ETV Bharat / education-and-career
చదువుకుంటూనే డబ్బులు సంపాదించండి - మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు
డిజిటల్ ప్రపంచంలో అవకాశాలకు కొదవే లేదు - ఫ్రీలాన్సింగ్ మంచి ఆప్షన్ - పెట్టుబడి పెట్టకుండానే డబ్బులు సంపాదన - విద్యార్థులకు చక్కని వేదికగా మారుతున్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్

Published : January 6, 2026 at 10:21 AM IST
Students Earn Money Online : విద్యార్థులు ఈజీ డబ్బులు సంపాదించడం ఎలా అని ఆన్లైన్ వేదికల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈజీ డబ్బులు సంపాదిస్తూ చదువుకోవాలని చూస్తారు. ఆ క్రమంలో ఈజీ మనీ ముసుగులోకి వెళ్లి సైబర్ నేరగాళ్ల వలలో పడతారు. అంతేకాదు వారి విలువైన సమాచారం అంతా కేటుగాళ్లు దోచుకుంటూ ఉంటారు. ఇలా ఈజీ మనీ కోసం చదువుకు ఆటంకం కలగకుండా ఖాళీ సమయంలో ఆన్లైన్లో డబ్బు సంపాదించేందుకు ప్రస్తుతం అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ ప్రపంచం.
ఈ డిజిటల్ ప్రపంచంలో అంతా మన చేతిలోనే ఉంటుంది. మీకు నైపుణ్యాలు ఉంటూ కాస్త కష్టపడే మనస్తత్వం ఉంటే మీ జేబులో డబ్బులు గలగలలాడుతూ ఉంటాయి. దీంతో ఇంట్లో వాళ్లను డబ్బులు అడిగే బాధ తప్పుతుంది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ లోకంలో సంపాదన మార్గాలకు కొదవే లేదు. ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే డబ్బులు సంపాదించేందుకు ఉన్న మార్గాల్లో ఇవి కొన్ని మాత్రమే. ప్రస్తుతం వాటి గురించి తెలుసుకుందామా?
ఫ్రీలాన్సింగ్ మంచి ఆప్షన్ : మీలో ఏదో ఒక నైపుణ్యం ఉంటే ఫ్రీలాన్సింగ్ ఓ మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ ద్వారా లోగోలు, పోస్టర్లను రూపొందించవచ్చు. అలాగే కోడింగ్ రాయడం, వీడియో ఎడిటింగ్, డేటా ఎంట్రీ వంటి నైపుణ్యాలు ఉంటే వాటి ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఇందు కోసం Freelancer.in, fiverr, upwork వంటి వేదికలను పరిశీలించవచ్చు.
సబ్జెక్టులకు ఆన్లైన్లో బోధన : మీకు మ్యాథ్స్, ఇంగ్లిష్, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో మంచి పట్టు ఉందా? అయితే పాఠశాల విద్యార్థులకు ఆయా సబ్జెక్టులను ఆన్లైన్లోనే బోధించే మార్గాలును చూడండి. ఆన్లైన్ ట్యూటరింగ్ ద్వారా పార్ట్‌టైంగా పని చేసి డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. బోధించే గంటల ప్రకారం డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకోసం Vedantu, byjus, Chegg India వంటి వేదికలను ఉపయోగించుకోవచ్చు.
వీడియోలు చేసి పోస్ట్ చేస్తే డబ్బులు : మీ ఆసక్తిని ప్రకారం ఏదైనా అంశం(ఉదా: వంటలు, విద్య, టెక్నాలజీ, ట్రావెల్ తదితరాలు)పై ప్రత్యేకంగా వీడియోలు చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించే అవకాశాలు లేకపోలేదు. మీరు పోస్టు చేసే వీడియోలకు వచ్చే వ్యూస్, షేరింగ్ ఆధారంగా వీటికి కొంత మొత్తం డబ్బు అనేది వస్తుంది.
డిజిటల్ నోట్స్ రాయడం : విద్యార్థులు తమ హ్యాండ్రైటింగ్ లేదా డిజిటల్ స్టడీ నోట్సును ఆన్లైన్ వేదికలపై విక్రయించడం ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. అలాగే ఆన్లైన్ డేటా ఎంట్రీ సంబంధిత వర్క్‌ని కూడా ఎంచుకోవచ్చు. దీనికి ప్రత్యేక నైపుణ్యాలు ఏమీ అవసరం లేదు.
ఏదైనా అంశంపై ఆర్టికల్స్ రాయడం : కొందరికి ఏదైనా అంశంపై ఆర్టికల్స్ రాయడం అంటే ఇంతో ఇష్టం. అలాంటివారు పలువురు క్లయింట్ల కోసం వ్యాసాలు రాయడం, బ్లాగ్లు లేదా వెబ్‌సైట్‌కు కంటెంట్‌ని రాయడం వంటి మార్గాలను చూడవచ్చు.
కంటెంట్ క్రియేటర్లతో మాట్లాడి : చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు, కంటెంట్ క్రియేటర్లతో మాట్లాడి వారికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించే పద్ధతిని కూడా పార్ట్‌టైం జాబ్‌గా ఎంచుకోవచ్చు. ఇది కూడా ఆన్లైన్లో డబ్బులు సంపాదించే మార్గాల్లో ఒకటి. ఈ పద్ధతుల ద్వారా ఈజీగా డబ్బులను సంపాదించవచ్చు. కానీ చదువుతో పాటు ఇవీ కూడా ఉంటే డబ్బులకు మీ దగ్గర ఢోకా ఉండదు.
మీ టెన్త్, ఇంటర్ మెమోలు పోయాయా? - ఇలా చేస్తే సులభంగా తిరిగిపొందొచ్చు
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే వారికి గుడ్‌న్యూస్ - ఫాల్ సీజన్ నుంచి స్కాలర్‌షిప్‌ల పెంపు

