ETV Bharat / entertainment

Mrs.విజయ్: పెళ్లి తర్వాతా ఫుల్ బిజీబిజీ- రష్మిక చేతిలో 8 సినిమాలు!

Rashmika Mandanna Upcoming Movies : విజయ్ దేవరకొండతో రష్మిక వివాహం- పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు లైన్​లో పెట్టిన నేషనల్ క్రష్

Rashmika Mandanna
Rashmika Mandanna (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 10:08 PM IST

3 Min Read
Choose ETV Bharat

Rashmika Mandanna Movies Lineup : ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ పెళ్లి చేసుకున్నారంటే సినీ కెరీర్​ ఇక ముగిసినట్లే అని భావించేవారు. గతంలో ఆయా ఇండస్ట్రీలకు చెందిన అనేక మంది నటీమణులు పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అసిన్, జెనీలియా, ఇలియానా, నిషా అగర్వాల్, ట్వింకిల్ ఖన్నా, మాధురి దీక్షిత్, భాగ్య శ్రీ, గాయత్రి జోషి వంటివాళ్లు పెళ్లి తర్వాత బిగ్​స్క్రీన్​కు దూరమయ్యారు.

అయితే ఇందులో కొందరు వ్యాపారాలు ఎంచుకోగా మరికొందరు నచ్చిన రంగాల్లో స్థిరపడ్డారు. కొద్దిమంది మాత్రం సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి వచ్చారు. కానీ, రీ ఎంట్రీలో మెయిన్ లీడ్​గా కాకుండా సపోర్టింగ్ రోల్స్​ చేస్తున్నారు. కానీ క్రమంగా ఈ ట్రెడిషన్​కు కొత్త తరం హీరోయిన్లు ఫుల్ స్టాప్ పెడుతున్నారు. వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్​ను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్​లో రాణిస్తున్నారు.

కాజల్ అగర్వాల్, సమంత, లావణ్య త్రిపాఠి, ఆలియా భట్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె వంటి స్టార్ హీరోయిన్లే ఇందుకు ఉదాహరణ. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమా రంగంలో ఈ స్టార్లు రాణిస్తున్నారు. ఇప్పుడు రష్మిక మంధన్నా కూడా ఇదే లిస్ట్​లో చేరనున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న రష్మిక, పెళ్లి తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్​లను లైన్​లో పెట్టారు. మరి ఇకపై రష్మిక నుంచి రానున్న సినిమాలు ఏవో తెలుసుకుందాం!

ఆ సినిమా పూర్తి
ఇటీవల రష్మిక కాక్​టెయిల్ - 2 సినిమాను పూర్తి చేశారు. ఇందులో బాలీవుడ్ స్టార్లు షాహిద్ కపూర్​తో, కృతి సనన్ కీలక పాత్రలు పోషించారు. హోమి అడాజానియా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇదే ఏడాది సెప్టెంబర్​లో థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా తర్వాత షాహిద్​తో రష్మిక మరో లవ్​స్టోరీలో నటించనున్నట్లు తెలుస్తోంది.

విజయ్​తో మళ్లీ
రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండతో రణబాలిలో నటిస్తున్నారు. ఇప్పటికే వీళ్ల కాంబోలో వచ్చిన గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ మంచి విజయం సాధించాయి. ఇప్పుడు మూడోసారి ఈ ఇద్దరూ రణబాలిలో కనిపించనున్నారు. అయితే పెళ్లి తర్వాత ఒకే ఆన్​స్క్రీన్​లో కనిపించనుండడం ఫ్యాన్స్​కు కాస్త స్పెషల్ ఫీల్ ఇస్తుంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను రాహుల్ సంతృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల సెట్స్​పైకి వెళ్లింది.

పుష్ప ఫ్రాంచైజీలో
టాలీవుడ్ సక్సెస్​ఫుల్ ఫ్రాంచైజీ పుష్ప పార్ట్​ 3 కూడా రష్మిక అప్​కమింగ్ లిస్ట్​లో ఉంది. శ్రీవల్లిగా తొలి రెండు పార్ట్​ల్లో ఆమె ఆకట్టుకున్నారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో స్పష్టత లేదు. కానీ ఆమె అప్​కమింగ్ సినిమాల్లో ఇదొకటి. అంతేకాకుండా ఈ సినిమా కంటే ముందే ఆమె బన్నీతో కలిసి నటిస్తున్నారని వార్తలు వస్తుననాయి. అల్లు అర్జున్- అట్లీ సినిమాలో రష్మిక ఓ రోల్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది!

యానిమల్ పార్క్
సందీప్​రెడ్డి వంగా సెన్సేనషనల్ హిట్ సినిమా యానిమల్​లో రష్మిక గీతాంజలిగా కనిపించారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని సందీప్ ఎప్పుడో ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్​పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన రష్మిక మరోసారి రణ్​బీర్ కపూర్​కు జంటగా నటించనున్నారు. యానిమర్ పార్క్​గా ఈ సినిమా తెరకెక్కనుంది.

చెర్రీకి జోడీగా
మరోవైపు, ఆమె లిస్ట్​లో లేడీ ఓరియంటేటెడ్ 'మైసా' కూడా ఉంది. ఈ సినిమా అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చింది. ఇందులో ఆమె యాక్షన్ పాత్ర పోషించనున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ సైతం రిలీజైంది. ఈ సినిమాతోపాటు రామ్​చరణ్- సుకుమార్ ప్రాజెక్ట్​లోనూ రష్మికనే హీరోయిన్ అనుకుంటున్నారని టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. ఇవే కాకుండా బాలీవుడ్​లోనూ ఆమె పలు ప్రాజెక్ట్​లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.