ETV Bharat / entertainment

'లెనిన్ కోసం నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు'- ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన అఖిల్

లెనిన్ ప్రొడక్షన్ గురించి ఓపెన్ అయిన హీరో అఖిల్-ఎడిటింగ్ రూమ్‌లో కూర్చుని ప్రతి సీన్ చెక్ చేసిన నాగార్జున- జులై 10న థియేటర్లలోకి లెనిన్- రెండు పెద్ద బ్యానర్లు కలిసి నిర్మించిన భారీ ప్రాజెక్ట్

Akhil Akkineni Lenin Movie
Akhil Akkineni Lenin Movie ((Movie Poster))
author img

By ETV Bharat Telugu Team

Published : July 3, 2026 at 11:20 AM IST

3 Min Read
Choose ETV Bharat

Akhil Akkineni Lenin Movie : అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న లెనిన్ సినిమా రిలీజ్ దగ్గర పడుతోంది. జులై 10న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్న టైమ్‌లో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ ఈ సినిమా ప్రొడక్షన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. సినిమా అవుట్ పుట్ బాగా రావడం కోసం ప్రొడక్షన్ టీమ్ ఏ రేంజ్‌లో కష్టపడిందో క్లియర్‌గా వివరించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో నాగార్జున తీసుకున్న కేర్ గురించి ఆడియన్స్‌కి అర్థమయ్యేలా చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే

ప్రతి సీన్ చెక్ చేశారు
లెనిన్ సినిమా మేకింగ్ గురించి చెబుతూ నాగార్జున ఈ సినిమాకు ఒక భూతద్దం పెట్టి ప్రతిదీ గమనించారని, ఎడిట్ రూమ్‌లో కూర్చుని ప్రతి సీన్ అలాగే ప్రతి డైలాగ్ చాలా కేర్ ఫుల్‌గా దగ్గరుండి చూసుకున్నారని తెలిపారు. సినిమాను ఇంకా బెటర్‌గా మార్చే ప్రాసెస్‌లో ఏవైనా రీషూట్స్ చేయాల్సి వచ్చినా సినిమా మంచి కోసమేనని యూనిట్ అంతా బాగా కోపరేట్ చేసిందని చెప్పారు. నాగార్జున షూటింగ్ సెట్‌లో లేకపోయినా ఎడిట్ టేబుల్‌పై మాత్రం అన్నీ చూసుకున్నారని క్లారిటీ ఇచ్చారు.

ఆ వైబ్ బాగా నచ్చింది
తన పాత సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా పైనే నాగార్జున చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారని అఖిల్ వివరించారు. మనం సినిమా తర్వాత ఆయన ఈ రేంజ్‌లో ఇన్వాల్వ్ అయిన సినిమా ఇదేనని, ఇది తన మీద ప్రేమతోనా లేక కథ మీద ఇష్టంతోనా అనేది ఆయనే చెప్పాలని అన్నారు. బహుశా ఈ కథలోని వైబ్ ఆయనకు బాగా నచ్చడం వల్లే అంతలా కేర్ తీసుకుని ఉంటారని చెప్పిన నాగార్జునకు డ్రామాతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే చాలా ఇష్టమని అన్నారు. ఇక ఈ సినిమాలో కొత్తగా ఫ్రెష్‌గా ట్రై చేసిన విధానం ఆయనకు బాగా నచ్చిందని చెప్పారు.

క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అయ్యారు
ఈ సినిమాలో భారతి క్యారెక్టర్‌తో పాటు మిగిలిన అన్ని పాత్రలను నాగార్జున బాగా ఇష్టపడి చూశారని అఖిల్ తెలిపారు. ఎడిట్ టేబుల్‌పై ప్రతి లుక్, డైలాగ్, క్లోజప్ షాట్స్ ఇలా ప్రతి చిన్న విషయాన్ని చాలా డీప్‌గా అబ్జర్వ్ చేశారని అన్నారు. ఈ షాట్‌కి ఇంకొక క్లోజప్ తీయవచ్చా అంటూ ఆయన ఎడిటింగ్‌లో ఎంతో ఇన్వాల్వ్ అయ్యారని తెలిపారు. సితార ప్రొడ్యూసర్ నాగ వంశీ సపోర్ట్ కూడా చాలా ఉందని, రెండు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కలిసి ఈ ప్రాజెక్టును నమ్మి ముందుకు రావడం వల్ల తమకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చిందని అఖిల్ వివరణ ఇచ్చారు.

రాయలసీమ యాక్షన్ డ్రామా
మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్‌లో రాయలసీమ రూరల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటుడు శివాజీ హీరో ఫాదర్ క్యారెక్టర్‌లో, రాంకీ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్‌లో కనిపిస్తుండగా వీళ్లతో పాటు సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు, గెటప్ శ్రీను, సుదర్శన్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ మ్యూజిక్ అంధించారు. ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ టీమ్ అంతా చాలా స్ట్రాంగ్‌గా ఉండటం కూడా అఖిల్ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచుతోంది.

హిట్ కొట్టాల్సిన టైమ్
అఖిల్ సినీ కెరీర్ చూసుకుంటే కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఆ సినిమా తెచ్చిన నష్టాలు అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. అంతకుముందు సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీఫ్ ఇచ్చినా అఖిల్ రేంజ్‌కి తగ్గ మాస్ సక్సెస్ అయితే దక్కలేదనే కామెంట్స్ వచ్చాయి. అందుకే ఈసారి ఎలాగైనా సరే లెనిన్ సినిమాతో ఒక గట్టి హిట్ కొట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని అఖిల్ చాలా కసితో ఉన్నాడు.

'జైలర్ 2' రిలీజ్​కు డేట్ ఫిక్స్- థియేటర్లకు వచ్చేది ఎప్పుడంటే?

'మా నాన్న అభిమాని నన్ను కిడ్నాప్ చేయాలని ట్రై చేశాడు'- జేసన్ సంజయ్ కామెంట్స్