ETV Bharat / entertainment

'అవును, పెళ్లి చేసుకున్నా- భర్త కోటీశ్వరుడు, నలుగురు పిల్లలు కూడా!'- త్రిష పోస్ట్​ వైరల్!

సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన త్రిష- ఒక్క పోస్టుతో అన్ని ప్రచారాలకు క్లారిటీ

Trisha
Trisha (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 7, 2026 at 1:34 PM IST

2 Min Read
Choose ETV Bharat

Trisha Movies Quit : స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఇటీవల రోజుకో కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. ఆమె వ్యక్తిగత జీవితం నుంచి ప్రొఫెషనల్ కెరీర్ దాకా కొద్ది రోజులుగా ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. క్రమంగా ఈ ప్రచారాలు ఎక్కువవుతుండడంతో త్రిష రంగంలోకి దిగారు. స్వయంగా వీటన్నింటిపై పరోక్షంగా ఆమె స్పందించారు. ఈ మేరకు ఓ ఘాటు పోస్టును ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో షేర్ చేశారు.

'అవును, సినిమాలు చేయడం ఆపేశాను. ఒక రిచ్ బిజినెస్​మ్యాన్​ను వివాహం చేసుకున్నానట. నిన్నటితోనే రెండేళ్లు నిండిన నలుగురు పిల్లల్ని కూడా ఉన్నారు. ఇంకా నేను ఇందులో రాయడానికి ఇంకా ఏమైనా ఉందా? లేదంటే ఈరోజు మీరు వార్తలు రాసుకోవడానికి, మీ ఊహలకు ఇది సరిపోతుందా?' అని త్రిష రాసుకొచ్చారు. దీంతో ఆమెపై రూమర్స్ క్రియేట్ చేస్తున్న వాళ్లకు సెటైరికల్​గా రిప్లై ఇచ్చారు. అలాగే త్రిష నటనకు గుడ్​ బై చెప్పేస్తున్నారన్న వార్తలకు కూడా ఫుల్​స్టాప్ పడింది.

Trisha  Instagram
త్రిష ఇన్​స్టాగ్రామ్ స్క్రీన్​షాట్ (Source : Trisha InstaScreenshot)

ఇదీ జరిగింది
ఇటీవల నటుడు చిత్రా లక్ష్మణన్‌ ఓ యూట్యూబ్‌ ఛానెల్​లో పాల్గొన్న సందర్భంలో త్రిష గురించి మాట్లాడారు. ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, త్రిష ఇండస్ట్రీలో కొనసాగాలని అనుకోవడం లేదని, సినిమాలు మానేస్తున్నారని చెప్పారు. దీంతో ఇది కోలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. నిజంగానే ఆమె సినిమాలు మానేస్తున్నారని, రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారని ప్రచారం షురూ అయ్యింది. అయితే త్రిష తాజా పోస్టుతో వీటిపై క్లారిటీ వచ్చింది.

అప్పుడు కూడా ఇంతే!
అయితే ట్రోల్స్​కు, రూమర్స్​కు సెటైరికల్​గా త్రిష సమాధానం చెప్పడం ఇదే తొలిసారి కాదు. ఆమె చుట్టూ జరిగే ఫేక్ ప్రచారానికి అప్పుడప్పుడు సోషల్ మీడియా పోస్టులతో చెక్ పెడుతుంటారు. గతంలో చంఢీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో త్రిష వివాహం ఖరారైందని, ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయని, ఇందుకు త్రిష కూడా ఓకే చెప్పిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనికి ఆమె తనదైన శైలిలో జవాబిచ్చారు. 'నా జీవితాన్ని నా కోసం ప్లాన్‌ చేస్తున్న వారిని నేను ఎప్పటికీ ప్రేమిస్తా. ఇప్పుడు హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమోనని ఎదురు చూస్తున్నా' అంటూ సెటైరికల్ రిప్లై ఇచ్చారు.

పెళ్లిపై అభిప్రాయం!
గతేడాది ఆమె నటించిన 'థగ్​ లైఫ్' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా పాల్గొన్న ప్రెస్​మీట్​లో పెళ్లిపై తన అభిప్రాయాన్ని చెప్పారు. పెళ్లి అనే కాన్సెప్ట్​పై తనకు నమ్మకం లేదని త్రిష అన్నారు. తనకు పెళ్లి అయినా ఓకే, ఒకవేళ లేకపోయినా ఏం ఫర్వాలేదని త్రిష రిప్లై ఇచ్చారు. 'నాకు పెళ్లిపైన సరైన ఉద్దేశం లేదు. నాకు పెళ్లైతే ఓకే. ఒకవేళ పెళ్లి కాకపోయినా నాకేం ఫర్వాలేదు' అని త్రిష సమాధానం చెప్పడం అప్పట్లో సెన్సేషనల్ అయ్యింది.

అప్​కమింగ్ సినిమాలు
కాగా, త్రిష నాలుగు పదుల వయసులోనూ హీరోయిన్​గా రాణిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగు సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె సూర్య హీరోగా తెరకెక్కుతున్న కరుప్పు సినిమాలో హీరోయిన్​గా నటిస్తున్నారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్​లో రూపొందుతున్న విశ్వంభంరలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

త్రిషతో రిలేషన్ రూమర్స్- విజయ్ బాడీగార్డ్ సెన్సేషనల్ పోస్ట్- హింట్ ఇచ్చేశారా?

'నాకు పెళ్లి కాకపోయినా నో ప్రాబ్లమ్'- త్రిష షాకింగ్ కామెంట్స్