ETV Bharat / entertainment

బేబీ కోసం అప్పుడే అన్నీ కొనేశా- కానీ వాటిని చూస్తేనే కంగారుగా ఉంది: సమంత

ప్రెగ్నెన్సీపై ఫ్యాన్స్​తో ఇంట్రెస్టింగ్ విశేషాలను షేర్ చేసుకున్న సమంత - బేబీ కోసం ఇప్పటికే కావాల్సిన వస్తువులన్నీ కొన్నానని వెల్లడి

Samantha On Pregnancy
నటి సమంత (Source: IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : August 29, 2026 at 11:30 AM IST

3 Min Read
Choose ETV Bharat

Samantha On Pregnancy : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తల్లి కాబోతున్న సంతోషంలో ఉన్నారు. ప్రెగ్నెంట్​గా ఉన్న సమయంలోనూ వ్యాయామం చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్​తో షేర్​ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఆమె ఇన్​స్టాగ్రామ్​లో 'ఆస్క్ మీ ఎనీథింగ్' పేరిట ఫ్యాన్స్​తో నిర్వహించిన చిట్​చాట్​లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలు సమంతకు ఆరోగ్యపరంగా సలహాలు ఇవ్వగా, మరికొందరు వారి వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

11 కేజీల బరువు పెరిగాను - సమంత
అభిమానులతో సమంత నిర్వహించిన చిట్​చాట్​లో ఫ్యాన్స్ ఆమెను కొన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. పుట్టబోయే బిడ్డ కోసం ఏం ప్లాన్ చేస్తున్నారని ఫ్యాన్స్ అడగ్గా దానికి సమంత బదులిస్తూ 'బేబీ కోసం కావాల్సిన వస్తువులన్నీ కొన్నాను. వాటిని చూస్తుంటే కాస్త కంగారుగా ఉంది. అందుకే ప్రెజెంట్ వాటిని ప్యాక్ చేసి పెట్టి ఆ బ్యాగ్​ను ఒక ల్యాప్​టాప్ స్టాండ్​గా ఉపయోగిస్తున్నాను' అని సమంత అన్నారు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి నాకు కలలు ఎక్కువగా వస్తున్నాయి. మీకు కూడా వస్తున్నాయా? అంటూ ఓ మహిళా ఫ్యాన్ సమంతను అడిగారు. దీనికి సమంత మాట్లాడుతూ 'నిజంగానే ఈ చిత్రమైన కలల గోల ఏంటో నాకు అర్ధం కావడం లేదు' అని పేర్కొన్నారు. బరువు పెరిగారా అని ఫ్యాన్స్ ప్రశ్నించగా '11 కేజీలు పెరిగానంటూ' సమంత వివరించారు.

ఇది చాలా అందమైన అనుభూతి - సమంత
తల్లిగా మారిన తర్వాత చాలా వస్తాయి మీకు తెలుసా? అంటూ అడగ్గా 'అవును, నేను ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను. పుట్టిన వారికి పాలు పట్టడం, జోలపాడి నిద్రపుచ్చడం, ఈ పనులన్నీ తల్లికి ఫుల్​టైమ్ జాబ్​లా మారిపోతాయి. అది చాలా అందమైన, గొప్ప అనుభూతి, జీవితాన్ని మార్చే ఓ మంచి అనుభవం' అని సమంత ఆనందం వ్యక్తం చేశారు. మాతృత్వం అనేది మీలో మరింత కాన్ఫిడెన్స్​ను పెంచుతుంది మీకు తెలుసా? అని ఫ్యాన్స్ చెప్పగా,'అమ్మతనం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నాకు ఇప్పటి వరకు తెలియదు, ఊహించలేదు. నాకో మంచి విషయాన్ని తెలిపారు చాలా థ్యాంక్స్' అని సమంత పేర్కొన్నారు.

Samantha Chitchat With Fans
ఫ్యాన్స్​తో ముచ్చటిెంచిన సమంత (Source: Samantha Instagram Account)

పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారని ప్రశ్నించగా, 'ఒక పేరును ఎంచుకోవడం అనేది చాలా కష్టం. దీనికి అందరి సహాయం కావాలి' అని అన్నారు. స్కానింగ్ రిపోర్ట్ వచ్చే వరకు చాలా టెన్షన్​గా ఉంటుంది. మరి మీకెలా ఉంటుందని అడగ్గా 'దేవుడా! ఆ కంగారు, భయం అనేవి కేవలం నా ఒక్కదానికే అనుకున్నాను. మీ మెసేజ్ చూసి కాస్త ఊరట లభించింది' అని అన్నారు. లైఫ్​లో ఈ మూమెంట్​ను ఎంజాయ్ చేస్తున్నారా అంటూ అడగ్గా 'సంపూర్ణంగా అనుభూతి చెందుతున్నాను' అని సమంత వివరించారు.

Samantha Instagram Story
సమంత ఇన్​స్టాగ్రామ్ స్టోరీ (Source: Samantha Instagram Account)

అదే విధంగా నటి సమంత ప్రెజెంట్ హాలీడే ట్రిప్​ను ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆమె ఫ్యాన్స్​కు చాలా దగ్గరగా ఉంటారు. ఇటీవల సమంత ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ తాను ఈ క్షణాల కోసం ఎంతో ఎదురుచూసినట్లు చెప్పారు. 'అమ్మ అనే పిలుపు కోసం ఎంతో పరితపించాను. ప్రతి రోజూ కొత్తగా అనిపిస్తోంది' అని అన్నారు. ఈ ఏడాది 'మా ఇంటి బంగారం' సినిమాతో సమంత ఆడియెన్స్​ను పలకరించారు. లేడీ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన సమంత ఫెర్ఫార్మెన్స్​కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించి రూ.100 కోట్ల వరకూ కలెక్షన్లను అందుకుంది. దీనికి సమంత భర్త రాజ్​ నిడిమోరు స్టోరీని అందించగా బీవీ. నందినీరెడ్డి డైరెక్షన్ చేశారు. ట్రాలాలా బ్యానర్​పై సమంత స్వయంగా దీన్ని నిర్మించారు.

అఖిల్ 'లెనిన్' మూవీపై సమంత 'ఇంట్రెస్టింగ్' కామెంట్స్- ట్రైలర్ షేర్ చేసి మరీ!

సమంత గుడ్ న్యూస్- ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తూ సినిమాలకు బ్రేక్