ETV Bharat / education-and-career

పీజీఐఎంఈఆర్‌లో ఒప్పంద ప్రాతిపదికన జాబ్స్​ - ఇలా దరఖాస్తు చేసుకోండి

ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌తో ఎంపిక - 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీకి మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీకి ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు

​PGIMER Jobs Notification
​PGIMER Jobs Notification (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 6, 2026 at 8:35 PM IST

3 Min Read
Choose ETV Bharat

PGIMER Jobs Notification: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌), చండీగఢ్‌ ఒప్పంద ప్రాతిపదికన 59 గ్రూప్‌- ఏ, బీ, సీ పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూలతో నియామకాలు జరుగుతాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) భారతదేశంలోని చండీగఢ్‌లో ఉన్న ప్రముఖ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం. ఇది జాతీయ ప్రాధాన్యత సంస్థగా గుర్తింపు పొందింది, దీన్ని 1962లో స్థాపించారు. ఈ సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య, పరిశోధనలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

ఖాళీలున్న పోస్టుల వివరాలు

పోస్టు: జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌)
ఖాళీలు: 4
అర్హతలు: సివిల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ డిప్లొమా.
వేతన శ్రేణి: నెలకు రూ.35,400-1,12,400.

పోస్టు: స్టోర్‌ కీపర్‌
ఖాళీలు: 6
అర్హతలు: మ్యాథ్స్‌/ ఎకనామిక్స్‌/ కామర్స్‌/ స్టాటిస్టిక్స్‌తో డిగ్రీ. మ్యాథ్స్‌/ ఎకనామిక్స్‌/ కామర్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఫైనాన్స్‌తో ఎంబీఏ.
వేతన శ్రేణి: నెలకు రూ.35,400-1,12,400.

పోస్టు: డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3
ఖాళీలు: 5
అర్హతలు: పదో తరగతి, ఏడాది వ్యవధి ఉన్న రేడియోగ్రఫీ డిప్లొమా/ సర్టిఫికెట్‌. ఏడాది ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వేతన శ్రేణి: నెలకు రూ.19,900-63,200.

పోస్టు: టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 (లాండ్రీ)
ఖాళీలు: 11
అర్హతలు: పదోతరగతి, ఐటీఐ, రెండేళ్ల అనుభవం.
వేతన శ్రేణి: నెలకు రూ.18,000-56,900.

ఎంపిక విధానం:
ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)తో ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. సీబీటీలో జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌లు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ 35 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి.

ప్రశ్నపత్రం డిగ్రీ/ డిప్లొమా స్థాయిలోనే ఉంటుంది. సీబీటీలో అర్హత మార్కులు పొందిన వారిని పోస్టుకు ఐదుగురు చొప్పున స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తేదీ, వివరాలను అడ్మిట్‌ కార్డ్‌లో తెలియజేస్తారు. దీన్ని వెబ్​సైట్​ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా 13 కేంద్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు

దరఖాస్తు దారులకు కావలసిన సమాచారం:
వయసు: 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీకి మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీకి ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1500. ఎస్సీ, ఎస్టీలకు రూ.800. దివ్యాంగులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16.02.2026
వెబ్‌సైట్‌:https://www.pgimer.edu.in/

పీజీఐఎంఈఆర్‌ గురించి: పీజీఐఎంఈఆర్‌ను 1960లో స్థాపించాలనుకున్నారు. కానీ 1962లో ప్రారంభించారు. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి సర్దార్ ప్రతాప్ సింగ్ కైరాన్, భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మద్దతుతో ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ లక్ష్యాలలో వైద్య రంగంలో ఉన్నత విద్యను అందించడం, నిపుణులను తయారు చేయడం, పరిశోధనలు జరపడం వంటివి ఉన్నాయి. పీజీఐఎంఈఆర్‌ని ప్రధానంగా పోస్ట్​ గ్రాడ్యుయేట్​ కోర్సుల కోసమే స్థాపించారు.

ఇక్కడ డాక్టర్ ఆఫ్ మెడిసిన్​లో మాస్టర్ ఆఫ్ సర్జరీ, సూపర్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సర్జరీ లాంటి కోర్సులు ప్రధానంగా అందుబాటులో ఉన్నాయి. అలాగే పీహెచ్​డీ, ఎమ్మెస్సీ, బీఎస్సీ నర్సింగ్​తో పాటు పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. అడ్మిషన్లు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ఆధారంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది అభ్యర్థులు ఇందులో సీటు కోసం పోటీ పడతారు. పీజీఐఎంఈఆర్‌ 2024 ర్యాంకింగ్​ ప్రకారం భారతదేశంలోని వైద్య కాలేజీలలో 2వ స్థానంలో ఉంది. ఇది పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోంది. ఇందులో అన్ని స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలలో శిక్షణ, పరిశోధన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

నిరుద్యోగులకు శుభవార్త - ఎంఓఐఎల్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్​లో డిప్యూటీ మేనేజర్ పోస్ట్​లు