'2012'లోనే నేపాల్ వరదలు ఊహించారా?- అప్పటి కల్పిత సినిమా నిజమైందా?- వైరల్ అవుతున్న సీన్స్!
నేపాల్ వరదల తర్వాత వైరల్‌గా మారిన 2012 సినిమా సీన్- హిమాలయాల వైపు భారీ అలలు వచ్చే సీన్‌పై నెటిజన్ల పోస్టులు

Published : August 27, 2026 at 7:20 PM IST
Nepal Floods 2026 : నేపాల్‌లో భారీ వరదలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు సృష్టిస్తున్నాయి. కొండల మధ్య నుంచి ఒక్కసారిగా భారీగా నీరు దూసుకొచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన కొందరికి 2009లో వచ్చిన హాలీవుడ్ మూవీ గుర్తుకొచ్చింది. సినిమాలో కూడా హిమాలయాల వైపు భారీగా నీరు దూసుకొచ్చే సీన్స్ ఉండటంతో ఆ క్లిప్స్‌ను మళ్లీ షేర్ చేస్తున్నారు. దీంతో 17 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అసలు ఆ సినిమాలో ఏం చూపించారు? ఇప్పుడు నెటిజన్స్ ఎందుకు ఆ సినిమాను గుర్తు చేసుకుంటున్నారంటే?
2012లో ఆ సీన్ ఏంటంటే
జాన్ కుసాక్, అమాండా పీట్, చివెటెల్ ఎజియోఫోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 2012. ఈ సినిమా ప్రపంచం భారీ ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే కథతో ఇది తెరకెక్కింది. సినిమాలో భూమిపై పెద్ద ఎత్తున వాతావరణంలో మార్పులు మొదలవుతాయి. వాటి కారణంగా సముద్రంలో భారీ అలలు ఏర్పడి చాలా ప్రాంతాలను ముంచెత్తుతాయి. అందులో ఒక సీన్‌లో వరద నీరు హిమాలయాల వరకు చేరుతుంది. పర్వతాలపై ఉన్న ప్రాంతాల వైపు కూడా భారీ అలలు దూసుకొస్తాయి. మానవాళిని రక్షించేందుకు టిబెట్ పర్వత ప్రాంతంలో భారీ నౌకలను రహస్యంగా సిద్ధం చేసినట్లు కూడా సినిమాలో చూపించారు. అప్పట్లో ఈ సీన్స్ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలిచాయి.
Remember the giant flood scenes from the movie 2012?
— Surajit (@surajit_ghosh2) August 26, 2026
Flash floods as tall as mountains have struck parts of Tibet, while Nepal is also facing devastating flood events pic.twitter.com/Akweb0r0Wa
ఇప్పుడు వైరల్
సినిమా క్లిప్స్‌తో పాటు అప్పట్లో విడుదల చేసిన 2012 పోస్టర్ కూడా సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఆ పోస్టర్‌లో ఓ బౌద్ధ సన్యాసి కొండపై నిలబడి ఉండగా వెనుక నుంచి భారీ అల వస్తున్నట్లు చూపించారు. దానిపై 'ముందే హెచ్చరించారు' అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంటుంది. నేపాల్ వరద వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కొందరు ఆ పోస్టర్‌ను మళ్లీ షేర్ చేస్తున్నారు.'ఆ సినిమాలో అప్పుడే ఇదే తరహాలో సీన్ చూపించారు. ఇది 2012 సినిమా సీన్‌లా ఉంది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు 'ది డే ఆఫ్టర్ టుమారో' సినిమాను కూడా గుర్తు చేస్తున్నారు. కొండల మధ్య నుంచి వస్తున్న నీటి వీడియోలు చూస్తుంటే డిజాస్టర్ సినిమాల్లోని సీన్స్ గుర్తుకొస్తున్నాయని పోస్టులు పెడుతున్నారు.
CCTV footage from the Tibet–Nepal border looks straight out of The Day After Tomorrow or 2012. 🌊😨
— Citizen PulseX (@CitizenPulseX) August 26, 2026
Absolutely terrifying visuals and a stark reminder of how quickly extreme weather can turn catastrophic.
Nature doesn’t negotiate. It exposes our vulnerabilities.💔 https://t.co/vUZBBEFIpO pic.twitter.com/XPxxYq2ynk
2009లో వచ్చిన మూవీ
'2012' సినిమాకు రోలాండ్ ఎమెరిచ్ దర్శకత్వం వహించారు. 'ప్రపంచం అంతమయ్యే పరిస్థితులు వస్తే ఏం జరుగుతుంది?' అనే కల్పిత కథతో ఈ సినిమాను రూపొందించారు. భూకంపాలు, భారీ అలలు, అగ్నిపర్వతాలు వంటి అనేక ప్రకృతి విపత్తులను ఇందులో చూపించారు. ముఖ్యంగా హిమాలయాల వరకు నీరు చేరే సీన్ అప్పట్లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది. ఇప్పుడు నేపాల్‌లో వరదలకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో అదే సీన్ మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చింది.
The scenes fromm Nepal are exactly like the 2012 movie.... https://t.co/kmgcUjon8F
— I AM THE OFFICIAL OPPOSITION (@PossumBlu) August 26, 2026
నేపాల్‌లో ఏం జరిగిందంటే?
నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం భారీ వరదలు వచ్చాయి. కొండల్లో పేరుకుపోయిన భారీ మంచు, రాళ్లలో ఒక భాగం కూలిపోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు దిగువ ప్రాంతాలకు వచ్చింది. భోటే కోషి నదిలో నీటి ప్రవాహం భారీగా పెరగడంతో సమీప గ్రామాలు, రోడ్లు, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో నీటితో పాటు బురద, రాళ్లు కూడా కొట్టుకొచ్చాయి. అధికారులు, సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నేపాల్‌లో కనీసం 157 మంది ప్రాణాలు కోల్పోగా, 400 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. గల్లంతైన వారిలో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
'ఏమీ మిగల్లేదు'- భూకంపంలా విరుచుకుపడ్డ జలప్రళయం- ప్రత్యక్ష సాక్షుల కన్నీటి గాథలు!
'నేపాల్, మీరు ఒంటరి కాదు- మీకు మేమున్నాం'- ఆకస్మిక వరదలపై సోనూసూద్ పోస్టు

