ETV Bharat / education-and-career

డిగ్రీ అర్హతతో ఎన్‌ఐఏసీఎల్​లో 550 ఖాళీలు - తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టులు!

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ నుంచి అప్రెంటిస్ "నోటిఫికేషన్" - జులై 6 దరఖాస్తుకు గడువు!

NIACL Apprentice Notification 2026
NIACL Apprentice Notification 2026 (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 5, 2026 at 7:26 AM IST

2 Min Read
Choose ETV Bharat

NIACL Apprentice Notification 2026 : డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్​న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) 550 అప్రెంటిస్‌ ట్రైనీల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 06వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు. మరి, ఈ పోస్టులకు ఎవరు అర్హులు? తెలంగాణ, ఏపీలో ఎన్ని ఖాళీలున్నాయి? ఎలా అప్లై చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ముంబయిలోని ప్రధాన కేంద్రంగా గల ప్రభుత్వ రంగ సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్‌ శాఖల్లో ఖాళీగా ఉన్న 550 అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించిన ఖాళీలున్నాయి.

అప్రెంటిస్​షిప్ ట్రైనీ పోస్టుల వివరాలు :

మొత్తం ఖాళీలు : 550

  • ఆంధ్రప్రదేశ్​ - 17
  • తెలంగాణ - 18

అర్హతలు :

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైన విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి లేదా తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. అలాగే, స్థానిక భాషలో పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి :

అభ్యర్థుల వయసు జూన్ 1, 2026 నాటికి కనిష్ఠంగా 21 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఛాన్స్ ఉంటుంది.

స్టైపెండ్‌ :

ఎన్​ఐఏసీఎల్ అప్రెంటిస్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.12,300 స్టైపెండ్ లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు :

జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌(పురుషులు) అభ్యర్థులు రూ.944; మహిళలు రూ.708; ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.236 చెల్లించాల్సి ఉంటుంది.

పరీక్ష లేకుండానే వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు - నెలకు రూ.1లక్షకు పైగా వేతనం!

సెలక్షన్ ప్రాసెస్ :

ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులకు అబ్జెక్టివ్‌ టైప్​లో ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. అందులో కనబరిచిన ప్రతిభ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అలాగే, స్థానిక భాషా పరిజ్ఞానం ఉండాలి.

పరీక్ష విధానం :

ఆన్​లైన్​లో నిర్వహించే ఈ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. అందులో జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ అండ్‌ రిజనింగ్‌ ఆప్టిట్యూడ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ నుంచి 25 మార్కుల చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష కాల వ్యవధి 60 నిమిషాలు.

దరఖాస్తు విధానం :

తగిన అర్హతలు, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేయడానికి ముందు NATS పోర్టల్ https://nats.education.gov.in/ లో నమోదు చేసుకోవాలి. ఆపై ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : జూన్ 23, 2026.

ఆన్‌లైన్ అప్లికేషన్​కు లాస్ట్ డేట్ : జులై 6, 2026.

ఆన్​లైన్ ఎగ్జామ్ డేట్(ఆబ్జెక్టివ్) : జులై 12, 2026.

ఎన్‌ఐఏసీఎల్‌(NIACL) అప్రెంటిస్‌ ట్రైనీ ఉద్యోగ నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాలు, ఎలా అప్లై చేసుకోవాలి, ఇతర సందేహాలకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? - తక్కువ పోటీ, ఎక్కువ జీతం వచ్చే "టాప్ గవర్నమెంట్ జాబ్స్" ఇవే!

ఒత్తిడిలేని ఉద్యోగ జీవితాన్ని కోరుకుంటున్నారా? - "సలాడ్ కెరియర్" మీకు బెస్ట్ ఆప్షన్!