ETV Bharat / entertainment

మూవీ కథ విని 17మంది హీరోలు, 21మంది నిర్మాతలు నో- కట్​ చేస్తే బాక్సాఫీస్​ వద్ద సెన్సేషన్- ఏ సినిమానో తెలుసా?

17 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన ఒక డార్క్ క్రైమ్ థ్రిల్లర్ కథ - ప్రజలు చూడలేరని 21 మంది నిర్మాతలు బ్యాక్​ స్టెప్​ - కల్ట్​ క్లాసిక్​ మూవీ కథ ఇదే!

Movie
Movie (GETTY IMAGES)
author img

By ETV Bharat Telugu Team

Published : January 8, 2026 at 9:11 AM IST

|

Updated : January 8, 2026 at 9:32 AM IST

3 Min Read
Choose ETV Bharat

Movie Director Efforts : సినిమా ఇండస్ట్రీలో ఒక కథను అందరూ మెచ్చుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒక దర్శకుడు తన దగ్గరున్న ఒక అదిరిపోయే కథను పట్టుకుని హీరోల చుట్టూ తిరుగుతున్నప్పుడు, అది చాలా రిస్కీ అని, మరీ డార్క్ గా ఉందని అందరూ తిరస్కరించారు. అప్పటి వరకు ఉన్న కమర్షియల్ లెక్కలకు ఈ సినిమా అస్సలు సరిపోదని చాలా మంది భావించారు. ఎంతో మంది స్టార్ హీరోలు, బడా నిర్మాతలు వద్దని చెప్పిన ఒక కథ చివరకు థియేటర్లలోకి వచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా ఏంటి? దాన్ని అందరూ ఎందుకు రిజెక్ట్ చేశారు? అసలు ఆ కథలో ఉన్న మ్యాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

17 మంది హీరోలు వద్దన్నారు
ఈ సినిమా కథను దర్శకుడు రామ్ కుమార్ రాసుకున్నప్పుడు అదొక మాస్టర్ పీస్ అని ఆయనకు తెలుసు. కానీ మార్కెట్ లెక్కల ప్రకారం అదొక పెద్ద రిస్క్ అని అందరూ భయపడ్డారు. దాదాపు 17 మంది హీరోల దగ్గరకు ఈ కథ వెళ్ళింది. కథ వినడానికి బాగున్నా, అందులో ఉండే హింస, ఆ సైకో కిల్లర్ క్యారెక్టర్ చూసి హీరోలు చేయడానికి వెనకడుగు వేశారు. అలాగే 21 మంది నిర్మాతలు కూడా ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టడానికి నిరాకరించారు. చివరకు హీరో విష్ణు విశాల్ ఆ కథలోని ఇంటెన్సిటీని గుర్తించి ఓకే చెప్పారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీకి చెందిన ఢిల్లీ బాబు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు రావడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.

ఆ క్రైమ్ థ్రిల్లర్ పేరే 'రాట్ససన్'
మనం మాట్లాడుకుంటున్న ఆ సంచలన చిత్రం మరేదో కాదు, 2018లో వచ్చిన 'రాట్ససన్'. విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా హిస్టరీలోనే ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. తెలుగులో బెల్లంకొండ హీరోగా ఈ సినిమాను 'రాక్షసుడు' టైటిల్ తో రీమేక్ చేసిన చేసిన విషయం తెలిసిందే. అప్పుడే పోలీస్ డ్యూటీలో చేరిన ఒక కుర్రాడు, ఊరిలో వరుసగా జరుగుతున్న స్కూల్ అమ్మాయిల హత్యలను ఎలా చేధించాడు అనేదే ఈ సినిమా కథ. ఆ కిల్లర్ ఎవరనే విషయాన్ని చివరి నిమిషం వరకు సస్పెన్స్​గా ఉంచడంలో దర్శకుడు పక్కాగా సక్సెస్ అయ్యారు. అమలాపాల్, రాధా రవి వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించి సినిమాకు మరింత బలాన్ని ఇచ్చారు.

విలన్ గిఫ్ట్స్- జిబ్రాన్ మ్యూజిక్
ఈ సినిమాలో విలన్ చేసే హత్యల తీరు ఆడియన్స్​ను సీటు అంచున కూర్చోబెడుతుంది. గిఫ్టులు ఇచ్చి అమ్మాయిలను ట్రాప్ చేసి చంపే ఆ సైకో కిల్లర్ క్యారెక్టర్ చూస్తే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్​లో ఉంటుంది. ఆ మ్యూజిక్ వింటుంటే వచ్చే భయం సినిమా ఇంపాక్ట్​ని రెట్టింపు చేసింది. ప్రతి సీన్ లోనూ టెన్షన్ కంటిన్యూ చేస్తూ, క్లైమాక్స్​లో వచ్చే ట్విస్ట్ తో ఆడియన్స్​ని షాక్​కు గురిచేశారు. అందుకే ఈ సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

సక్సెస్​తో పాటు విమర్శలు
సినిమా భారీ వసూళ్లు సాధించినా కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా మానసిక అనారోగ్యం ఉన్నవారిని చూపించిన విధానంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఒక మతానికి చెందిన వారిని విలన్​గా చూపించడంపై కూడా చర్చ జరిగింది. అయినప్పటికీ కంటెంట్​లో ఉన్న దమ్ చూసి ఆడియన్స్ వీటన్నింటిని పక్కన పెట్టేశారు. విష్ణు విశాల్ తన కెరీర్​లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ సినిమాను ఒక రికార్డ్ హిట్​గా మార్చారు. 17 మంది హీరోలు వదులుకున్న ఈ కథ, విష్ణు విశాల్​కి ఒక లైఫ్ టైమ్ హిట్ ఇచ్చింది.

కంటెంట్​ను నమ్మితే ఎలాంటి ఫలితం ఉంటుందో చెప్పడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. ఒక పోలీస్ స్టోరీని ఇంత పక్కాగా, ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం అప్పట్లో ఒక కొత్త ప్రయోగం. ఎవరైతే రిస్క్ అని వదిలేశారో వారందరికీ ఈ సినిమా రిజల్ట్ ఒక షాక్ ఇచ్చింది. ఇవాళ ఏ క్రైమ్ థ్రిల్లర్ సినిమా వచ్చినా రాట్ససన్​తో పోల్చి చూస్తున్నారంటే ఆ సినిమా ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.

టాలీవుడ్​కు సంక్రాంతి కళ- ప్రమోషన్లు స్కిప్ చేస్తున్న స్టార్లు!- ఆ ఒక్క హీరో తప్ప

ప్రభాస్‌ ఫ్యాన్స్​కు బిగ్​ అప్​డేట్​- 'ది రాజాసాబ్‌' టికెట్‌ ధరల పెంపు- ఎంతంటే?

Last Updated : January 8, 2026 at 9:32 AM IST