ETV Bharat / entertainment

'ఔను మేమిద్దరం ప్రేమలో ఉన్నాం!'- రిలేషన్​షిప్​ కన్ఫర్మ్ చేసిన కావ్యా కల్యాణ్​రామ్- కాలభైరవ

టాలీవుడ్​లో బయటపడ్డ మరో క్యూట్ లవ్ స్టోరీ- రిలేషన్​షిప్​ను కన్ఫర్మ్ చేసిన కావ్య కల్యాణ్​రామ్- కాలభైరవ

Kavya Kalyanram And Kaala Bhairava
కావ్యా కల్యాణ్​రామ్- కాలభైరవ (Source : Kavya Kalyanram Insta Post)
author img

By ETV Bharat Telugu Team

Published : August 31, 2026 at 5:18 PM IST

2 Min Read
Choose ETV Bharat

Kavya Kalyanram And Kaala Bhairava : టాలీవుడ్​లో మరో లవ్​స్టోరీ బయటపడింది. కొంతకాలంగా వస్తున్న ప్రచారాన్ని నిజం చేస్తూ నటి కావ్యా కల్యాణ్​రామ్, సింగర్ కాలభైరవ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు. తామిద్దరూ రిలేషన్​షిప్​లో ఉన్నట్లు కన్ఫర్మ్ చేస్తూ ఈ మేరకు ఇన్​స్టాగ్రామ్​లో వేర్వేరు పోస్టులు షేర్ చేశారు. దీంతో ఈ లవ్​బర్డ్స్​కు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తమ ప్రేమ విషయం తెలుపుతూ కావ్య లైఫ్ అప్డేట్ అని పేర్కొంటు పోస్టు చేశారు. "నా జీవితంలో కాబోయే ముఖ్యమైన వ్యక్తి దొరికేశాడు. కొంతమంది మన జీవితాల్లోకి వచ్చి, 'మనం దేవుడికి అత్యంత ఇష్టమైన వ్యక్తి' అనే భావనను కలిగిస్తారు! నా సాధారణమైన రోజుల్లో కూడా వెలుగులు నింపి, నన్ను ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిగా భావించేలా చేసినందుకు ధన్యవాదాలు' అని కావ్య పోస్టులో రాసుకొచ్చారు.

జీవితాంతం కలిసే ఉంటాం
'కావ్య బాబు, నీతో సమయం గడుపుతున్నంతసేపు పర్వతాల దగ్గర కూర్చొని, పారే సెలయేరును చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. నీతో కలిసి చేసే చిన్న పని కూడా, ఎప్పటికీ ముగియకూడదనిపించే అందమైన వెకెషన్​లాగా ఉంటుంది. నీతో మాట్లాడే సంభాషణ, శీతాకాలపు పొద్దున్నే నాకిష్టమైన కాఫీ తాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఈ అనుభూతికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు తెలియలేదు. నీతో జర్నీ ఈ అనుభూతికి నాకు అర్థం తెలిసింది. ఆ భావనే కుటుంబం. తొలిసారి నిన్ను కలిసినప్పుడు, కొత్త వ్యక్తిలా అనిపించలేదు. నా ఇంటికి వచ్చినట్లు అనిపించింది. అప్పట్నుంచి వదిలి రాలేదు. మేమిద్దరం జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామనే విషయాన్ని మీతో ఆనందంగా షేర్ చేసుకుంటున్నాం' అని కాలభైవర పోస్టు చేశారు.

పుకార్లే నిజమయ్యాయిగా
అయితే కావ్య- కాలభైరవ లవ్​లో ఉన్నారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరు కలిసి ఈవెంట్లలో పాల్గొనడం, సోషల్ మీడియా పోస్టులతో హింట్ ఇచ్చారు. దీంతో వీళ్లు లవ్​లో ఉన్నారని టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ఈ ప్రచారాన్నే నిజం చేస్తూ ఈ జంట తమ విషయాన్ని అధికారికంగా ప్రకటించేసింది.

కాగా, కావ్య చైల్డ్ ఆర్టిస్ట్​గా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్​ అయ్యారు. ఆమె మసూద, బలగం సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాల్లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి కుమారుడే కాలభైరవ. ఆయన ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, అరవింద సమేత వీరరాఘవ రెడ్డి సినిమాల్లో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు.

'మీర్జాపూర్ ది మూవీ' సెన్సార్ కంప్లీట్ - ఒక్క సీన్ కూడా కట్ చేయలేదట?

'పుణ్యం - పురుషార్థం రెండూ ఒకేచోట - సీడ్ గణేశుడిని పూజించండి' - మెగాస్టార్ చిరంజీవి