సందర్భంగా మొదటి అప్డేట్‌గా గ్లింప్స్‌ను కూడా విడుదల చేసింది. అది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 24 గంటల్లోనే 64 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ 'లూగర్' అనే విలన్ పాత్రలో అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ అస్సాసిన్-ఇన్-చీఫ్ (ప్రధాన హంతకుడు)గా కనిపించారు. ఇటువంటి పాత్రలో తారక్ కనిపించడం ఇదే మొదటి సారి. అందుకే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
హంతకురాలిగా ఆలియా
అయితే ఇప్పుడు అదే దారిలో ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఉందని బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ లాగా ఆలియా భట్ కూడా ఓ హంతకురాలి పాత్రలో కనిపించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న 'ఆల్ఫా' చిత్రంలో అలియా భట్ అసాసిన్ తరహా పాత్రలో నటించనున్నట్లు సమాచారం. గతంలో వచ్చిన స్పై యూనివర్స్ చిత్రాలతో పోలిస్తే ఈసారి పూర్తిగా భిన్నమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ పాత్రలో షాక్ ఫ్యాక్టర్
ఇటీవల విడుదలైన 'టైగర్ 3', 'వార్ 2' చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోకపోవడంతో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఈసారి కథ, పాత్రల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా అలియా భట్ పాత్రలో షాక్ ఫ్యాక్టర్ ఉండేలా డిజైన్ చేశారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ చిత్రానికి శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నారు. అలియా భట్‌తో పాటు శార్వరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే అనిల్ కపూర్, బాబీ దేఓల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
యశ్ రాజ్ ప్రొడక్షన్స్‌లో విడుదలైన 'వార్ 2'లో హృతిక్ రోషన్, 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ పోషించిన గూఢచారి పాత్రల్లా కాకుండా ఆలియా ఇందులో కొత్తగా కనిపించనుందని సమాచారం. ఇదిలా ఉండగా ఆలియా భట్ చివరిగా నటించిన 2024లో జిగ్రా మూవీ తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు. ఆల్ఫా సినిమా 2025 డిసెంబర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అలా జరగలేదు. దాంతో ఆలియా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తెరపై కనిపించనన్నారు. ఎన్టీఆర్ కూడా ప్రతినాయకుడిగా ఇంతకు ముందు 'జై లవ కుశలో' కనిపించినప్పటికీ, ఇలా పూర్తిగా విలన్ పాత్రను పోషించడం ఇదే మొదటి సారి. దాంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
'ప్రతిదానికి ఆందోళనే' - ఆలియాకు ఉన్న ఈ రేర్ డిసీజ్ గురించి తెలుసా?

